మన సినిమాలే..తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ తీస్తున్నారు







తెలుగు సినిమాలు ఇప్పటికి పదివేలు పూర్తయ్యాయి అనుకుంటే ఆశ్చర్యం కలగవచ్చు..కానీ కొన్ని పాత సిినిమాలను చూస్తుంటే ఇటీవలి సినిమాలు గుర్తుకువస్తాయ్. ఇండస్ట్రీలో కొంతమంది అందుకే కథలు కొత్తగా పుట్టవు..కథనాలే కొత్తగా ఉంటాయి అంటారు. అలా కొన్ని పాత సినిమాలను తిరిగి కొత్త రూపంలో ఎలా మార్చారో...అలానే అసలు సినిమా నిర్మాతలకు దొరకకుండా కాపీ కొట్టి ఎలా ఏమార్చారో చూద్దాం.

అక్కినేని నాగేశ్వర్రావ్ నటించిన ధర్మదాతలో కథనం ఆత్మీ్యుల కోసం ఆస్తులు పోగొట్టుకున్న ఓ వ్యక్తి తన కొడుకులను తిరిగి శ్రీమంతులుగా అయ్యేందుకు కఠినంగా వ్యవహరిస్తూ..తన కల పూర్తి చేసుకుంటాడు..ఇందులో శ్రీనిలయం అనే పేరుతోని ఇఁట్లో అక్కినేని వృధ్ద పాత్ర నివసిస్తుంది..ఇదే సిినిమాని తమిళంలో బడ్జెట్ పద్మనాభం పేరుతో ప్రభుతో తీశారు. దీన్ని రీమేక్ రైట్స్ కొని మరీ మన ఎస్వీ కృష్ణారెడ్డి జగపతిబాబు, రవితేజ, రమ్యకృష్ణ, ప్రేమారావ్ తో తీశారు..సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది...ఇదే దర్శకుడు తన వినోదం సినిమాలోనూ ఇలానే కామెడీ ట్రాక్ ఒకటి పాత రాజనాల సినిమాలోంచి ఎత్తి పడేశాడు. అందులోనూ రాజనాల ఫారిన్ రిటర్న్డ్ కాగా..పనిమనిషిని అసలు యజమాని కూతురనుకుని పెళ్లాడతాడు..వినోదంలో ప్రకాష్ రాజ్‌లాగా..ఈ వినోదం సినిమా, రాఘవేంద్రరావ్ బొంబాయి ప్రియుడు సినిమా రెండూ ఉళ్లిత్తై అళ్లిత్త అని ఓ తమిళ హిట్ సినిమాలోని కామెడీ ట్రాకులను ఫ్రీగా వాడేసుకున్నారు..తీరా దాన్ని మోహన్ బాబు తెలుగులోకి కొనుక్కుని వీడెవండీ బాబూ పేరుతో ఓ యావరేజ్ సినిమాగా మలిచాడు..దీని నిర్మాతలు గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన నన్నపనేని అన్నారావ్ బ్హదర్స్..మోహన్ బాబు ఈ మధ్య కూడా తన కొడుకులతో కలిసి పాండవులు పాండవులు తుమ్మెదా అని ఓ సినిమా తీశాడు. ఇది హిందీ గోల్‌మాల్3 రీమేక్ అనుకుంటారు..కానీ దాని అసలు మూలాలు కన్నడంలో 1990లలో వచ్చిన హబ్బ అనే సినిమావి..దాన్ని తెలుగులో 2000లలో చంద్రవంశం పేరుతో కృష్ణ, సుమన్, నరేష్, శివాజీ, రోహిత్ తో తీశారు. భారతంలోని విరాటపర్వం వీటికి స్ఫూర్తి. ఇలా తిరిగి తిరిగి అరిగిపోయి వచ్చిన తర్వాత పాండవులు పాండవులు తుమ్మెదాకి పెద్ద క్రేజ్ లేకుండా పోయింది.
