ఒక్క పోస్ట్ చేశాడంటే..81లక్షలు ఇచ్చుకోవాల్సిందే..కోహ్లీ పట్టిందల్లా బంగారమే గురూ


విరాట్ కోహ్లీ మరో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.  వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అండార్స్‌మెంట్లతో భారీ ఆదాయం ఆర్జిస్తున్నాడు కోహ్లీ..ఐతే ఇప్పుడు తన ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో పోస్టులు పెట్టినందుకు కూడా రికార్డు స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నాడు. ఇలా ఇన్ స్టాగ్రామ్ సెలబ్రెటీల లిస్టులో విరాట్ కోహ్లీకి ప్రపంచం మొత్తం మీద 17వ ర్యాంకు దక్కడం విశేషం. ఇప్పటికే ఫోర్బ్స్ స్పోర్ట్స్ పర్సన్స్ రిచ్చెస్ట్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీ కొత్తగా ఈ రికార్డుతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
హూపర్ హెచ్‌క్యు అనే సంస్థ పొందుపరిచిన నివేదిక ప్రకారం ఫోటో షేరింగ్ యాప్ ద్వారా విరాట్ కోహ్లీ ప్రతి పోస్టుకు లక్షా ఇరవైవేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే దాదాపుగా 81లక్షల 60వేల రూపాయలన్నమాట. 17వ ర్యాంకులో నిలిచినకోహ్లీ సంపాదనే ఇలా ఉంటే మరి నంబర్ వన్ సెలబ్రెటీ ఆదాయం ఎంతో తెలుసా 1.1 మిలియన్ డాలర్లు..అంటే 11లక్షల డాలర్లు.. కైలీ జెన్నెర్‌ పోస్టులకు ఇలా ఇంత ధనం చెల్లిస్తోంది ఇన్‌స్టా గ్రామ్. కేవలం తాము చేసే పోస్టుకే ఇంత సంపాదిస్తున్నారంటే డబ్బు సంపాదించడం వీరికి ఎంత సులభమో కదా అన్పించకమానదు. మిగిలిన స్పోర్ట్ స్టార్స్‌లో క్రిస్టియానో రొనాల్డో ఏడున్నరలక్షల డాలర్లు, బ్రెజిల్ సాకర్ స్టార్ నేమార్ ఆరు లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు

మామూలు జనం ఎడాపెడా పెట్టే పోస్టులకు ఎలాంటి గిరాకీ ఉండదు..లక్షల కొద్దీ వ్యూస్ కానీ..యూజర్ల ఫాలోయింగ్ ఉన్నా ప్రయోజనం అసలే ఉండదు కానీ ఇలాంటి సెలబ్రెటీల పోస్టులకు మాత్రం ఎక్కడ లేని డిమాండ్ ఉఁది. అటు సెలబ్రెటీలకు తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి వారితో మాటమంతీ కలిపేందుకు సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ఇక్కడే ఫేస్‌బుక్ వారి ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఎండార్స్‌మెంట్లు చేసుకుంటోంది. ఐతే ఇలా ఎవరిని పడితే వారిని ఎంచుకోరు. ఫాలోయర్లు సంఖ్య, పెడుతోన్న పోస్టుల పాపులారిటీ వంటివి పరిగణిస్తుంది. అలానే ఎంగేజ్ చేసుకున్న తర్వాత వారి పోస్టులకు వస్తోన్న ఆదరణ కూడా హోపర్ హెచ్‌క్యూ పరిశీలిస్తుంది. ఆ తర్వాతే ఇలా కోట్లకి కోట్లు గుమ్మరిస్తుంది 2012లో ఫేస్ బుక్ 715మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మరీ ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసింది.ప్రస్తుతం వందకోట్ల మంది యూజర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ని ఫేస్‌బుక్ తన అడర్టైజింగ్ కార్యక్రమాలకు బాగా వాడుకుంటోంది. 

Comments