కరుణానిధి గురించి తెలుసుకోవాలా


94 ఏళ్లు అంటే...దాదాపుగా శతవసంతాలు..ఇన్నేళ్లు బతకడం అందులోనూ జనం నోళ్లలో నానుతూ దాదాపు 70 ఏళ్లు గడపడం అంటే సామాన్యమైన విషయం కాదు..సమకాలీన రాజకీయాల్లో ఈ ఘనత కరుణానిధికి దక్కింది. దానికి కారణం చిన్ననాటి నుంచే ఆయన ఎంచుకున్న మార్గం. అందుకు సహకరించింది చుట్టూ  ఉన్న పరిసరాలు..
తమిళనాడులోని తిరుక్కవలై అనే గ్రామంలో తెలుగువారింట పుట్టాడు కరుణానిధి..అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన తల్లిదండ్రుల పేర్లు కానీ వివరాలు కానీ అందుబాటులో లేవు. కానీ ఆయన తల్లి మాత్రం దేవాలయంలో నర్తకిగా ఉఁడేవారట. అలాంటి కుటుంబంలో పుట్టిన కరుణానిధి చిన్ననాటి నుంచి డ్రామాలు, పద్యాలు అంటే ఆసక్తి చూపేవాడట. అలా తన 14వ ఏటనే రాజకీయాల్లో ఆసక్తి కలిగిందిట.



అళగిరి స్వామి అనే జస్టిస్ పార్టీ ప్రముఖుడు ప్రసంగాలతో బాగా ప్రభావితం అయి అప్పట్లోనే ఓ పత్రిక నడిపారట..పత్రిక అంటే నిజంగా పేపర్ కాదు..కాగితాలపై రాసి విడి ప్రతులుగా చేసి పంచేవి. జస్టిస్ పార్టీ ప్రభావంతోనే ఆయన అటు తన హిందూత్వ వ్యతిరేక వైఖరి కూడా అలవాటు చేసుకున్నాడు. సినిమారంగంలోకి పరాశక్తి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వగా అందులో కూడా సనాతన మూఢాచారాలకు వ్యతిరేకంగా డైలాగ్స్ రాసి జనం మనసుని ఆకట్టుకున్నారు. ఒకవైపు మురసోలి అనే న్యూస్ పేపర్ ప్రారంభించారు. తమ నాస్తిక భావాలకు ప్రచారం కల్పించుకునేందుకు అప్పట్లో ఆయన సినిమా రంగాన్ని ఓ వేదికగా మలుచుకోగా..అవే ఆయన రాజకీయాల్లోకి రావడానికి కూడా బాగా సాయపడ్డాయి.

ఇదే సంప్రదాయాలను వద్దన్నందుకు తన ప్రేమను కూడా వదులుకున్నారని ఆయనే స్వయంగా చెప్పారు. సంప్రదాయరీతిలో పెళ్లి చేసుకుంటామంటే ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటామన్నారట. కానీ ఆయన మాత్రం తన అభ్యుదయపద్దతిలో అయితే చేసుకుంటా అనడంతో ఆయన ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. అలానే ఆ తర్వాత ఆయన సహచరులైన రామస్వామి పెరియార్, అన్నాదురైల ప్రోత్సాహంతో వేరొకరిని పెళ్లి చేస్కున్నారు

