అయ్యప్పే వచ్చాడా..కలియుగంలో నిజంగా మహాద్భుతమే జరిగిందా


కేరళ వరదలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. దాదాపు 400మంది మరణించిన ఈ ప్రకృతి ప్రకోపంలో విలయం ఎంత స్థాయిలో ఉందో మానవత్వం పరిమళిస్తున్న సంఘటనలు కూడా అదే స్థాయిలో బైటికి వస్తున్నాయ్. తారాలోకం కోట్లకి కోట్లు విరాళాలు ప్రకటిస్తుంటే..మామూలు మనుషులు తమకి తోచిన రీతిలో సాయం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ మానవాతీత సంఘటన జరిగిందని ప్రచారం సాగుతోంది. కేరళ శబరిమల ఆలయం ఎంత ప్రఖ్యాతి చెందినదో అందరికీ తెలిసినదే. వరదలు సాక్షాత్తూ అయ్యప్ప పాదాలను తాకగా...దర్శనం సహా చాలా పూజలు నిలిచిపోయాయి. ఈ సందర్భంలో అక్కడి అర్చకులు ఇప్పుడు నిరపుథరి సేవలు చేస్తున్నారు. ఈ పూజలు చూసేందుకు భక్తులు మాత్రం రాలేకపోతున్నారు.



ఐతే రెండు రోజుల క్రితం ఓ అద్భుతం జరిగిందట. ఆలయాన్నే నమ్ముకుని నివసించే ప్రజలు, వ్యాపారస్తులు, కొంతమంది భక్తులు ఈ వరదల్లో చిక్కుకున్నారుట. ఇఁతలో ఓ వ్యక్తి ఓ నాటు పడవలో వచ్చాడట. వారందరిని విడతలవారీగా స్వామి ఆలయంపైకి చేరేందుకు సాయపడ్డాడట. అలా దాదాపు వందమంది ప్రాణాలు దక్కించుకున్నారుట. చివరిగా ఆ వచ్చిన వ్యక్తి పడవతో సహా నీటి ప్రవాహంలోకి వెనుదిరగగా..చూసినవారికి కొద్దిసేపటికి ఆ వ్యక్తి పడవ కన్పించకపోగా, ఓ పెద్దపులి మాత్రం వరద దాటుతూ కన్పించిందట. దీంతో తమని కాపాడింది సాక్షాత్తూ అయ్యప్ప స్వామేనంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారట. ఇదీ జరుగుతున్న ప్రచారం, ఇంకొంత మంది మాత్రం ప్రవాహంలో తాము కొట్టుకొచ్చిన బండలు, తెప్పలపై ఎక్కామని అవి కూడా పదునెట్టాంబడి వద్దకు తీసుకొచ్చాయని చెప్పారు. వీటన్నింటికీ అయ్యప్ప మహిమే కారణమని ప్రచారం జరుగుతోంది..ఐతే ఆర్‌బిఐ నామినేటెడ్ మెంబర్ గురుస్వామి మాత్రం అసలు వరదలు రావడానికి మణికంఠుడి దర్శనానికి మహిళలపై ఆంక్షలు తొలగించడమే అని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా పెద్ద దుమారమే రేగుతోంది. దైవమహిమతో మనుషులు చేస్తున్న సాయాన్నికూడా తక్కువ చేయలేం ఎందుకంటే, జైస్వామి అనే యువకుడు తాను పడవలకు అడ్డంగా పడుకుని తన వీపునే మెట్లుగా చేసి కనీసం 50మందిని వరదలను దాటించాడు. ఇలాంటి ఘటనలు వింటున్నప్పుడే మనిషి-మానవత్వం రెండూ ఉన్నాయనే నమ్మకం కలుగుతుంది



Comments