శ్రేష్ఠ చెప్పిన మాటలు వింటే ఇండస్ట్రీ ఎంత రొచ్చుదో అర్ధం అవుతోంది


ప్రతి ఒక్కరికీ సినిమారంగంలో ప్రతిభ చాటాలని ఉంటుంది. కొంతమంది కేవలం డబ్బు కోసం ఆ రంగం ఎంచుకోవచ్చు. కొంతమంది తమ రంగంపై ఉన్న ఆసక్తి, తపనతో సినిమాలను ఎంచుకోవచ్చు. కానీ కేవలం డబ్బు పెట్టే తీస్తున్నాం కదా అనే ధీమాతో ఎవరినైనా పక్కలోకి లాగాలనే లఫంగిగాళ్లు కూడా ఉంటారు. వారి వల్ల తనకి ఎదురైన అనుభవాలను పంచుకున్న శ్రేష్ఠ కథ వింటే మాత్రం అసలు తెలుగు సినిమారంగంలో సరైన మగాడే లేడా అన్పించకమానదు. కాస్త అందంగా కన్పిస్తే చాలు పక్కపై లాగేవరకూ నిద్రపోకుండా వెంటాడి వేధించే నిర్మాతలు, డైరక్టర్లకు మహిళలు కూడా సహకరిస్తారని శ్రేష్ఠ తన అనుభవం ద్వారా చెప్తోంది.

ఒక రొమాంటిక్ ప్రేమ కథ సినిమాతో తెలుగు తెరకు తొలి రచయిత్రి, పాటలరచయిత్రిగా పరిచయం అయిన శ్రేష్ఠ సినిమారంగంలోని వేధింపులు తట్టుకోలేక ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. కేవలం తనకి లొంగలేదని ఓ నిర్మాత ఏడేళ్లు వేధించాడట. సినిమాలు పెద్దగా తీయకపోయినా, సదరు నిర్మాతకి రాజకీయ పలుకుబడి బాగా ఉందట రోజూ మనుషులతో వెంటాడటం సినిమా ఛాన్సులు లాగేయడం వంటి ఛండాలపు పనులు చేశాడని శ్రేష్ఠ చెప్పుకొచ్చింది. అలానే ఓ లేడీ డైరక్టర్ తనని ఎవరికో తార్చే పార్టీ కూడా ఏర్పాటు చేసిన నిర్వాకం కూడా శ్రేష్ఠ ఎదుర్కొన్నదట. ఐతే ఈ లేడీ డైరక్టర్ తీసిన సినిమా ఒక్కటేనట..అది కూడా రిలీజ్ కాలేదు  ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యే సరికే తాను మంచిర్యాలకి మారిపోయానని చెప్పడం చూస్తే తెలుగు చిత్రరంగంలో పడకవేషాల ట్రెండ్ ఎంతగా పాతుకుపోయిందో అర్దమవుతోంది.

తిరిగి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డితో తన సత్తా చాటిన శ్రేష్ఠ ఇప్పటికీ తనకి రుజువులు కనుక దొరికితే తప్పకుండా సదరు నిర్మాతని కోర్టుకు ఈడ్చుతానని చెప్తోంది. ఆమె చెప్తోన్న దానిని బట్టి..ఆ నిర్మాత పెద్ద ప్రొడ్యూసర్ కాదు..కానీ పెద్ద సినిమాలు చేశాడు. ఈ మధ్యే తన కొడుకుని కూడా హీరోగాచేశాడని అర్ధం అవుతోంది. లేదంటే చిల్లర సినిమాలు తీసే మరో చిల్లర నిర్మాతగాడన్నా అయు ఉంటుందని అంచనా.. ఈ ఇద్దరిలో ఎవరో మీకు అర్ధమయ్యే ఉండాలి.  లేడీ డైరక్టర్ మాత్రం ఎవరికీ తెలీదట. అంటే ఆమె ఏదో సినిమా ఆడవాళ్లతోనే తీయాలని అని మొదలుపెట్టి, రిలీజ్ చేయలేకపోయిందట. బహుశా యాంకర్ వృత్తిలో రాణిస్తున్న ఓ రెండక్షరాల స్త్రీ ఈ ప్రయత్నం చేసింది..మొగుడికి గుడ్ బై చెప్పేసిన సదరు మహిళ ఎవరో మీకీ పాటికి తెలిసిపోయి ఉంటుంది.

Comments