కాస్ట్లీ ఫోన్లు కొనలేకపోతున్నారా...ఏం పర్లేదు ఇలా చేస్తే మీరూ వాడొచ్చు


ఆపిల్ ఫోన్..శాంసంగ్ గెలాక్సీ..లేదంటే ఇంకా ట్రెండీ ఫోన్లు వాడుతున్నవారిని చూసి ప్చ్..మనకా యోగం లేదు అని ఫీలవుతున్నారా..? ఇకపై ఆ బాధ లేదు. మీరూ ఆ ఫోన్లని వాడి మోజు తీర్చుకోవచ్చు..ఎలాగంటారా..రెంటోమోజో అనే ఓస్టార్టప్ ఇందుకోసం ఓ సొల్యూషన్ తయారు చేసింది. దాని ప్రకారం డబ్బు లేకపోయినా మాంఛి నిఖార్సైన..స్మార్ట్ ఫోన్లు వాడదామనుకునేవారు అద్దెకు తీసుకుంటే చక్కగా వాడుకోవచ్చు కదా..ఇదే రెంటోమోజో కాన్సెప్ట్

ఇప్పటికే ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్, బైక్స్ ఇలా అద్దెకు ఇస్తోన్న రెంటోమోజో రెండ్రోజుల క్రితం ఈ ఆఫర్ అనౌన్స్ చేసింది. దీంతో స్మార్ట్ ఫోన్ లవర్స్‌కి పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా..అన్ని రకాల ఫోన్లు వాడటం కుదరదు..ఇప్పుడు ఇలా అద్దెకి తీసుకోవడం ద్వారా అయితే  మొబైల్ ఫోన్లని దర్జాగా మార్చేయవచ్చు. ఐతే రెంటోమోజో ఇక్కడే చిన్న మెలిక పెట్టింది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ మోడల్, ఐఫోన్ 8 శాంసంగ్ గెలాక్సీ S9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, గూగుల్ పిక్సెల్ 2 మోడల్స్ ను ప్రీమియం ఫోన్ ప్లాన్ కింద అద్దెకి ఇవ్వబోతోంది. ఇవన్నీ కూడా
ఆరునెలలు, ఏడాది, రెండేళ్ల చొప్పున ఇలా రెంట్ ఆఫర్ ఇస్తోంది. అబ్బ ఇకనేం తెగ మార్చి మార్చి వాడేద్దాం ఫోన్లు అనుకోకండి..
ఐతే అద్దె మాత్రం వాచిపోతుంది ఎలానో తెలుసా..జస్ట్ నెలకు రూ.2999 నుంచి రూ.9229వరకూ వసూలు చేయబోతోంది. ఐతే రెండేళ్ల పాటు అద్దె కట్టినవాళ్లు సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఓరకంగా ఈఎంఐలు కట్టినట్లే అన్నమాట. కానీ ఇక్కడా కాస్త వెసులుబాటు ఉందంటోంది రెంటోమోజో ఐఫోన్ ఎక్స్ ను నెలకు రూ.4299 చొప్పున రెండేళ్లు తీసుకోవాలి. కానీ ఆఫ్ ఇయర్లీ బేసిస్‌పై తీసుకుంటే కేవలం రూ.9299 కడితే సరిపోతుంది. అదే రెండేళ్ల తర్వాత ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటే రూ.15556 కట్టాలి. అంతే కాకుండా ముందస్తు
డిపాజిట్ కింద రూ.9998 కట్టాలి. చీప్‌ రెంట్ ఫోన్ అంటే గూగుల్ పిక్సెల్ 2..ఇదైతే నెలకి రూ.2099 చొప్పున 24 నెలలు తీసుకోవచ్చు అదే అర్ధసంవత్సరమైతే రూ.5398 చొప్పున కట్టుకోవాలి. ముందస్తు డిపాజిట్ రూ.5398.



కొత్త ఫోన్ తీస్కోకుండా అద్దెకే ఎందుకు తీసుకోవాలి ?
 ఎందుకంటే, ఆండ్రాయిడ్ పై వెర్షన్ రిలీజ్ కాబోతోంది. అలానే గూగుల్ పిక్సెల్ కూడా కొత్త వెర్షన్ రాబోతోంది. కాబట్టి ఇప్పుడే కొత్త ఫోన్లు కొనడం కంటే ఓ రెండు మూడు నెలలు అద్దెకి తీసుకుని వాడి, ఆ తర్వాత లేటెస్ట్ వెర్షన్స్ వాడటం బెటర్ అనేది ఈరంగంలోని పండితుల మాట.

Comments