నర్సీపట్నం జనం టిడిపికి ఏ సిగ్నల్ ఇచ్చారు..వర్షంలో జగన్‌ ప్రసంగం



పాదయాత్ర ముగింపుకు వచ్చేకొద్దీ జగన్ ఉత్సాహం పెరిగిపోతోన్నట్లు కన్పిస్తోంది. దానికి తోడు జనం కూడా తండోపతండాలుగా వస్తుండటం నిజంగా చూసేవాళ్లకి ఆశ్చర్యం కలిగించకమానదు. కొంతమంది ఈ జనమంతా తరలించుకు వచ్చినవాళ్లేగా చెప్తుంటారు. ఐనా..లారీల్లో తోసుకొచ్చిన జనం అంత సిన్సియర్‌గా వాన పడుతున్నా లెక్క చేయకుండా కదలకుండా అలానే నిలబడి ప్రసంగం వినడం సాధ్యపడే  పనేనా..? నిజంగా వాళ్లంతా పెయిడ్ పీపులే అయితే వాళ్ల చిత్తశుధ్దికి మెచ్చుకోవాల్సిందే

కానీ విశాఖపట్నం సభ, నర్సీపట్నం సభలతో టిడిపికి ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగాయని రాజకీయాలను ఎప్పట్నుంచో చూస్తున్నవాళ్లు అంచనా వేస్తున్నారు. ఓ వైపు పాడేరులో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సభల్లో జనం జారుకోవడం గమనించినవాళ్లకి ఇదో అద్బుత దృశ్యంగా వర్ణిస్తున్నారు. జనంలో అధికారపక్షంలోని వారిపై అసహనం చికాకు ఉన్నప్పుడు తమకి కన్పించిన ప్రత్యామ్నాయాన్ని బలంగా ఆదరిస్తారని వారు అంటున్నారు. అదే విషయం జగన్ సభలకు పాదయాత్రలకు హాజరయ్యే ప్రజల రూపంలో ప్రతిఫలిస్తుందంటారు.

 మంత్రి అయ్యన్నపాత్రుడు ఏరియాలో ఇలా సభ సక్సెస్ కావడంతో జగన్ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటుంటే టిడిపి టెంట్‌లో మాత్రం గుబులు బయలుదేరింది. అసలే అటు గంటా..మరోవైపు వస్తా వస్తా అంటోన్న కొణతల ఇలా నేతల మధ్య తగాదాలతో సతమతం అవుతోన్న పరిస్థితి కాస్తా..వైఎస్సార్సీపికి కలిసి వచ్చేలా ఉందని పార్టీ కార్యకర్తలు  మధనపడుతున్నారు..ఐతే సిగ్నల్ మాత్రం క్లియర్ గా వైఎస్సార్పీపీకి అనుకూలంగా ఉందని జిల్లా విశ్లేషకులు టాక్ 

Comments