ప్లేబాయ్ నుంచి ప్రైమ్ మినిస్టర్‌దాకా! ఇమ్రాన్ ఖాన్ మామూలోడు కాదు


పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారీ మనదేశంలోనూ చర్చలు చోటు చేసుకుంటాయ్. ఎందుకంటే ఆ దేశం మనకి కలిగించే చీకాకు అంతా ఇంతా కాదు కాబట్టి..ఇప్పుడు మనకి సుపరిచితమైన ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి ప్రధాని అంటే ఖచ్చితంగా చాలామందికి ఆసక్తి కలిగించే విషయమే. రెండు దేశాల మధ్య పోరు పెంచేది..టెన్షన్ పుట్టించేదీ యుధ్దం కంటే ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌ల విషయంలోనే అంటే అతిశయోక్తి కాదు. ఎవరు గెలుస్తారనే విషయంలో భారీగా పందేలు కాస్తుంటారు. అలాంటి పాకిస్తాన్ కి వాల్డ్ కప్ అందించిన ఘనుడు ఇమ్రాన్ ఖాన్..ఇది కూడా ఓ సారి రిటైర్మెమెంట్ ప్రకటించి...తిరిగి ఎంట్రీ ఇచ్చి మరీ ఆ ఘనత సాధించాడు..ఇది 1992లో జరిగింది. దీనికి కూడా ఓ ఉదాత్తమైన ఆశయాన్ని బ్యాక్ గ్రౌండ్ గా చెప్తారు. తన తల్లిపేరిట క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి ఆటలోకి తిరిగి వచ్చాడు ఇమ్రాన్. ఆ  క్యాన్సర్ హాస్పటల్ కి అవసరమైన డబ్బు కోసం క్రికెట్‌ తప్ప తనకి దారి
లేదని అందుకే రిటైర్మెంట్ పోస్ట్ పోన్ చేసుకుని..ముందు చెప్పినట్లుగానే కప్ గెలిపించాడు. 


దీంతో అతని ఇమేజ్ ఎక్కడకో వెళ్లిపోయింది. ఐతే ఆ తర్వాత పాకిస్తాన్‌ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మాత్రం అక్షరాలా పాకిస్తాన్ పొలిటీషియన్‌గానే మారిపోయాడు. 
ఆ విషయాలు తెలుసుకునే ముందు అతని బాల్యం నుంచి ఇప్పటిదాకా కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. 
1952లో పష్తూన్ల కుటుంబంలో లాహర్ నగరంలో పుట్టాడు ఇమ్రాన్. తండ్రి ఇక్రాముల్లా ఖాన్ నైజీ ఓ సివిల్ ఇంజనీర్ గా పని చేసేవాడు.తల్లి షౌకత్ ఖానుమ్. ఈమె బుర్కీ తెగకు చెందిన ఫష్తూన్ మతస్థురాలు. ఈ బుర్కీ తెగకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పాకిస్తానీ క్రికెటర్లలో చాలామంది దీనికి చెందినవారే. ఇమ్రాన్ ఖాన్ కి నలుగులు అక్కచెల్లెళ్లు. లాహోర్ లో విద్యాభ్యాసం తర్వాత ఇఁగ్లండ్ రాయల్ గ్రామర్ స్కూల్ వోర్సెస్టర్‌లో ఇంటర్మీడియేట్ పూర్తి చేశాడు. ఆక్స్ ఫర్డ్ కెబెల్ కాలేజ్‌లో ఫిజియాలజీ, పాలిటి్క్స్ ఎకనామిక్స్‌తో డిగ్రీ పూర్తి చేస్తూనే క్రికెట్ కూడా నేర్చుకున్నాడు. ఈ మధ్యలోనే అంటే లాహోర్‌లో ఉన్నప్పుడే స్కూల్ టీమ్‌కి ప్రాతినిధ్యం వహించాడు. దాన్ని ఇఁగ్లండ్‌లోనూ కంటిన్యూ చేశాడు. 1976 వరకూ బౌలర్‌గా ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు. 



