మాతృప్రేమపై చిరంజీవి స్పందన

తల్లీ కొడుకుల అనుబంధం కానీ..మాతృప్రేమ కథాంశంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలానే నిజంగా కూడా తల్లి ప్రేమ ఒక్కోసారి ఒక్కో సందర్భంగా ఒక్కోలా కన్పించవచ్చు. పైకి ప్రదర్శించకపోవచ్చు కానీ తల్లి హృదయం అంటే ఏంటో చాలామంది నిశ్సబ్దంగా కూడా అనుభవించి ఉంటారు. ఉమ్మడికుటుంబాలు కనుమరుగై పోయిన రోజుల్లో తల్లిదండ్రులతోనైనా కలిసి ఉండే కొడుకులు, కూతుళ్లు తక్కువ. ఇందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. ప్రైవసీకి అడ్డంకి అనో..లేక తాము నిర్మించుకున్న సౌధాలనుంచి , పరిసరాలనుంచి వెళ్లిపోవడం, దూరం కావడం ఇష్టం లేకనో చాలామంది తమ సంతానానికి దూరంగా ఉఁటుంటారు. పండగలకు, శుభకార్యాలకు కలుస్తుంటారు. 
ఆ సందర్బాల్లో ఎలాంటి అనుభూతులకు లోనవుతారో చెప్పలేంకానీ, చిరంజీవి తమ తల్లి అంజన కొన్నాళ్లు తమకి దగ్గర్లో కాకుండా విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఈ మధ్య చెప్పారు. తాము ఉంటున్న ఇల్లు కొద్దిగా మరమ్మత్తులు ఆధునీకరణ చేస్తుండటంతో తామూ అందుకు సరే అని అన్నామని చెప్పుకొచ్చారు. ఐతే వేరే ఇంట్లో ఉంటున్న ఆయన తల్లిగారు బాగా దిగులుగా అన్పిస్తుందిరా మీ దగ్గరకు తొందరగా వచ్చేస్తా అని చెప్పారట. నిజంగా ఈ మాట వినగానే ఎవరికైనా కాస్త భారంగా అన్పించకమానదు. దానికి చిరంజీవి చాలా ఆనందంగా ఫీలయ్యారట. ఇన్ని రోజులు అమ్మకి దూరంగా ఉండటం చాలా బాధగా అన్పించినా..తన పుట్టినరోజు నాటికి తిరిగి వస్తుండటంపై 
సంతోషం వ్యక్తం చేశారు. 
తల్లిదండ్రులతో కలిసి  ఉండేటప్పుడు వారి విలువ తెలీదు కానీ, వారు దగ్గరలేనప్పుడే ఆ లోటు తెలుస్తుంది. మాట వరసకు చెప్పడం కాదు ఇది. అనుభవించిన వారికి ఆ ఆనందం తెలుస్తుంది. ఆర్ధిక విలువలకు ప్రాధాన్యత పెరిగిన రోజుల్లో అందరూ కలిసి ఉండటం కుదరకపోవచ్చు కానీ..ఆత్మీయత అవసరమైనప్పుడు తల్లిదండ్రులే దాన్ని పంచి ఇవ్వగలరు తప్ప వేరే ఎవరూ ఆ లోటు పూడ్చలేరు. అందుకే మెగాస్టార్ ఆనందం అర్దం చేసుకుంటున్నారు అందరూ

Comments