ఈ నటులు తెరపైనా తండ్రీకొడుకులే... ఏది హిట్ట్ ఏది ఫ్లాప్


తెలుగు తెర హీరోయిజం అద్దుకున్న తర్వాత తొలి తరం నటులుగా పేరుబడ్డ ఎన్టీఆర్, ఏఎన్నార్..తర్వాతి తరం హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. వీరిలో ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణల వారసులు కూడా తెలుగు తెరపై సూపర్‌స్టార్లుగా విరాజిల్లారు. ఐతే వీరిలో కొందరు తెరపై కూడా తండ్రీకొడుకుల క్యారెక్టర్లలో నటించగా..కొందరు అన్నా తమ్ముళ్ల పాత్రలు కూడా చేశారు. వారిలో ముందు వరసలో ఉండేది ఎన్టీఆర్, బాలకృష్ణ. బాలకృష్ణ విషయానికి వస్తే తన నటజీవితం తొలినాళ్లలో చేసిన ప్రతి సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించినదో..పాత్ర ధరించినదో కావడం విశేషం. ఎందుకంటే అప్పటికి బాలయ్య చాలా యంగ్..టీనేజ్ కూడా పూర్తవలేదు అప్పటికి వాటిలో తాతమ్మకల, రామ్ రహీమ్ సినిమాలు మొదటివి. ఆ తర్వాత సినిమా అన్నదమ్ముల అనుబంధం హిట్ మూవీ..ఇందులో బాలయ్య
ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత వచ్చిన వేముల వాడ భీమకవి, దానవీర శూరకర్ణలో ఒకదానిలో మాత్రం కొడుకుగా నటించారు.  అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట్ పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, రౌడీరాముడు కొంటె కృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినేమాలలో అక్బర్ సలీం అనార్కలి సినిమాలో మాత్రం తండ్రీ కొడుకులుగా కన్పిస్తారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర
సినిమాలో అయితే బాలయ్య దుష్యంతుడు, హరిశ్చంద్రుడిగా డ్యూయల్ రోల్ చేయడం విశేషం.  బాలయ్య టాప్ హీరోగా ఎదిగిన తర్వాత తండ్రీ కొడుకులు కలిసి చేసిన సినిమా ఇదొక్కటే. తండ్రితో బాలయ్య కలిసి నటించిన సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాపులుగా ముద్ర పడినవే.
ఇక తర్వాత హీరో అక్కినేని నాగేశ్వరరావ్..నాగార్జున మూడు సినిమాల్లో నటించగా..మూడింట్లోనూ
తండ్రీకొడుకుల క్యారెక్టర్లే..అవి కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే ఈ మూడింట్లో మొదటిది మాత్రమే ఎబౌవ్ యావరేజ్. మధ్యలో రావుగారిల్లు అనే సినిమాలో నాగార్జున తన క్యారెక్టర్నే అతిధి పాత్రలో నటించాడు. ఐతే మనం సినిమాలో మాత్రం ఏఎన్ఆర్ ఫ్యామిలీ అంతా కన్పించగా..అక్కడ తాత, మనవడు, కొడుకు
క్యారెక్టర్లు రివర్స్ అయ్యాయ్.  ఇక తర్వాతి సూపర్ స్టార్ హీరో కృష్ణ..ఈయన తన సినిమాల్లో వీలైనంత వరకూ రమేష్, మహేష్‌లని నటింపజేశేవారు. అలా చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి పెద్ద క్యారెక్టర్ల వరకూ మహేష్ చేయగా..వాటిలో చెప్పుకోదగిన సినిమా పోరాటం. ఇందులో మహేష్ కృష్ణ చిన్న తమ్ముడిగా నటించగా..సినిమా సూపర్ హిట్. తర్వాత శంఖారావంలోనూ తండ్రీకొడుకులుగా నటించారు. పెద్ద కుమారుడు రమేష్ తోనూ ఆయన కలియుగ కర్ణుడులో అన్నదమ్ముల పాత్రలలో కన్పించారు. ముగ్గురు కొడుకులు సినిమాలో ఈ ముగ్గురూ అన్నదమ్ములుగా నటించారు. తర్వాత కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ డ్యూయల్ రోల్‌లో సూప‌ర్‌స్టార్‌కి కుమారులుగా మెప్పించారు. ఆ తర్వాత మహేష్‌తో తీసిన అన్న తమ్ముడులో మళ్లీ బ్రదర్స్ గా కన్పించారు.రమేష్‌తో కృష్ణ ఆ తర్వాత ఆయుధం, నా ఇల్లే నాస్వర్గం చేయగా..ఒక దాంట్లో అన్నదమ్ములుగా నటించారు. చివరిగా ఎన్‌కౌంటర్ సినిమాలోనూ కృష్ణ, రమేష్ కలిసి నటించారు. మహేష్ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత నటించిన రాజకుమారుడు, వంశీలో మొదటి సినిమాలో తండ్రిగా కృష్ణ చేయగా ఒక ఫ్రేమ్‌లో మాత్రం కన్పించరు. వంశీలో మాత్రం చుట్టరికం లేని పాత్రలలో కన్పిస్తారు. పైన చెప్పుకున్నవాటిలో అన్నతమ్ముడు,  ఆయుధం, వంశీ, అట్టర్‌ఫ్లాప్ కాగా..నా ఇల్లే నా స్వర్గం యావరేజ్.
 హీరోల కొడుకులు హీరోలైన సందర్భమే చూసుకున్నప్పుడు చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో రెండు సినిమాలలో కన్పించినా ఆ పాత్రల మధ్య సంబంధం ఉండదు. మగధీర హిట్ కాగా..బ్రూస్‌లీ వీర ఫ్లాప్.. మోహన్ బాబు మాత్రం తన పెద్ద కొడుకు విష్ణు సినిమా సూర్యంలో తండ్రీకొడుకుల పాత్రలలో కన్పిస్తారు. అక్కడా ఇద్దరిదీ సింగిల్ ఫ్రేమ్ కన్పించదు. కానీ పాండవులు పాండవులు తుమ్మెదాలో మాత్రం ఇద్దరు కొడుకులతో కలసి నటించారు. ఐతే వీరు పెంచుకున్న కొడుకులుగానే ఇందులో కన్పిస్తారు. వీటిలో సూర్యం ఫ్లాప్ కాగా..పాండవులు పాండవులు తుమ్మెదా నష్టాల్లేకుండా గట్టెక్కింది. చివరిగా క్యారెక్టర్ యాక్టర్లని కూడా కొద్దిగా చూస్తే విలన్ పాత్రలు వేసే చలపతిరావు, రవి ఇద్దరూ శివయ్య, అల్లరి సినిమాలతో పాటు మరి కొన్ని కలిసి నటించారు

Comments