ఇఁకాస్త వెనక్కి వెళ్తే..ప్రాణస్నేహితులు అని కృష్ణంరాజు, శరత్ బాబు ఓ సినిమా తీశారు. అదే తమిళంలోకి అన్నామలై పేరుతో రజనీకాంత్ తీసి హిట్ కొట్టాడు. దాన్ని సౌదామినీ క్రియేషన్స్ నిర్మాత కెవివి సత్యనారాయణ కొండపల్లి రాజా పేరుతో సుమన్, వెంకటేష్‌తో తీశాడు. దీనికి ముందు సుందరకాండ మంచి హిట్ కావడంతో ఇలా చేశాడు..కాని ఇది దానంత హిట్ కాలేదు. ఇదే అన్నామలై తిరిగి తెలుగులోకి బిర్లారాముడు పేరుతో డబ్ కావడం విచిత్రం..ఎందుకంటే అప్పుడే భాషా రిలిజై రజనీ క్రేజ్ పెరిగింది మరి..ఎటూ భాషా ప్రస్తావన వచ్చింది కదా..ఆ ముచ్చటా చెప్పుకుందాం...ఇది 1995లో వచ్చింది..దానికి ఐదేళ్ల ముందు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, గోవిందా కిమీకట్కర్ కలసి హమ్ అని ఓ సిినిమా చేశారు..అది సూపర్ హిట్టైంది..అదే బిగ్ బి తిరిగి ఫామ్ లోకి రావడానికి కారణమైంది..దాన్నే రజనీకాంత్ భాషాగా చేశారు..ఇదే భాషాని తిరిగి హిందీలో రీమేక్ చేస్తామంటూ హడావుడి చేసారు కానీ ఆ పని మాత్రం చేయలేదు..తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఇలా ప్రతి సినిమాలో ప్లాష్ బ్యాక్ వీరాధివీరుడైన హీరో..అజ్ఞాతంలో బతకడమనే కాన్సెప్ట్‌ని ఇంకా వాడుతూనే ఉన్నారు..చివరికి నిన్నా మొన్నా వచ్చిన డిక్టెటర్ ‌కి కూడా...కృష్ణంరాజు తీసిన బొబ్బిలి బ్రహ్మన్నని అరవతంబిలు కొన్నాళ్లకి నాట్టామైగా తీసుకున్నారు. శరత్ కుమార్ డ్యూయల్ రోల్ చేశాడు. దాన్నే తిరిగి పెదరాయుడిగా తెలుగులో తీయడం తమాషా...ఐతే సీన్లన్నీ మార్చాం గురూ అని బుకాయిస్తారు. ఇక వెంకటేష్ అబ్బాయిగారు కథ అయితే మరీ విడ్డూరం. ఎప్పుడో 1980లలో చిన్నరాజా అని భాగ్యరాజా ఓ సినిమ ాచేశాడు..అది తెలుగులో కూడా డబ్ అయింది. కొన్నాళ్ల తర్వాత దాన్ని హిందీలో బేటా అని అనిల్ కపూర్ చేశాడు. ఆ రీమేక్ రైట్స్ సూపర్ స్టార్ కృష్ణ కొనుగోలు చేశారు. ఆయనకెందుకు అన్పించిందో కానీ..ఆ రైట్స్ రాశీమూవీస్ నరసింహారావుకు మంచి లాభానికి అమ్ముకున్నాడట. అలా అది అబ్బాయిగారు అయింది. విచిత్రం ఏంటంటే అదే భాగ్యరాజా హిందీ మిస్టర్ ఇఁడియాని తమిళంలోకి చిత్రం విచిత్రం అంటూ రీమేక్ చేయడం..దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాఘవేంద్రరావ్ జగదేకవీరుడు అతిలోక సుందరి తీయడం. ఇక ఎన్టీఆర్ తీసిన వద్దంటే డబ్బుని ఆయన కుమారుడు బాలకృష్ణ జంధ్యాల డైరక్షన్ లో బాబాయ్ అబ్బాయ్ గా తీసాడు. ఎన్టీఆర్, వాణిశ్రీ, జమున, హరనాధ్ నటించిన చిట్టిచెల్లెలు కాస్తా 1998లో సీతక్కగా మారిపోయింది. అన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్తా అక్క ఆమనిగా..