రేవంత్ ఎపిసోడ్ ఏం చెప్తోంది...? మంచి జరిగితే కాదు..మంచి చేస్తే తిరిగి వస్తారు ఎవరైనా


రేవంత్ రెడ్డి అవినీతితో సొమ్ము సంపాదించాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం కానే కాదు..ఎందుకంటే ఆదేం పెద్ద తప్పు కాదని..కొన్ని ఛానళ్లు ఇప్పటికే వాదన ప్రారంభించాయ్. ఆ లెక్కన చూస్తే..ఓటుకు నోటులో అడ్డంగా బుక్కైనప్పుడే ఆ వాదన చేసాడో మేధావి..అదే ఇతర నేతల విషయానికి వచ్చేసరికి దేశద్రోహం చేసినంత యాగీ చేసి..తమ వారి దగ్గరకొచ్చేసరికి మాత్రం లైట్ తీస్కోండి గురూ..ఇదేం పెద్ద తప్పా అనేస్తున్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా..అన్నదే ఇప్పుడు చర్చ..కాసేపు  ఆగితే అసలు ఎంత సేపట్లో చేస్తారు అనేవరకూ అంచనాలు వెళ్తాయి ఎందుకంటే..నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టాల్సిన సిబ్బంది ఏకంగా ఎంక్వైరీ రోజంతా చేయడం అనుమానాలకు తావిచ్చింది. అందులోనూ రేవంత్ రెడ్డి కామెంట్లు కూడా ఇదే అర్ధంలో ఉన్నాయ్. మంచి జరిగితే తిరిగి వస్తా..అంటూ అసలు మంచి చేస్తే మన జోలికి ఎవరు వస్తారు గురూ

కోట్లకి కోట్లు ఫెమా, మనీలాండరింగ్ కేసులు ఇతగాడిపై బైటపెట్టారు కానీ..బైటపెట్టిన సందర్భమే కుట్రపూరితం. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై పెద్దవాళ్లు కసి కొద్దీ పగ కొద్దీ..వ్యక్తిగతంగా తీసుకుని దాడులు చేస్తున్నట్లు ఎవరికైనా అర్ధం అవుతుంది. ఎఁదుకంటే పిటీషన్ వేసింది గతంలోనే అయితే..దాన్ని వదిలేయవచ్చు..కానీ ఇది ఎన్నికల సమయంలో ఎంక్వైరీ, తనిఖీకి అనుమతి ఇవ్వడమే కుట్ర. రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలతోనే ఈ వివాదం రగిలిస్తున్నారు. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్లు..అప్పోజిషన్ కోపం..అధినేతకి కోపం తెప్పిస్తుంది..కానీ ఇందులో మరో  అధినేత కూడా ఇన్ డైరక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు..ఆయన స్పందన ఏంటో మరి..ఇవాళ మాట్లాడతాడా లేక ష్..గప్ చిప్పా...?

Comments