వదిలేయండి బాస్..బండ్ల గణేష్ జస్ట్ ఓ కమెడియన్ అనుకోండి


బండ్ల గణేష్‌ని పాపం సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటుంది..బహుశా ఆయన మాటలు ప్రగల్భాలు..ఉత్తరకుమార ప్రకటనల్లా కన్పించి ఉండవచ్చు..ఇంకొకరికి కేఎపాల్ జూనియర్ లాగానూ ఉండొచ్చు..కానీ
పాపం అతను పంచిన కామెడీనే చూసి ఎంజాయ్ చేయాలే తప్ప..అతనొక్కడే ఇలాంటి ఆర్భాటం చేసినట్లు టార్గెట్ చేయవద్దు..
ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో..విలన్..క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య డ్రామా పండుతుంటుంది..ఒక్కోసారి డ్రైగా కూడా
అన్పిస్తుండొచ్చు..కానీ మధ్యలో ఓ కమెడియన్ వస్తే మాత్రం తెగ రిలీఫ్ లభిస్తుంది..కన్పించిన కాసేపూ హాయిగా నవ్వేసుకుంటాం..అప్పటిదాకా సినిమా తలనొప్పి అన్పించినా..ఆ ఒక్క ఐదు నిమిషాలూ సంతోషంగా అన్పిస్తుంది..అదీ కామెడీకి ఉన్న ప్రాధాన్యత.

అదే ప్రాధాన్యత బండ్ల గణేష్ కి ఇవ్వాలే కానీ..పాపం..గణేష్ పీక కోసుకోలేదేంటి..ఎక్కడున్నాడు గణేష్ అని వెంటపడొద్దు..చాతనైతే..రేవంత్ రెడ్డి వెంటపడండి..ఉత్తమ్ కుమార్ వెంట పడండి..ఒకళ్లు రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు..మరొకరు గడ్డమే తీసుకోనన్నారు..ఓ పెద్ద నేతలపై కామెంట్లు చేయాలన్నా..పదిమందిని వెంటేసుకుని పనులు చేయించాలన్నా..వీళ్లే చేయగలరు..అలాంటి నేతలపై సెటైర్లు వేయవచ్చు కానీ..ఆటలో అరటిపండులాంటి బండ్ల గణేష్ ని ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం..జస్ట్ క్షమించి వదిలేయండి బాస్

Comments