1971లోనే ఫస్ట్ టెస్ట్ ఆడగా..వన్డే మ్యాచ్ లలో మాత్రం 1974లో ఎఁట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండిస్ టూర్లు చేశాడు. అక్కడే టోనీ గ్రెతో కలవడం జరగగా..కెర్రీ ప్యాకర్స్ వరల్డ్ సిరీస్ క్రికెట్ కి సైన్ చేసాడు. 1978లో వాల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఇమ్రాన్. గంటకి 139 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం ప్రారంభించాడు. 1982నాటికి 9 టెస్టుల్లో 62 వికెట్లు తీయడంతో క్రేజ్ ఎక్కడకో వెళ్లిపోయింది. ఆ రోజుల్లో టెస్ట్ క్రికెట్ అంటేనే  ఎక్కువ ఆసక్తి. మరోవైపు బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించడంతో 75 టెస్టులలోనే 300 వికెట్లు 3000రన్లు చేసి ఆల్ రౌండర్‌గా మారాడు. కెప్టెన్‌గానూ రాణించిన ఇమ్రాన్ ఆధ్వర్యంలో వరసగా ఇఁగ్లండ్ టెస్ట్ సిరీస్..ఇండియాలోనే ఇఁడియాపై టెస్ట్ సిరీస్ గెలిచి పాక్ జట్టు రికార్డు సృష్టించింది. 1987 వరల్డ్ కప్ ఇండియా, పాకిస్తాన్ నిర్వహించగా..ఈ రెండు టీమ్లు సెమీస్ దాటలేకపోయాయ్..అప్పుడే ఇమ్రాన్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐతే 1988లో పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ ఆదేశం మేరకు క్రికెట్ లోకి రావాల్సి వచ్చింది. ఆశించినట్లే తర్వాతి వాల్డ్ కప్‌ని పాకిస్తాన్ గెలుచుకుంది. 


ఐతే ఈ మ్యాచ్‌లలో ఇమ్రాన్ ఖాన్‌ వికెట్ల కంటే రన్సే ఎక్కువ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా ముందే వచ్చాడు. ఇది ఆయన క్రికెట్ కెరీర్..ఐతే ఇక్కడ సంపాదించిన పేరు ప్రతిష్టలను వివాదాస్పదంగా చేసాయి తర్వాతి రోజులు..1994లో ఆయనే స్వయంగా బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.రిటైరైన తర్వాత ఔట్ లుక్, గార్డియన్ , టెలిగ్రాఫ్ పత్రికలలో క్రికెట్ కాలమ్స్ నిర్వహించేవాడు. 
ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు చూస్తే 1400కోట్లుగా లెక్క తేలుతుంది. ఇస్లామాబాద్‌లో బాని గలా ఏరియాలో 300 కనాల్ మేన్షన్ ఉంది పాక్‌లోనే జమాన్ పార్క్ ఏరియాలో రెండున్నర కోట్ల భవంతి ఉందాయనకు. ఇతర పెట్టుబడులు నాలుగు కోట్ల మేర ఉంటాయని అంచనా.ఐతే ఇమ్రాన్ పేరిట ఒక్క వాహనం కూడా రిజిస్టర్ అవకపోవడం విశేషం. ఇంత ఆస్తి ఉన్నా..2016లో ఇమ్రాన్ కేవలం లక్షా 59వేలు మాత్రం పన్ను కట్టారట.2012లోనే సల్మాన్ రష్దీ ఈయన ఆగమనాన్ని ఊహించి డిక్టేటర్ ఇన్ వెయిటింగ్ అని విమర్సించారు. తాను ఇఁడియా టుడే కాన్ క్లేవ్ కి హాజరు అవుతున్నందునఇమ్రాన్ గైర్హాజరు అవడంతో రష్దీ ఇలా విమర్శించారు




ఇక ప్లేబాయ్ ఇమేజ్ విషయానికి వస్తే లండన్‌  నైట్ క్లబ్బుల్లో ఇతగాడు రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేవాడు. ఐతే తానెప్పుడూ మందు కొట్టలేదని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చెప్పడం గమనార్హం. అలానే గాళ్ ప్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ..ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చేవాడు. ఇతగాడికి చనిపోయిన ప్రిన్సెస్ డయానా కూడా స్నేహితురాలేనట.




