శ్యామలగౌరి టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్తుందనుకుంటే...అస్సలు అడ్రస్ కూడా లేదు..ఎవరికైనా తెలుసా


శ్యామలగౌరి..ఈ పేరు ఇప్పటితరానికి అస్సలు తెలీదు. ఎందుకంటే 1990తర్వాత ఈమె నటించడం మానేసింది. అసలు జాడే కన్పించకుండా పోయింది. ఉందో లేదో కూడా తెలీదు. హీరోయిన్ క్యారెక్టర్లతో పాటు వ్యాంప్ క్యారెక్టర్లు కూడా చేసిందీమె. చక్కని రూపు, కట్టిపడేసే దేహసౌందర్యం శ్యామలగౌరి సొంతం. ఈ పేరుతో ఇంతవరకూ అటు కన్నడం, మలయాళం, హిందీలో కూడా మరో నటి రాలేదు.
నటి దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వంలో నరేష్ ని హీరోగా పెట్టి తీసిన ప్రేమసంకెళ్లుతో ఈమె తెలుగుతెరని పలకరించింది. ఆ తర్వాత తరంగిణి సినిమాతో ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నారు. కానీ అలా జరిగినట్లులేదు. పల్నాటిపులి, అతనికంటే ఘనుడు, అమాయకుడు కాదు అసాధ్యుడు, ఈనాడు, ఈ పిల్లకి పెళ్లి అవుతుందా,
బిల్లా రంగా, స్వరాజ్యం, మోహిని, కిరాయి మొగుడు లాంటి సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా చేసినా..ఈ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కన్పించింది.




చండీరాణి అనే సినిమాలో అయితే మరీ అర్ధనగ్నంగా కూడా నటించింది. ఇది సుమన్ టార్జాన్ వేషంలో కన్పించే సినిమా. బి గ్రేడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా. భానుచందర్, సుమన్, నరేష్ వంటి హీరోలతో సినిమాలు చేసినా సరైన  ప్లానింగ్ మిస్సింగ్ అవడంతో ఈ బ్యూటీ తెరమరుగు అయింది. విజయశాంతి, శ్యామలగౌరి చూడటానికి అక్కచెల్లెళ్లులా కన్పిస్తారని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ విజయశాంతి టాప్ స్టార్ అయింది. శ్యామలగౌరి మాత్రం తెరమరుగు అయింది. తక్కువ కాలంలోనే దాదాపు 50 సినిమాల వరకూ చేసిన శ్యామలగౌరి గురించి ఇప్పుడు దుర్భిణి వేసి వెతికినా, ఒక్క వివరం తెలిస్తే ఒట్టు. అలానే గూగుల్ సెర్చింజన్‌కి కూడా దొరకని ఏకైక నటీమణి శ్యామలగౌరినే. ఈ మాత్రం వివరాలు కూడా మనమే ఇస్తున్నాం..ఇక ఎవరు ఇచ్చినా మన కథనానికి నకలు మాత్రమే


Comments