లగడపాటి చేసిన ఒక్క తప్పు ఎంతమంది ఫేట్ మార్చిందో చూడండి


సర్వే అంటే తెలుగునాట గత పదేళ్లుగా గుర్తొచ్చే పేరు లగడపాటి రాజగోపాల్..ఆయన రాజకీయాలకు దూరం..కానీ ఎవరూ అడక్కపోయినా ఆయన టీమ్ చేత చేయిస్తూ ఉంటారు. ఇదే ద్వైధీ భావన అంటే..ఇలాంటి భావన ఉంటే ఉండొచ్చు కానీ...మనసులో ఒకటి పెట్టుకుని బైటికి ఇంకొకటి చెప్తే..ఏం జరుగుతుంది..వాస్తవాలు బైటికి వచ్చినప్పుడు పరువు పోతుంది..ఇప్పుడదే జరుగుతోంది..తెలంగాణ జనం మొత్తం లగడపాటిని జోకర్ చేశారు..ఇంకా సెటైర్లు వేస్తున్నారు..నిజానికి ఆయన నిజాయితీగా చేయించి ఉంటే..ఆ సంగతి డిసెంబర్ 7నో...9నో చెప్పాల్సింది కానీ..ముందు రోజు చెప్పి టిఆర్ఎస్ జనం ఆగ్రహానికి, కడుపుమంటకి కారణమయ్యారు..ఇపుడు ఆయన చేసిన ఆ ఒక్క తప్పు వల్ల..కనీసం పదిమంది ఓటమి పాలయ్యారు. వందల సంఖ్యలో పందెగాళ్లు సొమ్ము పోగొట్టుకున్నారు..( జూదగాళ్లు ఎలాగైనా వళ్లు ఇల్లు గుల్ల చేసుకుంటారు..అదేం పట్టించుకోకూడదు) కానీ దీనివలన
ఆయన పోగొట్టుకున్నది క్రెడిబులిటీ...అది ఒకసారి పోతే..ఎంత తీవ్రంగా కష్టపడాలో భవిష్యత్తే చెప్తుంది 

ఓ రకంగా ఆయన సర్వే తప్పు అయింది కాబట్టి, ఇకపై ఆయన సర్వేలను గుడ్డిగా ఫాలో  అవరు..రెండు ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నట్లు సర్వే ట్యాంపరింగ్ జరిగి ఉంటే..అది ఆయన క్రెడిబులిటీని దెబ్బతీసినట్లే..ఇప్పుడు ఈ పరిణామం వలన ఏపీలో కానీ..లోక్ సభ ఎన్నికలలో కానీ..ఆయన చెప్పే మాటలు...జగన్ కి ప్లస్ కాబోతున్నాయ్. ఎందుకంటే..ఆయన టిడిపివైపే మొగ్గు చూపుతున్నట్లు( ప్రస్తుతానికి) తెలుస్తుంది కాబట్టి...ఆ పార్టీ తరపున రంగంలో ఉన్నా...ఎవరికైనా మద్దతు ఇచ్చినా ఆయన చెప్పబోయే సర్వే రిజల్ట్స్ ని వైఎస్సార్సీపీ ఎగతాళి చేయడం ఖాయం. 

లేదూ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చినా పట్టించుకోరు..ఎందుకంటే..అధికార పార్టికి వ్యతిరేకత ఉందనే విషయం ఏ సర్వే అయినా ఇవ్వడానికి 40శాతం అవకాశం ఉంది..కాబట్టి వాటిలో ఇదీ ఒకటిగా మిగిలిపోతుంది..ఇప్పటికి మాత్రం లగడపాటి-చంద్రబాబు ఇద్దరూ సర్వేలపై మాట్లాడే అవకాశం కోల్పోయారు. ఎటొచ్చీ చంద్రబాబు గారే కర్నాటకలో నే పిలుపు ఇచ్చా...బిజెపిని ఓడించారు..అనే రొటీన్ డైలాగ్‌ని ఏపీలో వేసే హక్కు కోల్పోయారు..ఇప్పుడు తెలంగాణ ఓటమిని చూపుతూ..పక్క తెలుగురాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేని వాళ్లు..ఇక దేశంలో ఏం చక్రం తిప్పుతారనే ఎద్దేవాని ఎదుర్కొంటూ 2019 ఎన్నికల ఫలితాల వరకూ తిరగాలి..ఈ ఎపిసోడ్‌లో పరువు పోగొట్టుకున్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు..సర్వే తర్వాత పోలింగ్ జరిగింది..ఐనా పోలింగ్ తర్వాత కూడా సదరు లగడపాటి సర్వేకి మద్దతుగా కథనాలు రాసుకొచ్చిన ఆ పత్రికపై ఇప్పుడు తెలంగాణ వాసులు ఎన్ని జోకులు వేసుకుంటున్నారో నిజంగా గ్రహిస్తే..వారి నోట నుంచి ఇఁకే పలుకూ...రాదు..

Comments