రజని, అశ్వని,ఆమని, ఇంద్రజ చిరంజీవితో ఎందుకు నటించలేదు



60ఏళ్లు వచ్చినా మెగాస్టార్ పక్కన నటించడమంటే ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లకు అదో క్రేజ్. ఐతే మారిన పరిస్థితుల నేపధ్యంలో చిరంజీవి సరసన అనుష్క, నయనతార, త్రిష వంటి యాక్ట్రెస్‌నే ఎంపిక చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ప్రతి హీరోయిన్ ఆయన సరసన మెరిసిపోయి రెమ్యునరేషన్ పెంచుకున్నవారే. ఐతే తాము సినిమాలు చేస్తున్న సమయంలో నలుగురు హీరోయిన్లు మాత్రం చిరంజీవితో నటించలేదు. అలాగని వాళ్లేం ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఆ మాటకి వస్తే వారిలో ముగ్గురు ఇప్పటికీ తెరపై కన్పిస్తున్న వారే

వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది రజని గురించి. దర్శకరత్న బ్రహ్మముడి సినిమా ద్వారా పరిచయమైన రజనిని చూసి అప్పట్లో జయప్రదలా, రాధలా ఉందని అనేవారు. ఐతే ఆమె మాత్రం ఎవరికీ నకలుగా తయారవుకుండా దాదాపు 150 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణ, నాగార్జున ,  వెంకటేష్, అర్జున్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, మోహన్ బాబు, నరేష్, సుమన్ ఇలా అందరు హీరోల సరసన మెప్పించింది. ఐతే ఒక్క మెగాస్టార్ సరసన మాత్రం నటించలేదు. దీినికి కారణం చెప్తూ ఆమె ఒకటి రెండు సార్లు ఆఫర్ వచ్చినా కూడా ఇండస్ట్రీలోని లాబీయింగ్‌తోనే ఆ ఛాన్స్ మిస్సైనట్లు చెప్పింది. దీనికోసం తనని కొన్ని పేవర్లు అడిగారని అది చేయనందుకే తనపై పగతోనే సదరు అవకాశాలను నాశనం చేసినట్లు చెప్తుందామె. ఇక ఆ  సమయంలోనే అశ్వని కూడా మంచి పేరే తెచ్చుకుంది. మాస్ క్యారెక్టర్లతో పాటు కుటుంబకథా చిత్రాలలో నటించిన అశ్వని చాలా చిన్న వయస్సులోనే గుండెపోటుతో చనిపోయింది. ఈమె కూడా తెలుగులో కృష్ణ,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్,  నరేష్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. బాలయ్యబాబుతో భానుమతి గారి మొగుడు చేసిన సమయంలోనే ఆమెకి చిరంజీవితో చేసే ఛాన్స్ వచ్చినా..అది చేజారిపోయిందంటారు. 1989లో వచ్చిన ఆఖరి క్షణం అనే సినిమా ఆమెకి చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత టివి సీరియల్స్‌లో నటిస్తుండగా..2012లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన వివాహభోజనంబు, చూపులు కలిసిన శుభవేళ చూసినవారు అశ్వనిని మర్చిపోలేరు. ఇక మూడో హీరోయిన్ 1990లలో సినిమా రంగానికి వచ్చిన ఆమని..మంజు పేరుతో ఒకటి రెండు సినిమాలు చేసిన ఆమని తెలుగులో టాప్ స్టార్లైన కృష్ణ, .బాలకృష్ణ, నాగార్జున, సుమన్, మోహన్ బాబు,  రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ మాత్రమే కాకుండా కన్నడంలో విష్ణువర్ధన్, తమిళంలో కమల్ హసన్, విజయ్ కాంత్ వంటి టాప్ స్టార్లతో నటించింది. మెగాస్టార్‌తో చిరంజీవి సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఇప్పటికీ బాధపడుతుందీమె. సౌందర్యతో కలిసి చేస్తోన్న ఓ సినిమాలో తనకి అవకాశం వచ్చినా ఎందుకో నిర్మాతలు అందులోనుంచి తనని తొలగించారని చెప్పింది ఆమని. అలా సౌందర్య నటించిన చిరంజీవి సిినిమాలను చూస్తే రిక్షావోడు, చూడాలని ఉంది, శ్రీ మంజునాధ మిగులుతాయి. వాటిలో పొగరుబోతు భార్య క్యారెక్టరైన రిక్షావోడులోనే ముందుగా ఆమనిని అనుకున్నారని ప్రచారం ఉంది. ఎందుకంటే అప్పటికే తెలుగులో నగ్మా ఫేడౌట్ అయిపోయింది. కేవలం లాబీయింగ్‌తోనే నగ్మాని సదరు క్యారెక్టర్‌కి ఎంపిక చేశారంటారు. ఇక ఇదే తరంలో మెగాస్టార్‌తో నటించలేకపోయిన హీరోయిన్ ఇంద్రజ, కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజేంద్రప్రసాద్‌తో నటించిన ఇంద్రజ..పెద్దన్నయ్య తర్వాత మెగాస్టార్ సరసన నటిస్తుందని అనుకున్నారు. ఎందుకంటే ఆ మూవీలోని డ్యాన్సులు చూసినవారికి చిరంజీవికి ధీటుగా స్టెప్స్ వేయగలిగిన నటి ఇంద్రజే అని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత ఇంద్రజ తనంతట తానే చిన్న చిన్న హీరోల పక్కన క్యారెక్టర్లు చేస్తుండటంతో నిర్మాతలు దర్శకులు మెగాస్టార్ సరసన క్యారెక్టర్ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేయలేదట. దానికి తగ్గట్లే ఇంద్రజ తన పెళ్లి అయిన తర్వాత పూర్తిగా మలయాళ సినిమాలకే సమయం కేటాయించడంతో ఇక ఆ కోరిక నెరవేరలేదు. ఐతే మెగాస్టార్ మాత్రం ఇంద్రజ అంటే అభిమానం చూపుతారు. శతమానం భవతి సినిమాని కూడా ఇంద్రజ కోసమే చూసినట్లు ఆ సినిమాప్రమోషన్ ఈవెంట్లలో చెప్పారు కూడా..అలా ఈ నలుగురు నటీమణులు చిరంజీవి సరసన కథానాయికగా నటించే అవకాశం కోల్పోయారు

Comments