పెంపుడు కుక్క కోసం ఎలా తెగించాడో చూడండి


కేరళ వరదలు కొన్ని అరుదైన సన్నివేశాలను మన ముందు ఉంచుతున్నాయి. భవంతులకు భవంతులే కుప్పగూలి ప్రవాహాలలో కొట్టుకుపోవడం, వచ్చే వరదను తప్పించుకుంటూ ఓ సైనికుడు బాలికను కాపాడటం, గర్భిణులను, చిన్నపిల్లలలను ఎయిర్ లిఫ్ట్ చేయడం వంటి దృశ్యాలు చూస్తుంటే ఏ సినిమానో చూస్తున్నట్లు అన్పించకమానదు. థ్యాంక్స్ టూ టెక్నాలజీ..ఎక్కడ ఏం జరిగినా ఎవరో ఒకరు ఆ దృశ్యాన్ని బంధించడం వల్లనే ఇలాంటివి నిజజీవితంలోనూ చేసే హీరోలు ఉంటారని ఒప్పుకుంటున్నాం
తాజాగా కేరళలో ఓ కుక్క ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఓ వ్యక్తి ఎలా కాపాడాడో చూస్తే...అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్పిస్తుంది. ఎందుకంటే, చుట్టూ మనుషులు ఆ గట్టున ఈ గట్టున నిలుచుని ఉన్నారు. మధ్యలో అతని పక్కన నలుగురు మనుషులు సాయపడుతున్నారు. కానీ మధ్యలో వరద ఉధృతి చూసి అతని ప్రయత్నాన్ని వారించారు. ఫ్లడ్‌లో కొట్టుకుపోతోన్న శునకం ఎలా కాపాడే వ్యక్తిని చేరాలో అర్ధం కాక నానాతంటాలు పడింది. కాసేపటికి అతనికి దగ్గర్లో వచ్చినట్లే వచ్చి మునిగిపోయింది. దీంతో ఆ వ్యక్తి ప్రయత్నాన్ని నిలిపివేయమని పక్కనున్నోళ్లు చెప్పగా అతను మాత్రం ఇంకాస్త కిందికి దిగాడు. ఆ శునకాన్ని దగ్గరగా రమ్మని పిలిచాడు. అది వరదలో మరోసారి కొట్టుకుంటూ దగ్గరకి రాగానే ఒక్క  ఉదుటన దాన్ని పట్టేసుకున్నాడు అతను. వెంటనే ఒడ్డుపైకి చేరి దాన్ని పిల్లలను ఎత్తుకున్నట్లు ఎత్తుకుని దగ్గరకు తీసుకున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లతో అతన్ని అభినందించారు. సాటి మనిషి కొట్టుకుపోతున్నా ఒక్కోసారి ఏం చేయలేని నిస్సహాయత ఆవరిస్తుంది. అలాంటిది ఓ కుక్కకోసం అతను పడిన తాపత్రయం ఆలోచింపజేసేదే







Comments