ఎన్టీఆర్, కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి సరసన నాని ! మహేష్ పవన్ కల్యాణ్‌కే చేతకాని ఈ రికార్డ్ ఎలా సాధించాడో తెలుసా...


తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకూ హీరోయిజం అంటే హిట్లే..అలా మొదటి తరం నాయకుల తర్వాత దూసుకొచ్చిన ఎన్టీఆర్ ఈ విషయంలో సినిమాల వాసి పరంగా రాశిపరంగా రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత వచ్చిన హీరోలు కూడా దాన్ని కొనసాగించారు. ఐతే వీరిలో వరసగా ఆరేడు సినిమాలు హిట్ కొట్టిన సందర్భాలు తక్కువ..ఐతే అలా వరసగా ఆరు సినిమాలు హిట్ అయిన ప్రతి నటుడూ సూపర్‌స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇప్పటి సూపర్ స్టార్లైన పవన్ కల్యాణ్, మహేష్ బాబు మాత్రం ఈ ఫీట్ సాధించలేదు.ఐతే కాలక్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇప్పుడు అసలు ఆరు సినిమాలు తీయడానికి కనీసం ఆరేళ్లు పడుతుంటే ఇక హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ రికార్డు సాధించడం అంత సులువైన పని కాదు..బీభత్సమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఎన్టీఆర్‌కే వరసగా 6 సినిమాలు హిట్ అయిన దాఖలాలు ఒకటో రెండో కన్పిస్తాయి. వాటిలో కొన్ని హిట్ కాలేదని..కొన్ని యావరేజ్ అని అలా చాలావరకు కలెక్షన్ల లెక్కలలో గందరగోళం ఉండేది. అందుకే 1977లో దానవీర శూరకర్ణ, అడవిరాముడు, ఎదురీత, చాణక్యచంద్రగుప్త, మా ఇద్దరి కథ, యమగోలని లెక్కపెడితే వాటిలో ఎదురీత ఫ్లాప్ అనేవాళ్లున్నారు. అందుకే ఇంకాస్త వెనక్కి వెళ్లి చూస్తే అంటే సినిమాలకు స్వర్ణయుగంగా భావించే 1960లలో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 1962లో భీష్మ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, స్వర్ణమంజరి, రక్తసంబంధం, ఆత్మబంధువు, శ్రీకృష్ణార్జునయుధ్దం డబుల్ హ్యాట్రిక్‌గా ఏకగ్రీవంగా చెప్పుకోవచ్చు. ఐతే వీటిలో పురాణపాత్రలు, కామెడీ, రాజసం, జానపదం, కరుణ రస పాత్రలు ఉట్టిపడే సినిమాలతో ఒకే హీరో విజయాలు సాధించడం అన్న తారకరామునికే సాధ్యం. ఇప్పుడు చెప్పిన సినిమాలు తెలుగుచలనచిత్రచరిత్రలోనే క్లాసిక్స్‌గా మిగిలిపోతాయ్.
ఆ తర్వాత రాశిపరంగా రికార్డుల మోత మోగించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఇప్పుడేదైతే హండ్రెడ్ డేస్ కాదు..కలెక్షన్లే ముఖ్యం అనే ట్రెండ్ ప్రకారం హిట్ల మీద హిట్లు కొట్టింది కృష్ణనే..రికార్డు టైమ్‌లో పూర్తి చేయడం రిలీజ్ చేయడం..అదే సినిమా థియేటర్లో మరో సినిమా విడుదల కావడం ఈయన కెరీర్లో చాలాసార్లు జరిగాయ్. అలా హండ్రెడ్ డేస్, ఫిఫ్టీ డేస్ రన్ పరంగా చూస్తే..చాలాసార్లు డబల్ హ్యాట్రిక్ మిస్సయ్యారు సూపర్ స్టార్. 1979లో మూడు పువ్వులు ఆరుకాయలు,  ఇద్దరూ అసాధ్యులే, వియ్యాలవారి కయ్యాలు
హేమాహేమీలు, దొంగలకు సవాల్, కొత్త అల్లుడు, ఎవడబ్బ సొమ్ము, మండేగుండెలు చిత్రాలను చూస్తే, ఎవడబ్బ సొమ్ము ఫ్లాప్..కానీ మిగిలినవన్నీ హిట్టే...అలానే ఆ తర్వాతి సంవత్సరంలోనే అంటే 1980లో అల్లరి బావ, బంగారు బావ, ఊరికి మొనగాడు, తోడుదొంగలు, గురుశిష్యులు, రహస్యగూఢచారి, భోగిమంటలు, భోగభాగ్యాలు, గడసరి అత్త సొగసరి కోడలు-9 హిట్లు ఇచ్చిన రికార్డు కృష్ణ సొంతం.. ఐతే వీటిలో మొదటి రెండు సినిమాలు యావరేజ్ అంటారు. ఫ్లాప్ కాలేదు కాబట్టి హిట్ట్ అంటారు ఆయన ఫ్యాన్స్. తర్వాత 1982లో పగబట్టిన సింహం, కృష్ణావతారం, ఏకలవ్య, షంషేర్ శంకర్, కలవారి సంసారం, ఈనాడు సినిమాలకు ఇదే వాదన. ఏకలవ్య ఫ్లాప్ అంటారు. కానీ హిట్టనేవారూ ఉన్నారు. కానీ 1983లో రామరాజ్యంలో భీమరాజు, శక్తి, ప్రజారాజ్యం, లంకెబిందెలు, పోరాటం, ఇద్దరుదొంగలు డబుల్ హ్యాట్రిక్‌గా అందరూ అంగీకరించాల్సిందే. ఇలా ఎన్టీఆర్ కృష్ణలు డబుల్ హ్యాట్రిక్ హీరోలు అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య కెరీర్ బిగినింగ్‌లో డల్ అయినా తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెచ్చిపోయాడు. 1986లో  ముద్దుల కృష్ణయ్య, సీతారామకల్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోధ్దారకుడు, కలియుగ కృష్ణుడు,అపూర్వసహోదరులు, భార్గవరాముడు, రాముతో అలరించాడు. ఐతే ఈ వరసలో ఆరో సినిమా అయిన అపూర్వసహోదరులు ఫ్లాప్ అయింది..కానీ తర్వాత విడుదలైన భార్గవరాముడు బిలో యావరేజ్ కాగా.. రాము హిట్.. అలా బాలకృష్ణ కూడా ఒకే ఏడాదిలో ఆరు హిట్లు ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ హీరో అన్పించుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే 1987-88 మధ్య చక్రవర్తి, పసివాడి ప్రాణం, స్వయంకృషి, జేబుదొంగ, మంచిదొంగ, రుద్రవీణ, యముడికి మొగుడు, ఖైదీనంబర్ 786మరణమృదంగం విడుదల అయ్యాయ్. వాటిలో స్వయంకృషిని కూడా హిట్ మూవీ కింద లెక్కేస్తే రుద్రవీణ్ ఫ్లాప్, అలా ఒకే ఏడాదిలో ఆరుహిట్లు ఇచ్చిన హీరోగా చెప్పుకోవచ్చు. కానీ కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు అంటే 1998లో హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు అన్నయ్య సినిమాలతో రియల్ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు.