కల్లకుడి ప్రాంతంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా..దాల్మియా వాళ్లు మాత్రం ఆ ప్రాంతానికి దాల్మియాపురంగా పేరు మార్చబోయారు. దీంతో కరుణానిధి, ఎంజిఆర్‌లు రైలుపెట్టాలకి అడ్డంగా పడుకున్నారు. అప్పడు జరిగిన అల్లర్లు హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారి తీశాయ్..ఇద్దరు చనిపోయారు కూడా..ఇదే ఆయన రాజకీయజీవితానికి తొలి మెట్టు. ఈ దృశ్యం మీరు మణిరత్నం తీసిన ఇద్దరు సినిమాలో చూడవచ్చు. ఆ సినిమా ఎంజిఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా తీసినదే..1957లొ తొలిసారిగా ఎమ్మెల్యేగా కాగా..1967లో తొలిసారిగా మంత్రిగా పదవి చేపట్టారు. అన్నాదురై అప్పుడు ముఖ్యమంత్రి ఆయన మరణంతో కరుణానిధి సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇది జరిగింది 1969లో..అప్పట్నుంచే తమిళనాట ఆయన శకం ప్రారంభమైందని చెప్పాలి. ఇప్పటిదాకా 5సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఐతే మద్యలో ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి చీలి ఎఁజిఆర్  అన్నాడిఎంకే పెట్టడంతో కరుణానిధి ప్రాభవానికి గండి పడింది. రాజకీయాల్లోనే కాకుండా
అటు తమిళ సాహిత్యంలోనూ కరుణానిధికి కొన్ని పేజీలు అట్టిపెట్టాలి. వంద పద్యాలు, వందకిపైగా సిినిమాలకు కథలు డైలాగ్స్ నాటకాలు రాశారు. జనాలను ఉర్రూతలూగించేవిగా ఆయన డైలాగ్స్ ఉంటాయని చెప్తుంటారు. తిరువళ్లూర్ అని తమిళ సాహిత్యకారుడికి స్మృతిగా 133 అడుగుల విగ్రహాన్ని కన్యాకుమారిలో కట్టించారాయన. పురాణాలంటే పడని కరుణానిధి రాముడు తాగుబోతు అని..రామసేతు కట్టడానికి అప్పట్లో ఏ ఇంజనీరింగ్ డిగ్రీ ఉందని వాచాలత్వం ప్రదర్శించారు కూడా. 1980లో అవినీతి ఆరోపణలతో ఆయన ప్రభుత్వాన్ని కేంద్రంలోని ఇందిరాగాంధీ డిస్మిస్ చేసారు..ఇతర వివాదాల విషయానికి వస్తే రాజీవ్ గాంధీ హత్య పై ఎంక్వైరీ కమిషన్ కరుణానిధి ఎల్ టిటిఈకి డబ్బు సాయం అందిస్తున్నారని ఆరోపించింది. ఆ మాటకి వస్తే తమిళ పార్టీలు ఎల్ టిటిఈకి మద్దతు పలకడం సర్వసామాన్యం ఎందుకంటే శ్రీలంకలో తమిళులు తమిళనాడులోని తమిళులతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి వారే అక్కడకి వెళ్లి స్థిరపడ్డారు. వారి పక్షాన నిలబడకపోతే ఇక్కడ ఓట్లు పోతాయని వాటి భయం. అలానే తన సంతానమైన అళగిరి, స్టాలిన్, కనిమెళి వీరంతా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. టూజీ స్కామ్‌లో కనిమెళి కూడా జైలుకి పోవాల్స చ్చింది. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులు అరెస్ట్ కావాల్సి వచ్చింది.  నాస్తికుడైన కరుణానిధికి వెల్లూరు జిల్లా సమిరెడ్డిపల్లిలో కళైంగనైర్‌ తిరుకోవిళ్ అనే పేరుతో గుడి కట్టడం విశేషం. ఎందుకంటే ఈయన పరమ నాస్తికుడిగా చెప్పుకుంటారు. అలాంటిది ఈయనకి గుడి ఏంటర్రా అని అడిగితే ఆయన దేవుడిని నమ్మకపోవచ్చు కానీ..మాకు ఆయన దేవుడు అని ఈ గుడి కట్టిన అక్కడి పంచాయితీ కౌన్సిలర్ జిఆర్ కృష్ణమూర్తి చెప్తారట. కరుణానిధికి ముగ్గురు భార్యలు కాగా..మొదటి భార్య ఆమె కుమారుడు రో్డు ప్రమాదంలో మరణించారు. రెండవ భార్య కుమారులు అళగిరి స్టాలిన్, మూడవ భార్య రాజత్తి అమ్మాళ్ కుమార్తె కనిమెళి.. ఈయన సంతానంలో ఒకరు ఎంజిఆర్‌కి పోటీగా యాక్షన్ లోకి దిగినా అట్టర్ ఫ్లాప్ అయారు. మరో మనవడు ఉదయనిధి మారన్ కూడా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు.


స్టాలిన్ తన వారసుడిగా కరుణానిధి తన 85వ ఏట ప్రకటించారు కానీ..నిజానికి స్టాలిన్ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన తర్వాతే మంత్రిగా చేశారు. అంతకు ముందు చెన్నైకి మేయర్ గా డైరక్ట్ గా ఎంపికయ్యాడు స్టాలిన్..ఐతే స్టాలిన్ పై బీభత్సమైన ఆరోపణలు ఉన్నాయ్. ఆయనకి అమ్మాయిల పిచ్చి అని ..రేష్మా భాను అనే ముస్లిం యాంకర్ ని కిడ్నాప్ చేసి కొన్ని రోజుల పాటు రేప్ చేసాడని ప్రచారం జరిగింది. ఇది స్వయంగా ఆమే ఎన్నోసార్లు మీడియాతో చెప్పింది. అలానే గిండి ఏరియాలో కాలేజ్ కి వెల్లే అమ్మాయిలు స్టాలిన్ ఉన్నాడో లేడో అని చూసి మరీ జాగ్రత్తగా వెల్లేవారట.  ఇప్పటికి 13సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కరుణానిధి ఎంజిఆర్ హయాం వరకూ బాగానే ఉన్నా జయలలిత పగ్గాలు పట్టిన తర్వాత మాత్రం పగ ప్రతీకారానికి ప్రాధాన్యతలు పెరిగిపోయాయ్. 2001లో జయలలిత గెలిచిన తర్వాత అర్ధరాత్రి జైల్లోకి నెట్టించింది కూడా. తిరిగి తాను అదికారంలోకి వచ్చిన తర్వాత అదే జైలుకి ఆమెని పంపించిందాకా ఈ పెద్దాయనికి నిద్ర పట్టలేదు. వ్యంగ్యం ఓ దశ దాటి చివరికి జయలలితని నీచంగా కూడా తిట్టేవాడని అంటారు. అలాంటి కరుణానిధి 2016 వచ్చేసరికి పూర్తిగా చప్పబడిపోయారు. వయసు తెచ్చిన ప్రభావంతో జయలలితతో తన వైరాన్ని కాస్త సడలించుకున్నారు..కానీ ఆమే ఇప్పుడు లేకపోయేసరికి కరుణానిధి ఇప్పుడు ఎవరితో పోరాడాలో అర్ధం కాక మదనపడ్డారని అంటారు. ఆమె చనిపోయిన మూడు నెలలకే కరుణానిధి కూడా అనారోగ్యం పాలయ్యారు. అప్పట్నుంచీ ఐదారునెలలకి ఓసారి ఏదోక సమస్య ఆయన్ని బాధపెట్టసాగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటారు కానీ నా అంత సీనియర్ లేరని..అసలు ఇప్పటి రాజకీయనాయకుల్లో కరుణానిధే కురువృధ్దుడు ఆయనంత సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబుకి లేదు..కనీసం ఆయనకి ఉన్న అనుభవంలో సగం కూడా లేదని చెప్పొచ్చు. అంతటి చరిత్ర ఉఁది కాబట్టే..ఇప్పుడు కరుణానిధి గురించి తెలీనివారికి చెప్పాల్సి వస్తుంది






Comments