 డయానా తాను చనిపోయే ముందు కూడా ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించిందట. సిటా వైట్ అనే మహిళతో పెళ్లి కాకుండానే టైరియాన్ జేడ్ వైట్ అనే అమ్మాయికి జన్మనిచ్చాడని ఆరోపణలు ఉన్నాయ్. దీన్ని అమెరికా కోర్టు ధృవీకరిస్తే..పాకిస్తాన్ కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ జెమీమా గోల్డ్ స్మిత్ అనే లండన్ సినిమా ప్రొడ్యూసర్ ని 1995లో  పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చాడు. 2015లో రేహమ్ నయ్యర్ అనే జర్నలిస్ట్‌ని పెళ్లాడాడు. తర్వాత ఆమెకీ విడాకులు ఇచ్చి బుష్రా వాట్టూ అనే ఆద్యాత్మిక శిక్షకురాలిని పెళ్లాడాడు 






ఈ పెళ్లికి రాజకీయంగా ఎదగాలనే కోరికే కారణమని అంటారు. ఎందుకంటే సంప్రదాయబద్ద పద్దతిలో తన వివాహాన్ని బాహాటంగా ప్రదర్సించి అక్కడి వారిలో సెంటిమెంట్ రగల్చడమే ఇతని ఉద్దేశమని చెప్తారు. 1996లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని పార్టీకి దక్కింది ఒక్కటే సీటు..ఇప్పటికి 22 ఏళ్లుగా పోరాడుతున్నా దక్కుతున్నది శూన్యం కావడంతో ఆర్మీ అండతోనే ఈ 117 సీట్లు కూడా దక్కించుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయ్.  మలాలా యూసఫ్ జాయ్‌ని ప్రపంచం ఓ స్వేచ్చకి ప్రతీకగా చూస్తే ఇతని పార్టీ మాత్రం సిఐఏ ఏజెంట్ గా వర్ణించడం
మరో వివాదం.  అలానే అమెరికా టవర్స్ పై లాడెన్ దాడుల తర్వాత ఇక్కడి వారిలో ఓ వర్గం మద్దతు కోసం అమెరికా యుధ్దం ఇస్లాంపై యుధ్దంగా వర్ణించాడు అలానే తాలిబన్లను హీరోలుగా పొగుడుతూ, తనని తాలిబన్ ఖాన్ గా ప్రకటించుకున్నాడు. వీటికి తోడు దేశంలో ఏదో పెద్ద మార్పు తెస్తానంటూ హామీలు ఇస్తూ  ఈ స్థాయికి చేరాడు ఇమ్రాన్..ఇమ్రాన్ ఖాన్ కి ఆర్మీ పరోక్ష మద్దతుకు కారణం వైఫల్యాలను ఇంకొకరిపై తోయవచ్చు. ప్రపంచంలో తామూ ప్రజాస్వామ్యవాదులుగా ముద్ర వేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోయవచ్చు అని..ఇంత కుట్రతోనే ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్‌కి మద్దతు ఇస్తోంది. ఐతే ఇదేం తెలీనంత అమాయకుడేం కాదు ఇమ్రాన్ ఖాన్. కానీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఇమ్రాన్ ఖాన్ ని క్రికెటర్ గానే చూసిన మనవాళ్లు చాలామంది సెలబ్రెటీలు కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నారు..ఈయన ఫ్యాన్స్ లిస్టులో జయలలిత, జయసుధ, రిషికపూర్ సహా చాలా మందే ఉన్నారు..ఐతే వాస్తవం తెలిసినవాళ్లు మాత్రం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ట్రంప్ అని హెచ్చరిస్తున్నారు

Comments