ఇంట గెలిచి రచ్చ గెలువాలనేది సామెత అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకూ మాత్రం ఇది చాలామంది విషయంలో రివర్సైంది. అలా పొరుగురాష్ట్రంలో టాప్ హీరోయిన్‌గా మారిన మన తెలుగు అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈమె తెలుగులో చాలా చెల్లెలి క్యారెక్టర్లు చేసింది. సడన్‌గా మాయమైపోయింది. ఉన్నట్లుండి హీరోయిన్ అంటూ ఒక ప్రేమకథా చిత్రంతో తెరపైకి వచ్చింది. అదే ప్రేమఖైదీ. హరీష్ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా అది..దాంతో మాలాశ్రీ అనే ఒక కొత్త హీరోయిన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిందనుకున్నారు. అంతేకానీ అంతకుముందు ఆమె చేసిన చిన్నా చితకా క్యారెక్టర్లను పట్టించుకోలేదు. అప్పట్లో శ్రీదుర్గ పేరుతో చేసిన క్యారెక్టర్లను మర్చిపోయారు.
మాలాశ్రీది తెలుగు కుటుంబం. చెన్నైలో పుట్టిన శ్రీదుర్గ అలియాస్ మాలాశ్రీ వెండితెరకి చిన్ననాడే పరిచయం అయింది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాలాశ్రీ 30 సినిమాల్లో నటించగా..అందులో 26 సినిమాలు అబ్బాయిగా కన్పించిందట. ఇమయం అనే తమిళ సినిమా ఆమెకి ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫస్ట్ మూవీ. తర్వాత అలా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమెకి పెద్ద కుదుపు తల్లి చనిపోవడం. అది కూడా రోడ్డు ప్రమాదంలో..1989లో నంజుండి కల్యాణ అనే కన్నడ
సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. హీరోయిన్‌గా చేస్తూనే అప్పుడే తెలుగులో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేసిందామె..వాటిలో బాలకృష్ణ నటించిన దొంగరాముడిలో ఆయన చెల్లెలి క్యారెక్టర్ కాగా..చిన్నారి స్నేహం అనే సినిమాలో ముఖ్యపాత్రలలొ ఒకదాన్ని చేసింది. ఐనా పెద్దగా పేరు రాలేదు. అప్పుడే పేరు మార్చుకుని ప్రేమఖైదీలో నటించగా..అది సక్సెస్ అయింది. విచిత్రంగా ఆమెకి తెలుగులో ఒక్క ఛాన్సూ రాకపోగా..కన్నడంలో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయ్. అది కూడా 42 సినిమాలు..అన్నీ సూపర్ హిట్లే..1990 నుంచి 1993 అంటే నాలుగేళ్లలో 42 సినిమాలంటే ఎంత బిజీ ఆర్టిస్ట్‌గా మారిందో ఆర్ధం చేసుకోవచ్చు.