ఇక ప్రస్తుతానికి వస్తే ఏ హీరో కూడా వరసగా సినిమాలు చేయడం లేదు. అందులో ఒకే ఏడాది గ్యాప్‌లో అసలు రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి దశలో చిన్న బడ్జెట్ హీరోగా వచ్చి తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతోన్న నాని మాత్రం ఈ ఫీట్ సాధించాడు భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్ మెన్, మజ్ను, నేను లోకల్, నినుకోరి, ఎంసిఏ హిట్లతో నాటి నేటి అగ్రతరం హీరోల సరసన నిలుచున్నాడు. మరి ఇతర హీరోలు ఇలాంటి డబుల్ హ్యాట్రిక్కులు సాదించారా అంటే మోహన్ బాబు కాస్త దగ్గరగా వచ్చినా ఓ ఫ్లాప్ పడటంతో ఆ ఫీట్ మిస్సయ్యాడు. అది 1990లలో..అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ హిట్ల తర్వాత రౌడీగారి పెళ్లాం కూడా విజయం సాధించింది కానీ అ తర్వాత వచ్చిన బ్రహ్మ నిరాశ పరచగా..ఆయన మోత్రం నో డౌట్ బ్రహ్మ హిట్టే అనేవాడు. కానీ ఆ తర్వాత వచ్చిన డిటెక్టివ్ నారద బోషాణం బద్దలు చేసింది. తదుపరి చేసిన అల్లరిమొగుడు మాత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పటి సూపర్ స్టార్లైన మహేష్ బాబు, కానీ పవన్ కల్యాణ్ కానీ ఈ ఆరు హిట్ల రికార్డుని టచ్ చేయలేదు. అసలా ఆలోచన ఉన్నట్లు కూడా కన్పించదు. అందుకే 21వ శతాబ్దంలో డబుల్ హ్యాట్రిక్ తెలుగుహీరో అంటే నానినే చెప్పుకోవాలి.

Comments