సినిమా రంగం ఎప్పుడెవరిని ఎలా ఎత్తేస్తుందో..ఎప్పుడు పాతాళానికి తొక్కేస్తుందో చెప్పలేం. లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ దిశా పఠానీ విషయం కూడా అంతే. కొన్నాళ్ల క్రితం వరకూ అసలు సోదిలో కూడా లేని ఈ హీరోయిన్ బాఘీ టూ హిట్ కావడంతో ఇప్పుడందరి దృష్టీ ఆమెపై పడింది.
అరేబియన్ హార్స్‌లా..జిరాఫీలా మెరిసిపోయే దిశా పఠానీకి ఒకప్పుడు కనీసం ఐదొందలు రూపాయలకి కూడా గతి లేదంటే ఎవరైనా నమ్ముతారా..కానీ ఆమే స్వయంగా ఈ విషయం చెప్తోంది కాబట్టి నమ్మక తప్పదు. అసలు దిశాపటానీ హాట్ ఫోటో షూట్లు కానీ మోడలింగ్ ఫోటోలు కానీ చూస్తే..కనీసం ఈమె రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉంటుంది అనుకోవడం సహజం..కానీ ఇంత అందగత్తె కూడా తన తొలి అవకాశం కోసం నానా అగచాట్లూ పడిందట. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..నాకు ఓ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అసలు నాకు ఎవడైనా ఛాన్స్ ఇస్తాడా అని కూడా అనుకునేదట. అలాంటి దిశా పఠానీ..ఇప్పుడు హాట్ పల్లీ బఠానీలా సేలవడం తమాషా అయిన విషయమే.
ఇంటి దగ్గర్నుంచి డిగ్రీ కూడా పూర్తికాకుండానే బాంబే వచ్చిన దిశా పఠానీ..తన దగ్గరున్న డబ్బు అయిపోయిన తర్వాత పడ్డ కష్టాలు ఇంకా దుర్భరం అని చెప్పింది. ప్రతి రోజూ ఎక్కడ ఆడిషన్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్లేదట. కొంతమంది ముందు బాగా రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడం..ఆ తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేసిన రోజులు కూడా ఉన్నాయట. దాంతో రోజుకి ఒక్క 500 రూపాయలు ఇచ్చినా చాలు మోడలింగ్‌కి రెడీ అయిపోయేదట. అద్దెకి ఉన్న ఇంటికి డబ్బు కట్టడం కూడా చేయలేకపోయేదట. టివీ యాడ్స్ ఒకటి అరా వస్తుండేవట..ఏ రోజు డబ్బు ఉంటే ఆ రోజు తినడం మిగిలిన రోజుల్లో పస్తులుండేదాన్ని అని దిశా పఠానీ గుర్తు చేసుకుంటుంది. నిజంగా దిశా పటానీ ఏదో బిల్డప్ కోసం చెప్తుంది అనుకోవద్దు..నా జీవితంలో నిజంగా పడ్డ కష్టాలివి అని దిశా పటానీ ఆవేదనగా నేహాధూపియా టివిషోలో చెప్పుకొచ్చింది..అలా అలా అగచాట్లు పడుతుండగానే..పూరీ జగన్నాధ్ లోఫర్ లో ఛాన్స్ వచ్చింది దిశాకి.. ఐతే అది కాస్తా ఫట్ అనడంతో తిరిగి నిరాశే ఎదురైంది. ఐతే ఈలోపే బాంబేలో టైగర్ ష్రాఫ్‌తో బేఫిక్రా లో కలిసి నటించడంతో కాస్త మోడలింగ్ ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు బాఘీ టూ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతానికి హాట్ బ్యూటీగా బాలీవుడ్ కీర్తించడం ప్రారంభమైంది. తమిళ దర్శకుడు, కుష్బూ భర్త అయిన సుందర్ తీస్తోన్న భారీ బడ్జెట్ సినిమా సంఘమిత్రలో కూడా ఈమెనీ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇది రూ.150కోట్ల ఖర్చుతో తీయబోతున్నారు. చూశారా..500 రూపాయలు ఇచ్చినా ఏదోక పాత్ర చేయడానికి సిద్దమైన దిశా పఠానీ..ఇప్పుడు ఏకంగా 150కోట్ల సినిమాలో హీరోయిన్..ఈ సంఘమిత్రలోనే శృతిహసన్ నటిస్తుందని ప్రచారం జరిగినా..చివరికి ఆమె తప్పుకుంది. బాహుబలిని తలదన్నే రీతిలో ఈ సినిమా నిర్మిస్తామని దర్శకుడు నిర్మాత సుందర్ ముందునుంచీ చెప్తున్నారు..ఆలా దిశా పఠానీ సంఘమిత్రలో నటించడంతో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తన రేంజ్ పెరిగిపోతుందని అంచనాలో ఉంది. ఐతే ఈ రేంజ్‌కి రావడానికి ఆమెకి కష్టాలు ఎక్కువ అయితే పడి ఉండొచ్చు కానీ..పట్టిన సమయం మాత్రం చాలా తక్కువే ఎందుకంటే 2015లో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది మూడంటే మూడే సంవత్సరాల్లో కోటిరూపాయల పారితోషికం అందుకుంటోంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఏం జరగడానికైనా ఒకే ఒక్క ఛాన్స్ రావాలి అని..
Comments
Post a Comment