మనిషంటే బాలయ్యే..పవన్ కల్యాణ్ కన్పించేంత జెన్యూన్ కాదు


ఈ మాటలు..ఓ గొప్ప వ్యక్తిత్వం..నేచర్ ఉన్న వ్యక్తి అన్న మాటలు. భరత్ రెడ్డి అని తెలుగులో ఓ మంచినటుడు ఉన్నాడు. ఈయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా నాలుగైదు భాషల్లో నటిస్తున్నాడు..నటుడు అనే పదానికి నిర్వచనం తెలిసిన వ్యక్తే కాదు. ఓ డాక్టర్ కూడా..అపోలో హాస్పటల్‌లో కార్డియాలజిస్టుగా పని చేస్తోన్న భరత్ రెడ్డిది స్వస్థలం తిరుపతి. చెన్నైలో స్కూలింగ్, ఆర్మేనియాలో మెడిసిన్ చేశాడు. నటన అంటే ప్రాణం పెట్టే భరత్ మొదటి సినిమా ఒక విచిత్రం..అందులో ఒక్క సీన్ లో చేసానని చెప్తాడు. గగనం, బిజినెస్ మెన్,ఈనాడు లాంటి సినిమాలతో దర్శకుల దృష్టిలో పడిన భరత్ విలక్షణ నటుడు అనే పదానికి భవిష్యత్తులో నిర్వచనం అవుతాడేమో అన్పిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో నటిస్తూ..అంతకంటే ఎక్కువగా ఇతర భాషల్లో నటిస్తుండటం భరత్ తప్ప వెేరెవరూ చేయలేదు. గంటలకొద్దీ ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూ మంచి ప్రాచుర్యం పొందిన ఓ యూట్యూబ్ ఛానల్లో తన భావాలు పంచుకున్నాడు భరత్. అందులో భాగంగానే తాను అనుకున్నది అనుకున్నట్లుగా బాలకృష్ణ నిజమైన మనిషి అని ఎంత అనుభవం స్టార్ డమ్ ఉన్నా ఆయనలా సాధారణంగా ప్రవర్తించడం చాలా గొప్ప విషయంగా చెప్పాడు. ఈ రోజుకీ సెట్ లోకానీ షూటింగ్ లో కానీ ఎక్కడా బాలయ్యకి ఒక్క గొడుగు కూడా పట్టుకోరని అలానే కూర్చుండిపోతారట. ఆయన్ని చూస్తే మాకు సిగ్గుగా అన్పిస్తుందని భరత్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్బంలో పవన్ కల్యాణ్ గురించి అడగగా..ఆయన బైట చెప్పుకునేంత జెన్యూన్ కాదని అన్నాడు.

నిజం చెప్పడం వలన తనకి ఛాన్సులు రాకపోతే రానీయకపోండి కానీ నాకు అన్పించింది ఇది అన్నాడు. అలానే శ్రీమంతుడి సినిమాలో రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ తనకి ఇచ్చినట్లే ఇచ్చి నిర్మాతలు మోసం చేశారని..ఆ విషయం మహేష్ బావ సంజయ్ కి ఫోన్ చేసి అడగగా తెలిసిందన్నాడు. తన క్యారెక్టర్ విషయంలో మహేష్ కానీ, సంజయ్ కానీ జోక్యం చేసుకోకపోయినా నిర్మాతలు వారిపై నెపం వేయాలని చూసారని చెప్పాడు. అయితే అదే మైత్రీ మూవీస్ లో తాను  ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నట్లు భరత్ చెప్పుకొచ్చాడు. అలానే గోపీచంద్ జిల్ సినిమాలోనూ తనకి మంచి క్యారెక్టర్ అని చెప్పి చివరకు డమ్మీని చేశారని వాపోయాడు.
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా..తమ హాస్పటల్ లోనూ తనతో గేమ్స్ ఆడేవాళ్లున్నారని..అయితే తాను మాత్రం తన అస్థిత్వం కోల్పోనని అంటాడు భరత్. ఫిట్ నెస్ కోసం రైస్, వైట్ షుగర్, సాల్ట్ మానేయమని సలహా ఇచ్చే భరత్‌కి  రోజూ జిమ్ కి వెళ్లడం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్, బ్లూబెరీ, ఆపిల్ తీసుకోవడం అలవాటు. ముఫ్పై ఏళ్ల వాడిలా కన్పించే భరత్ కి ఇద్దరు కొడుకులు కాగా వారిలో ఒకరు ఐఐటికోచింగ్ తీసుకుంటుండగా..మరొకరు బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సులో జాయిన్ అవబోతున్నారట. తన బిడ్డల్లో ఎవరూ చిత్రసీమలోకి రారని బల్లగుద్ది చెప్పడం విశేషం.


Comments