ఇలాంటి డిజిపి హైదరాబాద్, ఆంధ్రాలో ఉంటేనా..ఈయన కథే వేరు గురూ

ఉత్తరప్రదేశ్‌లో ఖైదీలు నేరగాళ్లు బెయిల్ ఇచ్చినా బైటికి పోవడం లేదట..కోర్టులు బెయిల్ మంజూరు చేసినా..జైలుకే వెళ్తాం కానీ..బయట తిరగం అని చెప్తున్నారట. 2017 మార్చి నుంచి 2018 జనవరి వరకూ ఇలాంటి కేసులు 5వేల చిల్లర నమోదు అయ్యాయట. ఎందుకూ అంటే..ఉత్తరప్రదేశ్ పోలీస్ బాస్ ఓం ప్రకాష్ సింగ్ పేరు చెప్తున్నారు
యూపి 100 పేరుతో ఓ డయల్ సర్వీస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతే కాకుండా విమెన్ ప్రొటెక్షన్ స్క్వాడ్ కూడా ఒకటి పెట్టి..ఈవ్ టీజర్లు బెండు తీస్తోంది. యాంటీ గూండా స్క్వాడ్ అయితే ఏకంగా ఈ  పది నెలల్లో 
3వేలకిపైగా ఎన్ కౌంటర్లు చే సింది..ఇందులో 1031 మందిని అరెస్చ్ చేయగా...53మందిని చంపేసింది. దీంతో నేరస్తుల గుండెల్లో నిజంగా వణుకు ప్రారంభమైంది.. అసలు కోర్టుకి హాజరు పరిచిన తర్వాత బెయిల్ వచ్చినా బెండు తీసుడు కార్యక్రమం ఉంటుందట. దీంతో బెయిల్ మాకు వద్దు నాయనా...మేం జెైల్లోనే శిక్ష అనుభవిస్తాం అంటున్నారట.
దీనికి తోడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా ముద్రపడ్డవారిని  అరెస్ట్ చేయడంలాంటి పనులేం పెట్టుకోరట. డైరక్ట్ గా ఎన్ కౌంటర్ లేదంటే కాళ్లు విరిచేయడం చేస్తుండటంతో..నేరుగా కోర్టుకి వెళ్లి లొంగుబాట పట్టారట. ఇలాంటి కేసులు 5వేలకి పైగానే అని మొదట్లోనే చెప్పుకున్నాం కదా.. పైగా మనోడు వీటిని ఎన్ కౌంటర్లు అనం..ఎంగేజ్మెంట్లు అంటాం అని కొత్త పేర్లు కూడా పెడుతున్నాడట.
ఈ మధ్యనే బులంద్ షహర్‌లో అల్లర్లలో పోలీస్ చనిపోవడం గుర్తుండే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ పై విమర్శలు వస్తున్నా ఏం చలించడు. మొత్తం ఇప్పటికి ఈ  పదినెలల్లో 22లక్షలమందిని గూండా, ఇతరత్రా కేసులలో ఎంక్వైరీ క ోసం పిలిచి ప్రశ్నించారంటే అయ్యగారు ఏ రేంజ్ లో హడావుడి చేస్తుంటారో ఆర్ధమైపోయి ఉంటుంది. 
యూపీ పోలీస్ బాస్ కథ తెలియాలంటే ఇంకా చాలా ఉంది. నేరస్తులను వాయించడంలో ఘనాపాటి అయినా..మంచి సింగర్ కూడా అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. 1995లో ఇదే ఉత్తరప్రదేశ్ లక్నోకి సింగ్ ఎస్పీగా పని చేశాడట ఇప్పుడు స్టేట్ కి డిజిపికి వచ్చేశాడు..పై నుంచి కిందదాకా తాట తీసేస్తున్నాడు..ఇలాంటి డిజిపిలు మనకి రారు..వచ్చినా..మనం గుర్తించమేమో



Comments