హీరోయిన్‌గా వచ్చి వ్యాంప్‌లుగా సెటిలైన వీళ్లు గురించి మీకు తెలుసా

రంగుల చిత్రలోకంలో రకరకాల చిత్రాలు దొర్లుతుంటాయ్. ఈ రోజు హీరో అన్నవాడు..రేపు జీరో అవుతాడు..అసలు తెరమరుగే అవుతారు. కానీ కొంతమందికైనా వాళ్ల గతం తెలిసి ఉంటుంది. ఐతే హీరోయిన్ల విషయంలో మాత్రం ఈ విషయం వాళ్లు చెప్పుకుంటే తప్ప తెలిసే వీలు ఉండదు..అలాంటి వాళ్ల గురించి చెప్పుకుందాం

మొదటగా..రాజసులోచన..ఈమె చాలాకాలం హీరోయిన్‌గానే చేసింది. .బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కలర్ సిినిమాల వరకూ రాజసులోచన హీరోయిన్ గా చేసినా తర్వాత మాత్రం  క్యారెక్టర్లు..ఆ తర్వాత విలనీ క్యారెక్టర్లు కూడా చేశారు.  అసలు ఈ లిస్టులో ఆమె పేరు చేర్చకూడదు..గొప్పనటి..కానీ అప్పట్లో సంప్రదాయబద్దంగా ఉండే వ్యాంప్ క్యారెక్టర్లని చేయించారామె చేత.  అలానే కె.విజయ అని అందమైన వర్ఛస్సు ఉన్న మరో నటి కూడా అంతే..గిరిబాబు, శరత్ బాబు వంటి వారి సరసన హీరోయిన్ గా చేసినా...తర్వాత చిన్నా చితకా క్యారెక్టర్లకి పరిమితమైంది. ఈ కోవలో వై. విజయ గుర్తుండే ఉంటుంది. ఆమె కూడా మొదట హీరోయిన్‌గానే పరిచయం అయింది. అందులోనూ రొమాంటిక్ హీరో కమల్ హసన్ సరసన..కానీ ఆతర్వాత కాలం కలిసిరాక ఎలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు చేసిందో చూశారు కదా..



 చక్కని అందగత్తె అయిన జయలలిత కూడా మొదట్లో సంప్రదాయబద్దమైన క్యారెక్టర్లే చేసింది. శృతిలయలు సినిమాలో పరిచయం అయిన జయలలిత..తర్వాత అట్టాంటిట్టాందాన్ని కాదు మేస్త్రీ అర్ధరూపాయి డబ్బులకు రాను మేస్త్రీ అంటూ గెంతులేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు అమ్మమ్మ.కామ్ తో ఆ ముద్ర చెరిపివేసుకోగలిగింది. కానీ ఈరోజుకీ పాపం జయలలిత అంటే వ్యాంప్ గానే చూస్తారు. భరత్ అనే నేను కాస్త రిలీఫ్ ఇచ్చినా, నిర్మాతల ధృక్కోణం మాత్రం అదే.





ఇప్పుడు సెక్సిణిగా పిలుపించుకుంటున్న హంసానందినిది అదే పరిస్థితి. వంశీ దర్సకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా నిర్మాత, దర్సకులకు ఈమెలోని సిల్క్ నచ్చిందే తప్ప...సావిత్రి కన్పించలేదు. ఈ డైలాగ్ వాడింది పార్వతి మెల్టన్‌పై హీరో రాజా వెన్నెల సినిమాలో...నిజంగానే వెన్నెల సినిమా తర్వాత పార్వతి మెల్టన్ హీరోయిన్ గా కంటే..ఐటెమ్ నంబర్లకే పరిమితమైంది. మంచి ఒడ్డూ పొడుగూ ఉన్నా..ఆమెని హీరోయిన్ గా అంగీకరించడం మానేశారు. 

Comments