పాపం పవన్‌కి బాగా నొప్పి పుట్టినట్లుంది..జగన్‌పై అరగంటసేపు దాడి చేశాడు


జగన్ మోహన్ రెడ్డి యధాలాపంగానో..అడిగితేనే చెప్పాడో కానీ..అతను మాట్లాడిన మాట పవన్ కల్యాణ్ టెంట్‌లో చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మామూలుగా కాదు..పవన్ కల్యాణ్ పాపం మొగల్తూరులో అరగంట సేపు చెప్పిందే చెప్పి..చెప్పిందే చెప్పి తన సొంత డబ్బా కొట్టుకుంటూ జగన్ ఓ ఫ్యాక్షనిస్ట్, ఓ దోపిడిదారు, ఓ స్కామ్ అఁటూ నోటికి ఏది వస్తే అది అంటూ తన కోపం చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. ఆయన స్కందావారాలు కూడా అదే స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పై రెచ్చిపోయారనుకోండి
కాకపోతే ఇక్కడ జగన్ పెట్టిన చిచ్చు మాత్రం మామూలుగా రగలలేదు. అటు ఏబిఎన్, ఇటు ఇతర ఛానళ్లు కూడా బాగా మంట కార్చుకున్నాయ్. ఎక్కడ పవన్ దొరుకుతాడా అని చూసినోళ్లకి డైరక్ట్ గా జగన్ ఓ మాట అనడంతో జగన్ అలా అనడం కరెక్టేనా కాదా అంటూ ఎస్ఎంఎస్‌లో గోల పెట్టేసి డబ్బు సంపాదించుకున్నాయ్.
ఐతే సూటిగా జగన్ ఎత్తి చూపిన అంశం నిజమా కాదా అనేది మాట్లాడకుండా.." నేను 22 ఏళ్లప్పుడు సాయుధపోరాటానికి సిధ్దమై వచ్చా...నన్ను బెదిరించలేరు..పైకి మెత్తగా కనబడతా...దగ్గరకొస్తే తాట తీస్తా..సమస్యలు అర్ధం చేసుకున్నా..."  అంటూ సొంతడబ్బా కొట్టుకోవడం ఏంటి..పైగా అండగా ఉండటానికి వచ్చా అనే వ్యక్తి..చిన్న విమర్శని తట్టుకోలేకపోతే ఎలా..? 2014 ఎన్నికలకు ముందు పెద్ద పెదరాయుడిలా ఈటీవికి ఈనాడుకు " నీకు అనుభవం లేదు..ఇంతింత గదులనిండా పట్టేంత కేసులు పెట్టుకున్నావ్ నీకు ఓట్లేలా వేయాలి" అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు..ఈ నీతులు ఏమైనాయి.

ప్రతి ఊరిలో ఏదో మీటింగ్ పెట్టుకుని మర్నాటికి ఎత్తేయడం అలవాటైన పవన్ కల్యాణ్ , రోజూ కనీసం వందమందిని రోడ్డుపైనే కలిసే జగన్‌కి పోలిక పెట్టుకోవడం సరైనదేనా...? నేను విలువలతో కూడిన రాజకీయం కోసం వచ్చా అని డబ్బాలు కొట్టుకునే పవన్ కల్యాణ్  జగన్ పారిపోయాడు..జగన్ పారిపోయాడు అని అరిచేముందు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కోవడం కరెక్టో కాదో ఎఁదుకు ఈ నాలుగేళ్లలో ఎన్నడూ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. జగన్ పారిపోయే మనిషే అయితే..దానికి ఇన్నాళ్లు పట్టదు..సోనియాగాంధీ జైల్లో పెట్టించినప్పుడే ఆ పని చేశేవాడు..ఎవరు అవునన్నా కాదన్నా..ఇది వాస్తవం.

Comments


  1. పవన్ కి నొప్పి ఎక్కడ పుట్టెను‌ ?


    జిలేబి

    ReplyDelete
  2. జగనన్నను పెట్టుకుంటే అలాగే ఉంటుంది.

    ReplyDelete

Post a Comment