చెల్లి వాణిశ్రీ కాస్తా...కీర్తన గా మారిపోయారు. సీతక్క ప్రొడ్యూసర్ సి. కల్యాణ్.. సూపర్ స్టార్ కృష్ణ, ఎస్వీ రంగారావ్, శోభన్ బాబు నటించిన లక్ష్మీనివాసం సినిమా 1992లో నరేష్, వాణివిశ్వనాధ్ నటించిన ఇరుగిల్లు పొరుగిల్లుగా రూపం మార్చుకుంది. ఏఎన్ఆర్ మరో హిట్ మూవీ ఆదర్శకుటుంబం 1994లో బంగారు కుటుంబమైంది. ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణల అన్నదమ్ముల అనుబంధాన్ని కృష్ణ రక్తసంబంధాలుగా..ముగ్గురుకొడుకులుగా మార్చుకుని హిట్ కొట్టారు. అన్నగారి బ్లాక్ అండ్ వైట్ భలే మాస్టర్ ..తమిళంలోకి 1991లో నడిగర్‌గా కలర్ ఫుల్ గా మారింది. దీన్నే తెలుగులో మళ్లీ పెద్దింటల్లుడు పేరుతో సుమన్, నగ్మా, వాణిశ్రీలు తీశారు. ఇది నగ్మా ఫస్ట్ మూవీ. ఇందులో తమిళంలో లేని క్యారెక్టర్‌‌ని మోహన్ బాబుచేత చేయించి హిట్ కొట్టారు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్. ఇక బాపు డైరక్షన్ లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాక్షి..వంశీ తన దర్శకత్వంలో లింగబాబు లవ్‌స్టోరీగా మార్చి నిర్మాతల భరతం పట్టాడు. అదే బాపునే తానే విజయనిర్మలతో తీసిన బంగారుపిచ్చికను ఆమె కుమారుడు నరేష్‌తో పెళ్లికొడుకుగా తీశారు. ఫలితం మాత్రం రెండింటా పరాజయమే
ఎన్టీఆర్ రాముడు భీముడు, వాణిశ్రీ గంగ మంగలోని సీన్లని చిరంజీవి యముడికి మొగుడిలో బ్రహ్మాండంగా వాడుకున్నారు. పాత భలే తమ్ముడుకి ఇంగ్లీష్ సినిమాలు స్పూర్తి అయినా కాకపోయినా, టక్కరిదొంగ చక్కనిచుక్క, అంతం కాదిది ఆరంభంలో అవే సీన్లు కన్పిస్తాయి. తేజాబ్ టుటౌన్ రౌడీగా మారి ఫ్లాప్ అయింది. అదే కొన్నాళ్లకి ఎంఎస్ రాజుకు వర్షం రూపంలో హిట్ సంపాదించి పెట్టింది. అదే సినిమాని మళ్లీ బాఘీగా హిందీలో రీమేక్ అవడం అదీ హిట్ కావడం విశేషం... మైనే ప్యార్‌కియా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ వస్తే..మళ్లీ దాన్ని కూడా హిందీలో రామయ్యా వస్తావయ్యా అంటూ తీసేందుకు తయారు..ఎప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది అని ఓ తెలుగు సినిమా వచ్చింది దాన్నే కన్నడంలో ఉల్టాపల్టా అని తీశారు..తిరిగి అదే పేరుతో రాజైేంద్రప్రసాద్ మళ్లీ ఉల్టాపల్టా తీయగా..పల్టీ కొట్టింది  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల లిస్టు కొండవీటి చేంతాడంత అవుతుంది









































































Comments