మైండ్ కంట్రోల్ చేసేవాడే బిగ్‌బాస్ లక్ష్మీనారాయణ ఆసక్తిగొలిపే కామెంట్స్


బిగ్‌బాస్ చూడొద్దు..టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అంటూ ఓ విశిష్ట వ్యక్తి చెప్పారు..ఇది  ఏ సెలబ్రెటీనో, పొలిటీషియనో కాదు. సిబిఐ డైరక్టర్ గా పని చేసి రిటైరైన లక్ష్మీనారాయణ. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది కూడా. జిల్లాల్లో పర్యటిస్తోన్న ఆయన ఈ మధ్యకాలం యూత్ టివిలకు అతుక్కుపోతున్నారని..వాటివలన ప్రయోజనం ఉండకపోగా..టైమ్ వేస్ట్ అవుతుందని చెప్పారు.

బిగ్‌బాస్ చూడటం వలన వినోదం సంగతి అటుంచితే ఆ తర్వాత దానిపై చర్చలు పెట్టుకుని ప్రయోజనం ఏంటని అడిగారు ఆయన. ఏదైనా మన కంట్రోల్‌లో ఉండాలని..అలా కావాలంటే ముందుగా శ్వాస మీద అదుపు కావాలని అలాంటప్పుడే మన మెదడు, ఆలోచనలు మన అదుపులో ఉంటాయని సలహా చెప్పారు. దానికి ఉదాహరణగా
బిగ్‌బాస్‌లో అందరూ అతను చెప్పే టాస్క్‌లే చేస్తారని చెప్పారు. అంతేకానీ బిగ్‌బాస్‌ని ఎవరూ కంట్రోల్ చేయరని..మనం కూడా బిగ్‌బాస్‌లా తయారవ్వాలి కానీ..ఎవరో చెప్పినట్లు ఆడటం కాదని లక్ష్మీనారాయణ చెప్పడం గమనించాలి.

సత్యం కేసు కంటే వైఎస్ జగన్ ఆస్తుల కేసులో వ్యవహరించిన తీరుతో లక్ష్మీనారాయణ బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఎప్పటికప్పుడు మీడియా ముందు జవాబులు చెప్తూ..కేసుపై ఆసక్తి పెరగడంతో పాటు వైఎస్ జగన్‌పై ఓ ముద్ర పడటంలో ఇదే ఎక్కువ పాత్ర పోషించిందంటారు. ఆ తర్వాత ముంబై వెళ్లిన ఆయన ఈ మధ్యనే విఆర్ఎస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రైతుల సమస్యలు తెలుసుకుంటానంటూ జిల్లాలు తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలోనే బిగ్‌బాస్ షో గురించి ఈ వ్యాఖ్యలు చేశారు

Comments