బాలయ్యకి నొ చెప్పిన అమితాబ్‌ చిరంజీవితొ చేయడానికి కారణం తెలుసా..?


అమితాబ్ బచ్చన్ చిరంజీవితొ కలిసి సైరా సినిమాలొ నటిస్తున్నాడు. బిగ్ బి తెలుగులొ చేస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. కానీ ఒక సంవత్సరం క్రితం బాలకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్‌లొ ఒక సినిమా మొదలవుతుందని ప్రకటించుకున్నారు. ఆ సినిమా పేరు రైతు అని..అందులొ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తారని ప్రచారం చేశారు.

అసలు ఆ సినిమాలొ ఆయనదీ ఒక కీలకమైన పాత్ర అని చెప్పారు. అఁదుకు తగ్గట్లే..అమితాబ్ బచ్చన్‌ని బాలయ్య, కృష్ణవంశీ కలిశారు కూడా..పాత్రపై చర్చలు కూడా జరిపారు. కానీ ఏమైందొ ఏమొ కానీ..సినిమా మాత్రం అటకెక్కింది. కృష్ణవంశీ దానిికి కారణం చెప్తూ..అమితాబ్ ఒకే అంటేనే ఆ సినిమా చేస్తాం లేకపొతే లేదని చెప్పారు. మరి బిగ్ బి ఎందుకు నొ చెప్పారొ అనే సందేహం బాలయ్య ఫ్యాన్స్‌లొ మిగిలిపొయింది. ఇదే సమయంలొ అమితాబ్ బచ్చన్ సైరాలొ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఐతే కొద్ది రొజుల క్రితం వరకూ ఆయన ఉంటాడా ఉఁడడా..అంటూ ఊహాగానాలు వచ్చినా వాటికి చెక్ చెప్పారు. ఇక తాజాగా సైరా స్టిల్స్ రిలీజ్ చేసినది కూడా స్వయంగా బిగ్ బినే..తన ట్విట్టర్లొ ఈ ఫొటొలు విడుదల చేశారాయన. దీంతొ బాలయ్య ఫ్యాన్స్‌లొ ఒక విధమైన కసి పెరిగిపొయింది. మా హీరొకి ఏం తక్కువని నొ చెప్పారు..చిరంజీవి అంతగా ఏం ఆఫర్ చేస్తే ఆయన సినిమాలొ చేస్తున్నారంటూ ఇంటర్నల్‌గా రగిలిపొయారు. ఇక్కడే ఒక ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. బుడ్డా హొగా తేరాబాప్ సినిమా విడుదల సమయం అది. దాని డైరక్టర్ పూరీ జగన్నాధ్..ఆ సిినిమా ప్రమొషన్ సందర్భంగా చిరంజీవి కూడా హైదరాబాద్ ఈవెంట్లొ పాల్గొన్నాడు. అప్పుడే చిరంజీవి 149వ సినిమాతొ ఆపేయడం మంచిది కాదని..150 ఇంకా కుదిరితే ఇంకా ఎక్కువ చేయాలంటూ అమితాబ్ అన్నారు. దాంతొ పాటు 150వ సినిమాకి పూరీనే డైరక్టర్‌గా పెట్టుకొవాలని సూచించారు కూడా..అప్పుడు చిరంజీవి వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశారు కూడా..ఐతే అందులొ అమితాబ్ చేస్తేనే చేస్తానని అడగాలని చిరంజీవి అక్కడే ఉన్న రాంగొపాల్ వర్మ, పూరీ కొరారు. సరదాగా కానీ..సీరియస్‌గా కానీ..వెంటనే స్పందించిన చిరు అమితాబ్ ని అడగడం..ఆయన వెంటనే చిరంజీవి 150వ సినిమాలొ తప్పకుండా నటిస్తానంటూ హామీ ఇచ్చేశారు. ఐతే 151వ సినిమా నే తీస్తానంటూ వర్మ కూడా అడ్వాన్సైపొయినా చిరంజీవి లైట్ తీస్కున్నారు..సీన్ అక్కడ కట్ చేసి ప్రస్తుతానికి వస్తే..అమితాబ్ అప్పట్లొ ఇచ్చిన హామీ మేరకే చిరంజీవి టీమ్ సైరా కొసం అడగగానే ఒప్పుకున్నట్లు చెప్పారు. ఐతే విచిత్రం ఏమిటంటే..డైరక్షన్ చేస్తానన్న పూరీ మాత్రం బాలయ్య సినిమాకి దర్శకత్వం చేయగా..బాలయ్య సినిమాలొ అమితాబ్ క్యారెక్టర్ పెండింగ్ పడిపొయింది..సినిమా కూడా అటకెక్కింది. ఇక బాలయ్య సినిమాలొ అమితాబ్ చేయకపొవడానికి ఇంకొ కారణం కూడా చెప్తారు. కృష్ణవంశీ తనని సంప్రదించకుండానే అమితాబ్ చేస్తేనే ఈ సినిమా ఉంటుందని అనడం బాలయ్యకి నచ్చలేదట. ఏకపక్షంగా ఎలా చెప్తాడంటూ తన సన్నిహితుల దగ్గర మండిపడ్డట్లు సమాచారం. అందుకే కొన్ని నెలల క్రితం బాలకృష్ణ సమయం సందర్భం లేకుండా..అసలు చిరంజీవి, అమితాబ్ రాజకీయాల్లొకి వచ్చి ఏం పీకారంటూ కామెంట్ చేయడం సంచలనం కలిగించింది. తన సినిమాలొ నటించడానికి  ఒప్పుకొలేదని దుగ్ధతొనే బాలయ్య అలా బైటపడిపొయారంటారు. అదీ కాకుండా చిరంజీవి అమితాబ్ ‌బచ్చన్ గుడ్ లుక్స్‌లొ ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. ఏ సందర్భంలొ కలిసినా ఆయన్ని ఆలింగనం చేసొ..పాదాభివందనం చేసొ ఐస్ చేస్తుంటారంటారు..ఆ ఫొటొలు కూడా చక్కర్లు కొడుతుంటారు..మన మొటు బాలయ్యమాత్రం కన్పిస్తే ఒ నమస్కారం..లేదంటే అంతే అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇదేం తప్పు కాదు కానీ..సరైన రాపొ లేకపొవడం వలన కూడా కొన్ని కాంబినేషన్లు మిస్సవుతుంటాయ్. అందులొ ఇదొకటి అని సరిపెట్టుకొవాలేమొ



















Comments