ఈ హీరోయిన్‌వి ఒక్క రోజే మూడు సినిమాలు విడుదల అయ్యాయ్


తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ చాన్నాళ్లు నడిచింది. ఆ మాటికి వస్తే ఇప్పటికీ హీరోలదే రాజ్యం. అలాంటి హీరోలలో ఎన్టీఆర్ కృష్ణలు ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుదలైన ఘనత సాధించారు. వాళ్లలో కృష్ణ అయితే మరీ వరసగా ఐదారేళ్లపాటు సంవత్సరానికి 15సినిమాలకు పైగానే రిలీజ్ చేశారు..ఇలాంటి ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ మాత్రం ఒకే రోజున తనవి మూడు సినిమాలు విడుదల కావడం విశేషం. ఇప్పటితరానికి ఆమె గురించి పెద్దగా తెలీదు
సాత్విక అభినయానికి, విషాదం ఒలికించే ప్రియురాలి పాత్రలకు పెట్టింది పేరు ఆమె..ఆమే శోభన. జన్మతః మలయాళీ అయినా శోభనకి తెలుగులో ఎక్కువగానే గుర్తింపు లభించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం,హిందీ కలిసి 200కిపైగా సినిమాల్లో నటించింది శోభన..పద్మిని,రాగిణి, లలిత అనే సుప్రసిధ్ద కళాకారులు ఈమెకి మేనత్తలు. తల్లిదండ్రులు కూడా నటులే .  తెలుగుకి విక్రమ్ అనే సినిమాతో పరిచయం అయింది శోభన..ఇదే అక్కినేని నాగార్జున
మొదటి సినిమా కూడా. అలా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన శోభన ఇప్పటికీ హీరోయిన్‌గా నటించింది తప్ప..క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా మారకపోవడం విశేషం. ఈమె కెరీర్లో విశేషం ఏమిటంటే ఆమె నటించిన మూడు సినిమాలు ఒకదానికి ఒకటి పొంతన లేని క్యారెక్టర్లతో ఒకేసారి విడుదల అయ్యాయ్ అవి అస్త్రం, మంచి రోజు, కీచురాళ్లు..అస్త్రం సినిమా హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టి తీసింది. అమాయకురాలైన ఆమెని అనవసరంగా కేసుల్లో
ఇరికిస్తారు అందులోనుంచి కరడు గట్టిన వ్యక్తిగా ఎలా తయారై బైటపడింది అన్నది కథాంశం ఆమెకి సాయపడే వ్యక్తిగా ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం నటించారు ఈ సినిమా దర్శకుడు బిఎల్‌వి ప్రసాద్.
  రెండో సినిమా మంచిరోజు. పల్లెటూరి పిల్లని వినోద్ కుమార్ పెళ్లాడగా..ఆమెతో అవస్తలు పడి విడాకులు ఇవ్వబోతాడు..అతనికి బుద్ది చెప్పేందుకు అతని ఇంటి ముందే వేరే ఇల్లు తీసుకుని..అతని ఆఫీస్‌లోనే జాయిన్ అయి తాను అనుకున్నది సాధించే పాత్ర మంచిరోజులోది. దీనికి డైరక్టర్ మౌళి. మూడో సినిమా కీచురాళ్లు..ఇది ఇప్పటికీ చాలామందికి అర్ధంకాని కథాంశం..డైరక్టర్ గీతాకృష్ణ తీశారు. పాప్ సింగర్ ఉషాఉతుప్ తెలుగులో పాడటం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. హీరో భానుచందర్..ఇలాంటి మూడు భిన్నమైన క్యారెక్టర్లను చేసి శోభన రికార్డు క్రియేట్ చేసింది. కెరీర్ లో రెండుసార్లు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ విన్నైన శోభన పెళ్లి చేసుకోకుండా మొత్తం నృత్య ప్రదర్శనకే అంకితమైపోయింది. ఓ పాపని దత్తత తీసుకుని పెంచుతుంది కూడా



తెలుగులో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు,చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున,మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ అందరి సరసనా నటించింది. ఇప్పటికీ అడపాదడపా తెలుగులో మెరుస్తుంటుంది కూడా..!


ఈ స్టోరీలోని స్పెషాల్టీకి కాస్త వేల్యూ యాడ్ చేసి వీడియోని ముగిద్దాం..హీరోయిన్‌గా అప్పటికే ఫేడౌట్ అయినా ముఖ్యపాత్రల్లో కన్పిస్తోన్న జయసుధ కూడా దాదాపుగా ఈ రికార్డుకి దగ్గరగా వచ్చారు. 1993లో ఆమె నటించిన మూడు సినిమా ఇన్స్ స్పెక్టర్ ఝాన్సీ, మనీ, బావబావమరిది ఒకే వారంలో విడుదల అయ్యాయ్. అందులో ఇన్స్ పెక్టర్ ఝాన్సీ జూన్ 18న, మనీ జూన్ 10న , బావబావమరిది జూన్ 12న విడుదల అయ్యాయ్.ఇక హిందీ సుందరి
దివ్యభారతివి కూడా 1992లో  విశ్వాత్మ, షోలా ఔర్ షబ్నమ్, దిల్ కా క్యా కసూర్‌ మూడు సినిమాలు ఒకేవారంలో విడుదల అయ్యాయ్. దిల్‌కా క్యా కసూర్ జనవరి 14న విడుదల కాగా,  షోలా ఔర్ షబ్నమ్ జనవరి 23న విశ్వాత్మ జనవరి 24న రిలీజ్ అయ్యాయ్



Comments