సూపర్‌స్టార్ తర్వాత అడివిశేష్.. శభాష్.!.బాపిరాజుతో లింక్ ఉందా


జేమ్స్ బాండ్ సినిమాలు తెలుగులో ఇక రావు అనుకుంటున్న నేపధ్యంలో దూసుకొచ్చిన సినిమా గూఢచారి..సూపర్ స్టార్ కృష్ణ తర్వాత బాండ్ పిక్చర్స్ తెలుగులో ఎవరూ టచ్ చేయలేదు. చిరంజీవి 1983లో గూఢచారి నంబర్ వన్ అనే సినిమా తీసినా పెద్దగా ఆడలేదు.


ఆ సినిమాకి దర్శకత్వం వహించింది కోడిరామకృష్ణ. ఇదే డైరక్టర్ సూపర్ స్టార్ కృష్ణతో 1989లో గూఢచారి 117 తీశాడు..ఇది కృష్ణ, మహేష్ బాబు నటించగా సూపర్ హిట్టైంది ఇక ఆ తర్వాత తిరిగి దాదాపు ముఫ్పై ఏళ్లకు ఇలా గూఢచారి పేరుతో జేమ్స్ బాండ్ మూవీ రావడం విశేషం.
 తమిళంలో గుర్తున్నంత వరకూ అర్జున్ 2003లో ఒట్రన్ పేరుతో ఓ సినిమా తీశాడు..ఇది కూడా  బాగానే ఆడింది. సూపర్ స్టార్ డమ్ రాకముందు నటశేఖర కృష్ణ గూఢచారి 116ని 1967లో తీయగా యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమానే ఇప్పటికీ తెలుగు బాండ్ సినిమాలకు ఆదిగా చెప్పాలి. అంటే యాభై ఏళ్లకి కానీ సూపర్ స్టార్ తర్వాత తెలుగుతెరకి మరో బాండ్ రాలేదన్నమాట. అడివిశేష్ చేసిన ఈ ప్రయోగం అందరి చేతా శభాష్ అన్పించుకుంటుంది.

 ఈ నేపధ్యంలో అడివిశేష్ పేరు కూడా తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే అడవి బాపిరాజు పేరుతో గొప్ప నవలాకారుడు, చిత్రకారుడు 1895లో భీమవరంలో జన్మించాడు. హైదరాబాద్ నిజాంలు నడిపిన మీజాన్ తెలుగు పత్రికకు సంపాదకుడిగా పని చేసి..వారికే వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించిన ఘనత ఆయన సొంతం అదొక్కటే కాకుండా..నవ్యసాహిత్య పరిషత్ స్థాపనతో పాటు గుంటూరులో చిత్రకళ కోసం ఓ సంస్థని స్థాపించారు. 13 నవలలు, 8 రేడియో నాటకాలు, 9 కథలు రచించారు. హిమబిందు, జాజిమల్లి, తరంగిణి, నారాయణరావు, కోణంగి,గోన గన్నారెడ్డి వాటిలో ప్రసిధ్ది పొందినవి.






విశ్వనాధ సత్యనారాయణ రాసిన కిన్నెరసానిపాటలకు ఈయనే పెయింటింగ్స్ వేశారట. 1922 సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఓ ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఈ కాలంలోనే తన అనుభవాలను తొలకరి పేరుతో ఓ నవలని రచించారాయన. అడవి బాపిరాజు కలం పేరు శాంతిశ్రీ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.వారిద్దరికీ చెరో కుమార్తె కుమారుడు కలగగా..వారికి బాపిరాజు పేరే పెట్టారు.వారి సంతానంలోని వారి వారసుడే ఈ అడివి శేష్ అని ప్రచారం జరుగుతోంది.

గతంలో శేష్ కూడా అడవిబాపిరాజు మనవడిగా తనని తాను చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయ్. అడివి శేష్ తల్లిదండ్రుల పేర్లు అడివి భవాని, అడివి సన్షీ ..శేష్‌కి ఓ చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు షిర్లే అడివి..అయితే సోషల్ మీడియాలో ఈమె ఆఫ్రో అమెరికన్ అని వివరాలు ఉండటం విశేషం. ఈమెకి పెళ్లై అమెరికాలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది



అడివిశేష్ మూలాలు ఎక్కడివైనా కూడా అమెరికాలో పుట్టి పెరిగి కూడా తెలుగులో చక్కగా మాట్లాడటం చూస్తే, ముచ్చట వేయకమానదు. ఈయన ఫస్ట్ మూవీ సొంతం..శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ఆర్యన్ రాజేష్. ఇది 2002లో విడుదల అయింది. విద్యాభ్యాసం మొత్తం అమెరికాలోనే చేసిన శేష్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన మొదటి సినిమా మొత్తం అమెరికాలోనే షూట్ చేశారు. కర్మ.. పేరుతో విడుదలైన ఆ సినిమాలో కల్కినిపోలిన క్యారెక్టర్ పోషించాడతను..సక్సెస్ సంగతి పక్కనబెడితే ఇలాంటి ప్రయోగం కొత్తగా వచ్చినవారు చేయడం విశేషం. ఇందుకోసం అతను సొంతంగా సంపాదించిన సొమ్ము ఖర్చుపెట్టాడట. దాదాపు 25శాతం నష్టాలు తెచ్చిపెట్టిన ఆ సినిమా తర్వాత శేష్ తెలుగులో సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయగా...పంజా అనే పవన్ కల్యాణ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. శాడిస్ట్ విలన్ గా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత దొంగాట, సొంతం,సైజ్ జీరో, ఊపిరి, బాహుబలి, కిస్, అమితుమీ లాంటి సినిమాలు చేశాడు. క్షణంతో సక్సెస్ బాట పట్టినా తర్వాత వచ్చిన సినిమాలు మళ్లీ ఫ్లాప్ అయ్యాయ్. ఐతే రెండేళ్ల క్రితం నుంచి గూఢచారి సినిమాపైనే దృష్టి పెట్టి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు
అడివి శేష్ పేరు మారు మోగుతుంది. పురాణాల్లోని కర్ణుడి క్యారెక్టర్ చేయాలనేది అతని కోరికగా శేష్ చెప్తుంటాడు. అడివి శేష్ హాబీలు రైటింగ్, జర్నీ చేయడం

Comments