కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబుని ఏపీలో గెలిపిస్తాడా...?


తెలంగాణలో ప్రస్తుతానికి కేసీఆర్ కి తిరుగులేదని ప్రూవ్ అయింది. ఐతే కేసీఆర్ మాట్లాడుతూ..ఏపీలోనూ తన తఢాఖా చూపిస్తానని..తనకి గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకి తిరిగి గిఫ్ట్ ఇవ్వకపోతే సంస్కారం లేదనుకుంటారని జోక్ వేశాడు..కానీ నిజంగానే కేసీఆర్ చంద్రబాబుకి ఫేవర్ చేయబోతున్నాడా...కొద్దిగా డీప్ గా చూద్దాం

డిసెంబర్ 4..సాయంత్రం ఎవరో పిలిచినట్లు వచ్చేసి ఆంధ్రా ఆక్టోపస్‌లా పేరున్న లగడపాటి..తన సర్వే అంటూ
ఇద్దరు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పాడు..కట్ చేస్తే..కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ దాన్ని నమ్మొద్దని..చంద్రబాబు ప్రేరేపిత బోగస్ సర్వే అది అని చెప్పేశారు..అప్పటికైనా వదలొచ్చు కదా..వదల్లేదు. డిసెంబర్ 5 మళ్లీ పేరంటంలా వచ్చి..కేటీఆర్ ట్వీట్లు బైటపెట్టిన తర్వాత నేనెందుకు చెప్పకూడదంటూ..వరంగల్..అదిలాబాద్ అన్నీ కాంగ్రెస్ వేనంటూ చెప్పుకొచ్చాడు..చంద్రబాబుని కలవలేదు..నాకేం అవసరం అంటూ సెంటిమెంట్ ని రెచ్చగొట్టేశాడు..పైగా పోలింగ్ శాతం పెరిగేకొద్ద ీమీకే డేంజర్ అనే కలరింగ్ ఇచ్చాడు. దీంతో వళ్లు మండిన తెలంగాణ ఓటర్లు చూద్దాం..ఎలా టిఆర్ఎస్ ఓడిపోతుందో..ఓటింగ్ పెరిగితే అన్నట్లు ఓటింగ్ శాతం పెంచారు..ఫలితం..చూశారు కదా..ఎలా వచ్చాయో రిజల్ట్స్..
సీన్ ఇక్కడ కట్ చేసి మళ్లీ కేసీఆర్ డైలాగ్ దగ్గరకి వద్దాం...చంద్రబాబు బహుమతికి మళ్లీ మనం రిటర్న గిఫ్ట్ ఇవ్వొద్దా
అంటే ఇలానే రేపొద్దున్న ఎన్నికల సమయంలో వెళ్లి జగన్ కి మద్దతుగా ప్రచారం చేసి వస్తాడా..అలా చేస్తే..జగన్ కి ఏపీ జనం ఓట్లేస్తారా..ప్రాథమికంగా వస్తోన్న డౌట్..అంటే..ఈ ఇద్దరు సిఎంలు కావాలనే ఇలా గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోబోతున్నారా...(సరదాకి అయినా కూడా పాలిటిక్స్ లో మరి ఇలాంటివే జరుగుతాయి)
వాస్తవానికి లగడపాటి వచ్చి రెచ్చగొట్టకపోతే..తెలంగాణ ఓటరు టిఆర్ఎస్‌కి ఇన్ని ఓట్లు కట్టబెట్టేవారు కాదని ఓ టాక్ ఉంది. 

Comments

  1. లీకు జ్యోతికి.. నిన్నటిదాకా "నందమూరి సుహాసిని".. ఈరోజు నుంచీ ఒట్టి "సుహాసిని" ఎందుకైందబ్బా?

    ReplyDelete

Post a Comment