ఆ 4 రోజులు కూడా తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం ఉంటుంది ఎలానా..?


మహా ఘట్టం ఒకటి తిరుమలలో జరగనుంది.అందుకే నాలుగు రోజుల పాటు స్వామి దర్శనం కూడా రద్దు చేశామని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది..ఐతే అది పూర్తిగా రద్దు కాదు. ఎలానంటే మహా సంప్రోక్షణ పేరుతో ఆలయం మొత్తం శుధ్ది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇలా ఎప్పుడూ చేయలేదు..దాదాపు 50 ఏళ్లలో ఇలా జరగలేదు. నడకదారిన కావడిపై మనుషులను తీసికెళ్లిన రోజుల్లో ఏం జరిగిందో మనం చూసి ఉండం. ఎందుకంటే 1940-50ల మధ్యలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి రోజుకి 50మంది కంటే ఎక్కువ వెళ్లలేదని అంటారు
అలాంటిది ఇప్పుడు కొన్ని రోజులకు రోజులు దర్శనం లేదంటే వినడానికి కాస్త దిగులు కలిగించే అంశం. ఎందుకంటే గ్రహణ సమయాల్లో తప్ప మనం తిరుపతి గుడి మూశారనే వార్త వినలేదు.

ఐతే మరీ ఇలా తిరుమల ఆనంద నిలయం మూత పడిందనే అపశకునం వార్త వినకూడదని..టిటిడి భక్తులు తిరుమల రావచ్చని ఆహ్వానిస్తోంది. ఐతే శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహ దర్శనం మాత్రం ఉఁడదని మిగిలిన ఆలయాలు పుష్కరిణి, పాపనాశనం..చక్కగా దర్శించుకోవచ్చని చెప్తోంది. ఇక స్వామి దర్శనానికి కూడా మిగిలిన ఏకైక మార్గం కూడా ఒకటి ఉంది..అదే సుప్రభాత ఏకాంత సేవ మాత్రం యధావిధిగా ఉంది.. కాబట్టి..ఆర్జిత సేవలు,,విఐపి దర్శనాలు, దివ్యదర్శనం అన్నీ  పోగా..ఒక్క సుప్రభాత సేవలో మాత్రం ఏడుకొండలవాడిని దర్శించుకునే భాగ్యం ఉంది..ఐతే ఇది మరీ భాగ్యవంతులకే రిజర్వ్ చేసి ఉండొచ్చు.

ఏదేమైనా ఈ మధ్యకాలంలో టిటిడిపైన..అందులో ఏదో జరిగిపోయిందనే వాదన మధ్య చోటు చేసుకుంటున్న వివాదాలు చూసినవాళ్లకి ఈ సమాచారం కాస్త మింగుడుపడని అంశమే..ఈ సంప్రోక్షణ ఏదో బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పెట్టుకుంటే బావుండు అన్పించకమానదు..కానీ విధి విధానాలు..టిటిడి అనివార్యతలు మాత్రం వచ్చే నెలకే మొగ్గు చూపినట్లు అన్పిస్తుంది

Comments