ఎన్‌టిఆర్ సాధించిన అరుదైన రికార్డు నేటికీ పదిలం


నందమూరి తారకరామారావు చలనచిత్రరంగంలో సృష్టించిన రికార్డులు ఎన్నెన్నో..వాటిలో ఒకటి ఇప్పటికీ తిరుగులేని రికార్డు ఒకదాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు సైడ్ థియేటర్లలో కూడా వాటి రన్ పొడించారు. ఇలా ఆంధ్రా, సీడెడ్‌లో ఏ హీరోకి ఒక సంవత్సరంలో జరిగిన చరిత్ర లేదు. 1973లో విడుదలైన దేశోధ్దారకులు, దేవుడు చేసిన మనుషులు, వాడేవీడు ఈ మూడు సినిమాలు..రిలీజ్ కావడం మూడు థియేటర్లలో విడుదలై...రెండో వారంలోనూ కంటిన్యూ అయ్యాయ్. విజయవాడ, నెల్లూరులో ఈ సినిమాలు ఒక్కోటి మూడుథియేటర్లలో రిలీజ్ అయ్యాయ్. 1973లోనే అలా ఏకంగా మూడు సినిమాలు హిట్ కావడం
ఎన్టీఆర్ క్రేజ్ కి నిదర్శనం. దేశోధ్దారకులు సినిమా మార్చి 29న విడుదల అయింది. ఇందులో వాణిశ్రీ హీరోయిన్ కాగా యువి విశ్వేశ్వర్రావ్ నిర్మాత. సిఎస్ రావ్ దర్శకత్వం వహించారు.
దేవుడు చేసిన మనుషులు ఆగస్ట్ 9న విడుదల అయింది. ఇందులో మరో సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. దీనికి ఆయనే నిర్మాత కూడా.1969లో స్త్రీ జన్మలో ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించగా..తిరిగి ఐదేళ్ల తర్వాత నటించిన సినిమా ఇది. ఈలోపున ఎన్టీఆర్ 200 సినిమాలు పూర్తి చేశారు.  వి.రామచంద్రరావ్ దర్శకత్వం వహించిన దేవుడు చేసిన మనుషులు తెలుగుచలనచిత్రరికార్డులను తిరగరాసింది. ఇక అదే ఏడాది అంటే 1973 అక్టోబర్ 10న వాడేవీడు రిలీజ్ అయింది. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజుల హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకి ఎన్టీఆర్‌తో ఫస్ట్ మూవీ అంటారు. అలానే దాశరధి, దేవులపల్లి , కొసరాజు. సి.నారాయణరెడ్డి ఈ సినిమాలో పాటలు రాయడం విశేషం. 1973లో ఎన్టీఆర్ సినిమాలు ఐదు విడుదల కాగా..వాటిలో మూడు సినిమాలు ఇలా సైడ్ ధియేటర్లలో కూడా రెండోవారం ప్రదర్శింపబడటం విశేషం. ఇప్పటికీ ఈ రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేదని అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తున్నవారి మాట


Comments