బాలయ్యపై పవన్ కల్యాణ్ పంచ్ తెలిస్తే ఫ్యాన్స్ హర్టవడం ఖాయం


పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయ్. పోరాటయాత్ర పేరుతో పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమం ఎక్కడ ఎలా జరుగుతున్నదీ సామాన్యులకు తెలిసే వీలు లేదు. ఎందుకంటే అన్ని ఛానళ్లూ కలిసికట్టుగా నిషేధం విధించినట్లుగా పవన్ కార్యక్రమాలను చూపించడంలేదు. ఈ మధ్యనే ఓ ఛానల్ పవన్ కోసం కొన్నట్లుగా ప్రచారం జరుగుతున్నా సదరు ఛానల్‌కి జనంలో పెద్దగా ఆదరణ లేదంటారు. విషయానికి వస్తే పవన్ కల్యాణ్ భీమవరంలో కాలు బెణకగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ కార్యకర్త ఉత్సాహం  ఎక్కువై బైక్ సైలెన్సెర్ తీసి హడావుడి చేశాడన్నారు. దానికే ఏదో పెద్ద మర్డర్ చేసినట్లుగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. అంతటితో ఊరుకోకుండా, ఇళ్లలో తుపాకులతో పైరింగ్ చేసినవాళ్లు బైట హాయిగా తిరుగుతున్నారని..వాళ్లని మాత్రం పోలీసులు ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్ బాలయ్యబాబుని ఉద్దేశించి చేసినదే అని అంటున్నారు..ఐతే డైరక్ట్‌గా ఎక్కడా పేరు ప్రస్తావించకపోవడంతో ఈ విషయంపై పెద్దగా రగడ చేయడం లేదు.

కానీ ఈ మధ్యన బాలయ్య ఓ సందర్భంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారని..అందుకే పవన్ కల్యాణ్ ఇలా ఇన్ డైరక్ట్ సెటైర్లు వేశారని టాక్. గతంలో టిడిపికి పవన్ దగ్గరయ్యేందుకు బాలయ్యబాబు సాయపడ్డాడని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఇలాంటి కామెంట్లు ఇద్దరి ఫ్యాన్స్ మధ్యా రగడకు దారి తీసే ప్రమాదం ఉంది. 

Comments