ఏపీ స్పీకర్‌ కూడా అంతేనా..సెంటిమెంట్‌ని దాటలేరా..!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరగడం ద్వారా వచ్చే ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ కూటమితో కలిసి పోటీ చేయాలా వద్దా అనే అంశం పెద్ద సమస్య కాకుండా పోయింది కేసీఆర్‌కి. బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి  అవుతున్నారు మళ్లీ..ఐతే ఆయన సహచరులు ఐదుగురు ఓడిపోవడం చూశాం..వారిలో భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ఒకరు..ఆయన స్పీకర్ కూడా..20మంది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా పార్టీ మార్చినా..కించిత్ మాట అనకుండా రాజ్యాంగబద్ద పదవిని అడ్డం పెట్టుకుని నన్నెవడూ అడగలేరు..నేనేం చేయలేను అన్న రీతిలో చారి వ్యవహరించిన తీరు కూడా చూశాం..అసలు సభలో కూడా ఆయన తీరు చూస్తే పాపం అన్పించకతప్పదు

అలాంటిది ఆయన ఓటమి ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు కానీ..స్పీకర్ గా పదవి నిర్వహించిన వారు ఎవరూ తిరిగి గెలవరు అని ఓ సెంటిమెంట్ ఉంది..అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కంటిన్యూ అవుతోంది..ఇప్పుడు తెలంగాణలోనూ కొనసాగింది. స్పీకర్ గా పదవి నిర్వహించిన తర్వాత వెెంటనే జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం చూశాం..ఆ తర్వాత తిరిగి కుతూహలమ్మ, ప్రతిభా భారతి లాంటివాళ్లకి మినహాయింపు ఉండొచ్చేమో కానీ...వెంటనే గెలవడం మాత్రం జరగలేదు( రికార్డు సరి చూసుకోవాలి).

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఏపీలోనూ రిపీట్ అవుతుందేమో  చూడాలి. ఈయన తన నియోజకవర్గం మారి మరీ సత్తెనపల్లినుంచి గట్టెక్కగలిగారు. స్పీకర్ అయ్యారు. తన పుత్రరత్నాన్ని ఆల్రెడీ ఫీల్డ్‌లో దింపేసిన కోడెల మళ్లీ పోటీ చేస్తారో...లేక కొడుకునే రంగంలోకి దింపుతారో..చూడాలి..ఓ వేళ పోటీ చేస్తే మాత్రం ఓటమి తప్పదని ప్రత్యర్ధివర్గాలు చెప్తున్నాయ్. దానికి తోడు సెంటిమెంట్ ఎటూ ఉంది. కళ్లముందు నాదెండ్ల మనోహర్ కన్పిస్తూనే ఉన్నాడు..ఆయనకి ముందు కిరణ్ కుమార్ రెడ్డి  ఉండనే ఉన్నాడు..స్పీకర్ స్థానం నుంచి ఏకంగా సిఎం అయిన లక్ కిరణ్ కుమార్ రెడ్డిది.

ఐతే ఆంధ్రప్రదేశ్‌లోనూ స్పీకర్ పద్దతి విమర్శలపాలవుతూనే ఉంది. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా చూడటం..ఇంకోటి ఎన్నికలలో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టాను అని అన్నారనే ఆరోపణలపై కోర్టులో పిటీషన్ దాఖలు అయింది. ఇలా వివాదాస్పద వైఖరిపై కూడా జనంలో చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ అంశం కూడా చర్చకు రాకతప్పదు. అందుకే ఏపీలోనూ స్పీకర్ సెంటిమెంట్ నిజమవుతుందనే వాదనే ఎక్కువగా విన్పిస్తుంది

Comments