అరే ఉండవల్లి హఠాత్తుగా ప్రత్యక్షమైపోయాడే...అటు అమిత్‌షా రామోజీతో


అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా..ఇదీ ఓ పేపర్‌లో ముఖ్యమంత్రిగారి పేరిట వచ్చిన కథనం..పోెలవరం విషయంలో బిజెపి నాయకులు ఏదో చేయబోయారని కానీ తాను ఏకంగా నితిన్ గడ్కరీకే వార్నింగ్ ఇచ్చానంటూ  చంద్రబాబు చెప్పినట్లు ఆ కథనంలో ఉంది..ఐతే రాత్రి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే నాయకుడు చంద్రబాబుని కలిసి కొంతసేపు పార్లమెంట్‌లో టిడిపి తీసుకోవాల్సిన స్టాండ్‌పై చర్చించారు. విభజన జరిగిన సమయంలో ఎలా అన్యాయం జరిగింది. ఎవరెలా ప్రవర్తించారు, అసలు రాజ్యాంగబద్దంగా జరిగిందా లేదా అనే వివరాలను చంద్రబాబుకు వివరించినట్లు..సభలో ఎలా నడుచుకోవాలో తెలుపుతూ ఓ మూడు మార్గాలను చంద్రబాబుకి చెప్పినట్లు ఉండవల్లి చెప్పారు
2014 నుంచి  ఇప్పటిదాకా సందు దొరికిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు చేస్తోందే అది..కొత్తగా ఈయన్ని అడిగి ఆయన తెలుసుకునేది లేదు. అదీ కాక, దేశంలోనే సీినియర్  పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు ఉండవల్లిని కలవడం వెనుక మోడీని ఇరుకునబెట్టడంపై కంటే భవిష్యత్ రాజకీయ యవనికపై దృష్టితోనే మీట్ అయినట్లు చెప్తారు. ఎందుకంటే ఈయనతో పాటు కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చిన కిరణ్ కాంగ్రెస్ కే చేరారు. తర్వాత సబ్బం హరి టిడిపికి సపోర్ట్ చేస్తున్నారు. పురంధీశ్వరి బిజెపిలో సేఫ్, చిరంజీవి జనసేన అనే స్టాండ్ బైని పెట్టుకున్నారు. కావూరి సైలెంట్ గా తన పని తానూ కానిచ్చేసుకుంటున్నారు. రాయపాటి టిడిపిలో..సాయిప్రతాప్ టిడిపిలో , లగడపాటి రాజగోపాల్ టైమ్ కోసం ఎదురు చూస్తుండగా...నేను పొలిటీషియన్న్ని కాదు..ఏ పార్టీలో చేరను అని చెప్పుకుంటూ పెద్దల సభపై కన్నేసిన ఉండవల్లి మాత్రం ఏకాకిగా పైకి కన్పిస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఖర్చూ లేకుండా రాజ్యసభకి పంపితే ఎగిరిగంతేసే లిస్టులో ఉండవల్లిదే ప్రథమస్థానం. 

ఇలా ఉండవల్లి బాబు భేటికి రెండ్రోజుల ముందు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులతో కలుస్తోన్న అమిత్ షా హైదరాబాద్‌లో రామోజీరావ్‌తో సైనా నెహ్వాల్‌తో పాటు మరి కొంతమందిని కలిశారు. నిజానికి ప్రముఖులనే కలవాల్సి వస్తే ఆయన సిటిలో నిజంగా చాలామంది ఉన్నారు..కేవలం పత్రికారంగం అనే ప్రయారిటీ తప్ప రామోజీరావ్‌ ప్రముఖుడు కాదు..ఐనా కలిశారంటే అందులో సెలబ్రెటీలను కలిసే కోణం కాదు..రాజకీయకోణంలో సలహాలు..దిశానిర్దేశం కోసమే కలిశారనడంలో సందేహం లేదు. పత్రికారంగంలో జనం నాడి తెలుసుకోవడం..నాడి మార్చేందుకు తిప్పలు పడటంలో వీళ్లు ప్రసిధ్దులు..అందుకే ఈ రెండు భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయ్. ఇది జగన్ చాప కింద నీరు తెస్తుందా..ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లలో కొంతమందికి వస్తోన్న డౌట్

Comments