బూతులు మాట్లాడటమే బోల్డ్‌నెస్సా...? అంతా ప్లాన్డ్‌గా


ఆ మధ్యన ఓ సినిమా వచ్చింది...మంచి ఉర్దూ బూతులు మాట్లాడుతూ దానికో పర్పస్ ఉన్నట్లు రోజూ జరిగేదే మేం చూపించామన్నట్లు అప్పట్లో తెగ సమర్ధించుకున్నారు ఆ సినిమా టీమ్ మెంబర్లు కూడా..ఇప్పుడా వేడి చల్లారింది. ఐతే అదే ట్రెండ్‌ అంటూ కొన్ని సిినిమాలు రిలీజ్ చేయడం బాల్చీ తన్నేయడం కూడా జరిగింది. ఇప్పుడో మోటార్ సైకిల్ టైటిల్ పెట్టుకుని వచ్చిన సినిమా కూడా యమగా ఉంది . సూపర్ హిట్టైంది..అంటూ తెగ  మోసేస్తున్నారు..నిజానికి సదరు సిినిమా కలెక్షన్లు  భూమి బద్దలైనంత రేంజ్‌లో ఏం లేవు..కానీ కొన్ని వెబ్‌సైట్లతో టై అప్ పెట్టుకుని రోజు వారీ కలెక్షన్లు ఇంత  చేసాయ్..అంత చేశాయ్ అఁటూ హడావుడి చేస్తున్నారు..సరే ఎవరి సినిమాకైనా ఇలానే జరుగుతుంటుంది కాబట్టి దాని గురించి ఆక్షేపణ చేయాల్సిన పని లేదు

కానీ ప్రతీ చోటా బూతులు మాట్లాడటం..అదే సొసైటీలో ఉందని చెప్పడం ఇదే బోల్డు టైప్ అన్నట్లుగా ప్రచారం జరగడమే ఆశ్చర్యం. ఎక్కడైనా మంచి చేస్తే దాన్ని ప్రోత్సహించాలి. లేకపోయినా హాని చేయకుండా ఉండాలి. అంతేకానీ నేను సినిమావాడ్ని ఎలానైనా మాట్లాడతా..అంటే కుదరదు.. ఇష్టం వచ్చినట్లు తిరగడం..పెళ్లికి ముందే కామకలాపాలు సాగించడం మందు కొట్టడం..అన్నీ చేసేవాడిని హీరోగా చూపించడంపై ఇప్పటికే సామాన్యజనంలో చాలామందికి అభ్యంతరాలున్నాయ్..పైగా సదరు సినిమా పోస్టర్లపై ఎక్కడా సెన్సార్ చెప్పిన నో స్మోకింగ్ సైన్ కానీ..బ్యాన్ ఆన్ లిక్కర్ ప్రొడక్ట్స్ సైన్ కానీ లేవు..ఐనా ఇవన్నీ...పట్టించుకునేవాళ్లు లేరు. ఎందుకంటే జనాభిప్రాయానికి సినేమావాళ్ల లెక్కలు సరిపోలవు.
 షకీలా సినిమాలు ఆడాయి కదాని అవి మంచివని చెప్పరు కదా...ఆడిన ప్రతి సినిమా గొప్పది కాదు..ఆడని సినిమా చెడ్డది కాదు. కనీసం వ్యక్తిగతంగా అయినా వ్యతిరేకించే స్వేఛ్చ ఉంది కదా అనే ఈ కలం శోష

Comments