ఇదేనా సంక్రాంతి సందడి.. పండగ పూట కూడా మాకీ బాకా ఎందుకు బాబూ


పండగకి ఊరెళ్లాం..మీరూ ఊరెళ్లండి అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటూ ముఖ్యమంత్రి గారి సందేశం విని కాస్త నిట్టూర్చిన మీడియా జీవులకు అంతలోనే ఉలికిపాటు..మధ్యాహ్న భోజనం ముగించకుని కాస్త రిలాక్స్ అయ్యారో లేదో..అయ్యవారు మొదలెట్టేశారు..ఈ రాష్ట్రానికి నేను చేసినంత ఎవరూ చేయలేదు..పొరుగు రాష్ట్రం కంటే నేనే ఎక్కువ చేశా..దేశంలోనే ఇది మొదటిసారి.. ఇబ్బందుల్లో ఉన్నా..చాలా బాగా చేశాం..ఇది ఇంతే కాదు..ఇంకా చాలా ఉంది  అనుకుంటూ సాగిపోతూనే ఉంది ప్రసంగం..
 పండగ పూట ఊరెళ్లినవాళ్లు ఆ పనేదో చూస్కోకుండా..ఇదేంటి బాబూ అని చాలామంది చిరాకుపడుతూనే లైవ్ లు కనెక్ట్ చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు..దానికి ఎవరూ ఎవరినీ తప్పుబట్టరు. కానీ కావాలనే ఆయన్నెవరో అడిగినట్లే...షర్మిల కామెంట్లు కరెక్ట్ కాదు..ఆమె మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తుంది ఇది చూస్తూ ఊరుకోం అంటూ ఉన్నట్లుండి రాజకీయ ప్రసంగం మొదలెట్టేశారు..ఇదేనా పండగ జరుపుకునే తీరు..

పైగా మాపై నిందలు వేసింది..ఏపీలో కంప్లైంట్ ఇవ్వకపోవడమేంటి అంటారు..అంటే ఏపీలోనే ఈ వ్యవహారానికి బీజం పడిందా..ఆమె ఉఁడేది..హైదరాబాద్ లో కాబట్టి..అక్కడే కేసు పెట్టారు కానీ..సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్కడైనా సదరు కేసుని విచారిస్తారు కదా..దీనికి పలానా చోటే కేసు పెట్టాలనేం రూలేమైనా ఉఁదా..ఆ లెక్కన హైదరాబాద్ లో బతికే ఏపీవాసులంతా తమకి చెందిన కేసులు ఏవైనా ఏపీకి వచ్చి పెట్టాలా..ఓ వేళ మీ బాధ అదే అయితే మరి 2014లో వాసిరెడ్డి పద్మ స్వయంగా కేసు పెట్టింది..ఆ కేసు సంగిత ఏమైంది..పొలిటికల్ పంచ్ నిర్వాహకుడిపై ఆఘమేఘాలపైన చూపించిన చొరవ మిగిలిన కంంప్లైంట్ల విషయంలో ఎందుకు చూపలేదు..

ఐనా మీరు పెట్టుకుంటే పొత్తు లేకపోతే..తప్పు..మీరు ఎవరిని ఏమైనా అనొచ్చు..మీపై చిన్న ఆరోపణ చేసినా..ఆవేశంతో ఊగిపోతుంటారు..మాకో డౌట్ మిమ్మల్ని మీరు దైవాంశసంభూతులుగా..ఎవరూ అంటుకోలేనంత ినిప్పులు కడిగిన ముత్యాలా ఏంటి..మచ్చుకు ఒకటే ఒక ఉదాహరణ  ఐడిఎస్-2 ఇన్ కమ్ వాలంటరీ డిస్ క్లోజర్ స్కీమ్ కింద హైదరాబాద్ లో ఎవడో గన్నాయి గాడు నేను పదివేల కోట్లు పన్ను కడతా అని వచ్చి డిక్లరేషన్ ఇస్తే..అది వైఎస్ జగనే అని అర్ధం వచ్చేలా మీరు..మీ మంత్రులు మాట్లాడలేదా..తర్వాత సదరు గన్నాయి గాడు మానసిక జబ్బుతో అలా ప్రకటించాడని..కొద్ది రోజులకే టపా కట్టేసిన సంగతి గుర్తుంది కదా..అన్ని అబబద్దాలు చెప్పే మీరు మీపై ఎవరూ ఆరోపణలు చేయకూడదని అంటే ఎందుకు ఉలుకు..ఎటూ ఎంక్వైరీలో యెదవలే పట్టుబడతారు కదా..మీరేం చేయకపోతే మీకెందుకంత రోషం..మీ కూల్ బాబూ..

Comments