సూపర్ స్టార్ మహేష్ హృదయానికి హ్యాట్సాఫ్



సూపర్ స్టార్ కృష్ణ మంచితనం గురించి ఇండస్ట్రీలో ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అసలు ఆయనలోని ఆ గుణమే ఆయన్ని సూపర్ స్టార్ చేసిందనీ అంటారు..ఇప్పుడదే క్వాలిటీ మహేష్‌లోనూ కన్పిస్తుంది. హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోన్న సంతోష్ శోభన్ అనే కుర్రాడికి మహేష్ బాబు ఇస్తోన్న సపోర్ట్ సినిమా గోయర్స్‌లో సెన్సేషన్ కలగజేస్తోంది. డైరక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీస్తోన్న పేపర్ బాయ్ ..సంపత్ నంది ఏమైంది ఇవాళ, రచ్చ , బెంగాల్ టైగర్, గౌతమ్ నందాలకు దర్శకత్వం వహించాడు. తన లక్ టెస్ట్ చేసుకునేందుకు నిర్మాతగా మారి తీస్తోన్న ఈ పేపర్ బాయ్‌లో హీరో సంతోష్ శోభన్..ఈ ట్రైలర్ చూసిన మహేష్ బాబు స్వయంగా ట్విట్టర్లో అభినందనలు తెలియజేశాడు. ఇలా మహేష్ చెప్పడం ఆ సినిమా ప్రమోషన్‌కి బాగా సాయపడుతుంది. కేవలం ప్రమోషన్ కోసమే కాకుండా ఈ ట్వీట్ వెనుక చాలా స్టోరీనే ఉంది. మహేష్ కెరీర్ బిగినింగ్‌లో బాబీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా దర్శకుడు శోభన్.

ఇతను ఇండస్ట్రీలో చాలా స్డ్రగుల్ అయి ఆ స్థాయికి వెళ్లాడు. 1989లో మద్రాసు వెళ్లిన శోభన్..కృష్ణ సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాడు..వాటిలో త్రిపురనేని మహారధి కొడుకు చిట్టి తీసిన రైతుభారతం కూడా ఒకటి. ఆ సినిమా చాన్నాళ్లు వాయిదా పడి వాయిదా పడి చివరికి 1994లో విడుదల అయింది. ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో జాయినైన శోభన్ సిందూరం సినిమాకీ చేసాడు. మహేష్‌తో చేసిన మురారికి స్క్రీన్ ప్లే అందించింది శోభనే..అలా మహేష్ ‌తో పరిచయం పెరగగా..బాబీ అనే సినిమాకి దర్శకుడిగా అవకాశం దక్కింది. రాఘవేంద్రరావ్ దీనికి ప్రొడ్యూసర్. సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఎంఎస్ రాజు నిర్మాతగా తర్వాత వర్షం అనే సినిమా తీయడంతో శోభన్ దశ తిరిగిపోయింది. ప్రభాస్ కెరీర్‌లో మంచి స్టార్‌డమ్ తెచ్చిన సినిమా వర్షం. దాని తర్వాత రవితేజతో చంటి సినిమా తీశాడు శోభన్..అది కాస్తా ఫ్లాప్ అవడంతో ఆయన కెరీర్ డల్ అయింది. ఒక రాజు ఒకరాణి సినిమా చూసినవాళ్లకి రవితేజ ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి గుర్తుండి ఉంటాడు..అతనే శోభన్..  నటి భూమికకి ఓ సినిమా కథ చెప్పేందుకు వెళ్లిన శోభన్..వాళ్ల ఇఁట్లోనే గుండెపోటు రావడంతో చనిపోయాడు. శోభన్ అన్నయ్య చిత్తజల్లు లక్ష్మీపతి కూడా నటుడే సన్నగా నల్లగా రివటలా ఉఁడే చిత్తజల్లు చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశాడు..అతను కూడా శోభన్ చనిపోయిన ఏడాదే చనిపోవడం మరో విషాదం..ఇలా విషాదాంతమైన శోభన్ కొడుకే సంతోష్ శోభన్. తనకి శోభన్‌తో ఉన్న రిలేషన్‌ని గుర్తుపెట్టుకునే మహేష్ బాబు ఇప్పుడు పేపర్ బాయ్‌కీ ఫ్రీ ప్రమోషన్ ఇచ్చినట్లు అర్దమవుతోంది..ఇదేం మొదటిసారి కూడా కాదు. సంతోష్ గతంలో నటించిన తను నేను అనే సినిమా విడుదలకి ముందు కూడా ఇలానే ట్వీట్లు చేశాడు..ఇక్కడే సూపర్ స్టార్ ప్రిన్స్ మనసు  అర్ధమవుతుందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Comments