పిప్పి పన్నుకు రెండున్నరలక్షల రూపాయలా...రామ యనమలా...!


జనరల్‌గా మనకి పంటి నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం..ఆయన బాగా రేటు చెప్తే పెద్దగా అవసరం లేదనుకుంటే పన్ను పీకేయమంటాం..కానీ అధునాతన దంత వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పీకే జంఝాటం లేకుండానే రూట్ కెనాల్ అని..క్యాప్ అనీ రకరకాలుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాం..ఇవి ఎక్కువైన కొద్దీ చికిత్స ఖర్చులు కూడా తగ్గిపోయాయ్.

 కానీ మరి మన మంత్రి గారి పంటి నొప్పి మాత్రం అక్షరాలా రూ.2, 88,823 ఖర్చు పెడితే కానీ తగ్గలేదట. అందులోనూ హైటెక్ సిఎం గారితో సింగపూర్ టూర్లు చేస్తుంటారు కదా..యనమలగారు కూడా ఏప్రిల్ నెలలో సింగపూర్ వెళ్లినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ తీసుకున్నారట..ఇందుకెంత ఖర్చు అయిందో చూశారు కదా..
ఇది మాములుగా ఏ సాక్షినో బైటపెడితో ఏ మార్ఫింగో అని గగ్గోలు పెట్టేవాళ్లు కానీ ఇది టైమ్స్ నౌ బైటపెట్టింది. దానికి సంబంధించిన ప్రూఫ్ తో రిపోర్టింగ్ చేయడంతో బండారం బైటపడింది. వాళ్ల స్థాయికి ఈ డబ్బు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ...దీని కోసం డబ్బులు రీ ఇఁబర్స్ చేయడం మాత్రం విమర్శలకు తావిచ్చేదే..మినిస్టర్ కోటాలో నాకా హక్కు ఉందని సమర్ధించుకోవచ్చు కానీ...సామాన్య జనం మాత్రం మావి పళ్లు కాదా..మా నొప్పులకు అంత ఖర్చు కాదు కదా..అని తప్పకుండా ఈసడించుకోవచ్చు. ఎందుకంటే జనం ముందు ఏ మాటల మ్యాజిక్ లాజిక్ ముందు నిలబడదు

Comments