ఇదీ యోగా పవర్..ఐదు లక్షల కోట్ల వ్యాపారం


ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం..ఇది నాలుగోది. యోగాసనాలను వేయడంలో భారతీయలు దిట్ట. ఇది ఇప్పటిది కాదు వేదాల కాలం నాటిది అని అంటారు. ప్రపంచం మొత్తానికి మన యోగవిద్యని అందించాలని ప్రధానమంత్రి మోడీ మొదటగా ప్రతిపాదించగా..ఐక్యరాజ్యసమితి దాన్ని ఆమోదించి వరల్డ్ యోగాడేగా ఈ రోజుని ప్రకటించింది యోగవిద్య కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదు..ఈ పునాదిగా ఎంత వ్యాపారం జరుగుతుందో తెలిస్తే హా..శ్చర్య పోతారు.
మన భారతదేశంలోనే 2లక్షలమంది యోగా శిక్షకులు ఉన్నారు. ఇంకా 5లక్షల మంది యోగా ట్రైనర్ల అవసరం ఉంది. మన దేశంలోని హరిద్వార్, రిషికేష్ నుంచి వెళ్లిన 3వేలమంది యోగశిక్షకులు చైనాలో తమ విద్యను పంచుతున్నారు. యోగాసనాలు నేర్చుకోవడానికి ప్రతి నెలా రూ.5వేల నుంచి రూ.25వేల వరకూ భారతీయులు ఖర్చు పెడుతున్నారు. ఇక అమెరికాలో అయితే ఏడాదికి 11 బిలియన్ డాలర్లు యోగా కోసం ఖర్చు అవుతోందట. 2008లో అమెరికన్లు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఇది 88శాతం ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద చూస్తే
యోగాని వ్యాపారంగా చూస్తే, 80 బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది. ఇది మన రూపాయలలో 54,55,60,00,00,000.00 (ఐదులక్షల 45వేల కోట్లకిపై మాటే). ఈ 80 బిలియన్ డాలర్లలో 30 బిలియన్ డాలర్ల వ్యాపారం అమెరికాలోనే జరుగుతుంది. అంటే యోగాపై ప్రపంచంలో అతి ఎక్కువ ఆసక్తి చూపుతోన్న దేశం అమెరికానే. రెండు కోట్ల మంది అమెరికన్లు రోజూ యోగా చేస్తారట. మన దేశంలో జూన్ 21న జరిగే యోగా దినోత్సవం కోసం రూ.34.50కోట్లు ఖర్చు చేస్తారు( ఈ లెక్క 2015,2016 ఆధారంగా వేసింది)
ఇప్పుడు చాలామంది ప్రముఖులుగా చలామణీ అవుతున్నవారు కేవలం యోగా ద్వారానే ఆ పేరు తెచ్చుకున్నారంటే ఆశ్చర్యమే.  యోగి మహర్షి, రవిశంకర్,రామ్‌దేవ్ వారిలో కొద్దిమంది. రామ్ దేవ్ తన వ్యాపారాన్ని పదివేల కోట్ల రూపాయల  ఆదాయం సైజుకి తీసుకురావడానికి పునాది యోగానే. ఇప్పటికీ ఆయన తన యోగా క్యాంపులలో రూ.1000-రూ.2000 వరకూ ఛార్జ్ చేస్తారు..అదీ యోగా బిజినెస్ పవర్

Comments