యెహ...ఇదీ జేసీ అంటే ..జేసీబీలా తొక్కేస్తాడు ఎవర్నైనా..!


పడుకున్న గాడిదచేత లేపి తన్నించుకోవడమంటే..అప్పట్లో ఆ  దొంగకే తెలిసి ఉంటుంది..ఇప్పుడదే సామెత కడపలో  హడావుడి చేస్తోన్న రమేష్‌తో పాటు ఇతర తెలుగుదేశం లీడర్లకి అర్ధమై ఉంటుంది. ఎవరిమానాన వాళ్లు వచ్చి సంతాపంలాగా సిఎం రమేష్‌ని పలకలరించి కాస్త రొటీన్ డైలాగులు వేస్తుంటే..అప్పుడే ఎంటరైన జేసి దివాకర్ రెడ్డి బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచాడు.
అదీ ఇదీ అని చూడకుండా..తన నోటికి అద్దూ అదుపూ ఉండదని ప్రత్యర్ధులు చెప్పే మాటలను నిజం చేస్తూ భలే మాట్లాడాడు..ఆయన నోటి వెంట జాలువారిన ఆణిముత్యాలలో ఇవి కొన్ని మాత్రమే
" నేను మోడీ ఏపికి ఏమీ చేయడని ఎప్పుడో చంద్రబాబుకి చెప్పా..అసలు కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులూ చంద్రబాబుకి చాలా తెలుసు ఈయనకి పిచ్చిపట్టి ఈ దీక్ష చేస్తున్నాడు..దీక్షలతో ఉక్కూ రాదు..తుక్కూ రాదు.." " అసలు పురుగుల మందు వాడిన తిండి తినేవాళ్లకి నిజాయితీ ఎలా ఉంటుంది..ఈ దీక్షలలో నిజాయితీ లేదు "
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇంకొకళ్లు ఇంకొకళ్లు అయితే పరిస్థితి ఎలాగుంటుందో కానీ..అక్కడున్నది జేసీ కాబట్టి..ఎవడికి వాడే మొహం మొగలిపువ్వుల్లా పెట్టుకుని నవ్వుకున్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేదు.
నెక్స్ట్ ఎన్నికలలో ఎవరికి ఎడ్జ్ ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టమైనా..ఎవరికి ఎటు అభిమానం ఉంటే గెలుపు ఉంటుందని చెప్పుకుంటున్నారు అందుకే ఇలాంటి సమయంలో జేసీ కావాలనే టిడిపిపై కామెంట్లు చేస్తున్నారని కొందరి టాక్..ఎంత ప్లాన్డ్‌గా ఉంటే మాత్రం ఇంత చీప్ కామెంట్లు చేయడం ఏంటని టిడిపి జెండా మోసే కార్యకర్తలు వాపోతున్నారు..ఇలాంటి నేతలు ఏ పార్టీలో ఉన్నా..ఆ పార్టీకి లాయల్టీ సంగతి అటుంచి శల్యసారధ్యం చేస్తుంటారని వీరి వైఖరి చూసినవాళ్లు కామెంట్లు చేస్తున్నారు కింద వీడియోలో ఆయన కామెంట్లు ఉన్నాయ్ చూడండి
(వీడియో క్రెడిట్ సినిమా పాలిటిక్స్ యుట్యూబ్ సైట్ వి)
(video credits belongs to cinema politics)

Comments