మొదట్లో ఆమె పెద్ద నటి కాదు అనే విమర్శలు రావడంతో రాణి మహారాణి అనే డ్యూయల్ రోల్ సినిమాతో వాళ్లకు జవాబు చెప్పింది. ఆమె క్రేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే, రవిచంద్రన్ అనే నటుడు ఆమెతో తమిళ చిన్నతంబిని రామాచారి పేరుతో రీమేక్ చేసి తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఇతగాడు అంతకు ముందే నాగార్జునతో శాంతిక్రాంతి చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇది డ్యూయల్ వెర్షన్ సినిమా తమిళ్, కన్నడంలో పనికొచ్చేలా రజనీకాంత్, రవిచంద్రన్‌తో..తెలుగులో నాగార్జున, రవిచంద్రన్ చేశారు. అలానే ఈ నాలుగేళ్లలో ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు మాలాశ్రీ. కన్నడనాట ఆమెకి కనసిన రాణి అంటే డ్రీమ్ గాళ్ అని నిక్ నేమ్
కూడా ఉంది. తిరిగి తెలుగువారిని మాలాశ్రీ మళ్లీ సురేష్ ప్రొడక్షన్స్ తీసిన పరువు ప్రతిష్టతోనే పలకరించింది. ఐతే అందులో కూడా కన్నడిగుల పాత్రే ఎక్కువ విసి గుహనాధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినేమాలో ఒకప్పటి కన్నడ హీరో చంద్రకాంత్ కూడా తెలుగువారిని మళ్లీ పలకరించాడు. అలా తెలుగులో మళ్లీ మాలాశ్రీ నటించడం ప్రారంభమైంది. ఐతే కన్నడంలో రెబల్ క్యారెక్టర్లు తిరుగులేని ధీరోధాత్తమైన క్యారెక్టర్లు చేసిన మాలాశ్రీ తెలుగులో
మాత్రం ఆడిపాడే గ్లామర్ హీరోయిన్‌గానే చూశారు. కాకపోతే మధ్యలో హిందీ రీమేక్ దామినిని తమ్మారెడ్డి భరద్వాజ ఊర్మిళ పేరుతో నిర్మించారు. అందులో మంచి మార్కులే కొట్టేసినా..ఆ సినిమా తర్వాతే ఆమె జీవితంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది.
తనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన సునీల్ అనే కన్నడ నటుడిని మాలాశ్రీ ప్రేమించింది. రేపో మాపో పెళ్లి చేసుకుంటారనగా..ఒక కారు ప్రమాదంలో అతను మరణించాడు. బగల్ కోటే నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ విషాదం సంభవించింది. ఆ సమయంలో మాలాశ్రీ అతని పక్కనే ఉంది కూడా..ఇదే ప్రమాదంలో మాలాశ్రీ కూడా గాయపడింది. ఈ ప్రమాదమే ఆమె జీవితాన్ని మార్చేసింది. తెలుగులో కృష్ణ, మోహన్‌బాబు, సుమన్, సురేష్ వంటి హీరోలతో నటిస్తూ..కన్నడంలో మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి అడ్రస్‌గా మారింది. కన్నడంలో డిస్ట్రిబ్యూటర్‌గా పేరుతెచ్చుకుని సినిమాలు నిర్మించడం మొదలుపెట్టిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ రాముని పెళ్లాడింది. ఈ మధ్యలోనే ఆమె చెల్లెలు శుభశ్రీ కూడా హీరోయిన్ గా తెరపైకి వచ్చింది. ఐతే ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్లే చేసి ఆ తర్వాత తెరమరుగు అయింది. మాలాశ్రీ విషయానికి వస్తే 1994నాటి యాక్సిడెంట్ ప్రభావంతో బాగా లావైపోయి..తనకోసం మాత్రమే తయారైన క్యారెక్టర్లు చేస్తూ..గ్లామర్ డాల్‌గా కన్పించడం మానేసింది. మాలాశ్రీ పనైపోయింది అని ఎగతాళి చేసిన ప్రతిసారీ హిట్ కొట్టి లైమ్‌లైట్‌లోకి రావడం ఆమె స్పెషాల్టీ.
2015లో గంగ అనే సూపర్ హిట్ కొట్టిన ఈమె ప్రస్తుతం బాయ్స్, మాలాశ్రీ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటి కోసం డైట్ కంట్రోల్ చేసి లావు తగ్గడం విశేషం. చేసిన 58 సినిమాల్లో 55 సినిమాలు హండ్రెడ్ డేస్ సినిమాలు ఉండటం కన్నడనాట ఒక్క మాలాశ్రీకే సొంతం..ఇంత ఘనత సాధించిన తెలుగు లేడీ మాలాశ్రీ తొందర్లోనే తెలుగుతెరపై కూడా కన్పిస్తే చూడాలని చాలామంది అనుకోవడంలో తప్పులేదనుకుంటా
Comments
Post a Comment