పూజా రామచంద్రన్ ఎందుకు వైల్డ్ ఎంట్రీ..శవంతో శృంగారం సినిమా తప్ప వేరే ఏం లేదే


తెలుగు బిగ్‍‌బాస్ ప్రోగ్రామ్ హిట్ కావడానికి పాపం ఆ ప్రోగ్రామ్ నిర్వాకులు చాలానే తిప్పలు పడుతున్నారు. రిలీజవబోయే ప్రతి సినిమాకి ఓ ప్రమోషన్ డయాస్‌లాగా కూడా తయారైందని విమర్శలు ఎటూ ఉన్నాయ్. కొత్త కొత్త మొహాలను ఈ హోస్‌లోకి తీసుకురావడం ద్వారా ఏదో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ కోసం ట్రై చేస్తున్నారు కానీ
పెద్దగా పేలడం లేదు..రీసెంట్‌గా పూజా రామచంద్రన్ అని ఓ బ్యూటీ ఎంట్రీ ఇవ్వడంతో కాస్త కలకలం రేగింది. ఈ అమ్మడి పేరు చూస్తుంటేనే ఏ అరవ పిల్లో..మలయాళీ పిల్లనో అనుకుంటారు. ఆ ఊహకి తగ్గట్లుగానే పూజా రామచంద్రన్ మలయాళీనే కోయంబత్తూరులోని సిఎస్ఐ బిషప్ అప్పసామీ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివింది. విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసింది. చదువు ఆపేసిన తర్వాత ఎస్ఎస్ మ్యూజిక్ అనే ఓ పాపులర్ మ్యూజిక్ ఛానల్లో వీడియోజాకీగా చేసింది. 2004లో మిస్ కోయంబత్తూర్ గా ఎన్నికైంది. అలా అలా సినేమారంగానికీ వచ్చింది. తెలుగు వరకూ వస్తే, నిఖిల్ హిట్ మూవీ స్వామిరారాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నిఖిల్ తో పాటు అతని బ్యాచ్‌లో తోడుదొంగగా కన్పిస్తుంది.
తమిళంలో లవ్ ఫెయిల్యూర్, పిజ్జా సినిమాలతో హాట్ లేడీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది . నాలుగు దక్షిణాది భాషలు కలిపి  ఓ 22 సినిమాల్లో నటించిందని తెలుస్తోంది. స్కిన్ టెక్చర్ బావుండటంతో బాగా యంగ్‌గా కన్పిస్తుంది కానీ..ఈమె వయసు తక్కువేం కాదు..34ఏళ్లు..క్రెగ్ గాలైట్ అనే తోటి వీజేని పెళ్లాడింది. ఐతే గత ఏడాదే అతనికి విడాకులు ఇచ్చింది.
  హీరోయిన్‌ పర్సనాలిటీ ఉన్నా కూడా ఈమెలో సిల్క్ ఎక్కువ సావిత్రి తక్కువ అని సపోర్టింగ్ క్యారెక్టర్లే ఎక్కువగా ఇస్తున్నారు ఈమెకి.  అన్నట్లు పూజా రామచంద్రన్ మంచి స్విమ్మర్..కర్నాటకలో ఈతపోటీల్లో ఓసారి ఛాంపియన్‌ అయిందట. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎందుకు పంపిస్తున్నారో తెలీదు కానీ ఈమె కెరీర్లో దేవిశ్రీప్రసాద్ అని ఓ సినిమా చేసింది.  శవాలతో శృంగారం చేసే సైకో కథతో ఆ సినిమా చేశారని ప్రచారం చేశారు..క్రైమ్ థ్రిల్లర్ పేరుతో అడ్డదిడ్డంగా తీసిన ఈ సినిమాలో పూజారామచంద్రన్ క్యారెక్టర్ గురించి చర్చ జరిగింది. అది తప్ప పూజా రామచంద్రన్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు.  ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎలాంటి చిన్నెలు పోతుందో చూడాలి మరి

Comments