కింభోకి అంత సీన్ ఉందా


పతంజలి సంస్థకి చెందిన రామ్‌దేవ్ వాట్సాప్‌కి ధీటుగా తెస్తానంటూ హడావుడి చేస్తోన్న కింబో మెసెంజర్‌పై కుట్ర జరుగుతోందట. అందుకే గూగుల్‌ ప్లే స్టోర్‌లో దీన్ని కన్పించకుండా చేసినట్లు రామ్‌దేవ్ ఆరోపిస్తున్నారు. ఓ స్వదేశీ కంపెనీ ఎదగకూడదనే ఎంఎన్‌సి కంపెనీలు ఈ కుట్రకు పాల్పడ్డాయనేది ఆయన వాదన. పతంజలి కింబో గత రెండు నెలలు క్రితం(మే31న) కూడా ఇదే విధంగా లాంచ్ చేయడం పని చేయకుండా  పోవడంతోకింబో మెసెంజర్ వ్యవహారం అభాసు పాలవుతుందని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. గూగుల్ సంస్థని ఎందుకు తమ యాప్‌ని ప్లే
స్టోర్ నుంచి తొలగించారో చెప్పాలంటూ సంప్రదిస్తున్నా, ఎలాంటి సమాచారం రావడం లేదని వారు చెప్తున్నారు. ఐతే ఇప్పుడు పెట్టింది కేవలం ట్రయల్ వెర్షన్ మాత్రమే అని పతంజలి సంస్థ చెప్తోంది. ఆగస్ట్ 27న ఫుల్ ప్లెడ్జెడ్ యాప్ లాంఛ్ చేస్తామని చెప్తోంది. సంస్కృతంలో కింబో అంటే ఎలా ఉన్నారు అని అర్ధం. వాట్సాప్‌కి ధీటుగా ఈ పేరు సెలెక్ట్ చేసిన సంస్థ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం రెండుసార్లు నిరాశ పరిచిందనే చెప్పాలి. ఐతే తాము ఆగస్ట్
15న గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రవేశపెట్టిన తర్వాత లక్షన్నర డౌన్‌లోడ్లు అయిట్లు చెప్పడం విశేషం. అది కూడా మూడు గంటలలోపే.
ఇది నిజంగా ఫేస్ బుక్ సంస్థ తాలుకూ వాట్సాప్‌కి ధీటుగా ఓ స్వదేశీ సంస్థ యాప్ తయారు చేయగలదా అనేది ఆలోచించాల్సిన విషయం. వాస్తవంలో అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇలా ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేయడమనే అంశమే కాస్త హాస్యాస్పదంగా అన్పిస్తుంది. ఎందుకంటే అవకతవకలు లేని యాప్స్‌ని మాత్రమే తాము ప్లే స్టోర్‌లో ఉంచుతున్నట్లు గూగుల్ చెప్పుకుంటుంటుంది. ఇలాంటి సమయంలో భారత్‌లో పేరున్న ఓ సంస్థ యాప్‌ని ఎందుకు తొలగిస్తుంది..ఇప్పుడు ఇదే కాస్త ఆలోచించాల్సిన ప్రశ్న

Comments