రజనీ స్పీడ్...ఆ సూపర్ స్టార్‌నే గుర్తుకు తెస్తుంది


కన్ఫామ్..కాస్త వెరైటీ..తనని యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా చూపించగలుగుతాడనే ఏ డైరక్టర్‌కైనా ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్..రజనీకాంత్ వరసగా సినిమాలు చేసేయబోతున్నాడు. 70 ఏళ్లకి దగ్గరపడ్డ ఈ యంగ్ వెటరన్ హీరో..( అనకూడదు కానీ మరి అసలు వయసు అదే కదా) కనీసం వచ్చే రెండేళ్లలో నాలుగు సినిమాలు రిలీజ్ చేయబోతోన్నాడు..పేట్ట హిట్‌తో రజనీకాంత్‌తో కొత్తగా ఎలా చేయవచ్చో చూపించిన కార్తీక్ సుబ్బరాజు ఓ రకంగా మాస్ సినిమాలకు మళ్లీ జీవం పోసాడనే చెప్పాలి..

కబాలి..కాలా..రెండూ ఆడలేదు..ఐనా వెనక్కి తగ్గలేదు..రోబో2.0 హిట్టో ఫ్లాపో తెలీదు..పట్టించుకోలేదు..పేట్టా మాత్రం
బాక్సాఫీస్ దగ్గర షేకాడించేసింది..ఓ భాషా సిినిమానే ఆ ఛాయలు లేకుండా ఎలా తీయవచ్చో కార్తీక్ సుబ్బరాజు తీశాడు..మన మధుబాబు నవలల్లో నడివయసు షాడో కనుక నడిచి వస్తే..ఎలా ఉంటుందో..అలా  తీశాడు. రిజల్ట్ సూపర్.అందుకే..ఇప్పుడు రజనీకాంత్.. మురుగదాస్‌కి ఓకే చెప్పేశాడట..ఇందులో పోలీస్ ఆఫీసర్ అని అంటున్నారు..కాదు కాదు పొలిటీషియన్ అనేవాళ్లూ ఉన్నారు..ఏదైతేనేం..చంద్రముఖి తర్వాత ఎలాగైతే..వరసగా సినిమాలు చేశాడో..ఇప్పుడు కూడా రజనీ ది బాస్..మళ్లీ ఇరగదీయబోతున్నాడు..ఇది ఫ్యాన్స్ కే కాదు..తమిళ సినిమాకి కూడా ఆనందం ఎందుకంటే..టాప్ స్టార్ నాలుగు సినిమాలు చేస్తే..ఇండస్ట్రీలో బోలెడంతమందికి పని దొరుకుతుంది కదా..

కెఎస్ రవికుమార్..(ముత్తు, నరసింహ), సురేష్ కృష్ణ ( వీరా, భాషా)కి కూడా మాంచి సబ్జెక్టులు చేసుకోమని రజనీకాంత్ సిగ్నల్స్ ఇచ్చాడని తమిళ పత్రికలు రాస్తున్నాయ్. అంటే కనీసం వచ్చే ఏడాదిలో రజనీకాంత్ వి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయ్..అసలు గత పదేళ్లలో ఈ ఊపు ఎప్పుడూ లేదు..రెండు మూడేళ్లకి ఓ సినిమా రిలీజ్ చే సే రజనీ..ఇప్పుడు దూకుడు పెంచడంతో..ఆయన పాలిటిక్స్ పై ఇప్పట్లో దృష్టి పెట్టడంటున్నారు కానీ..ఫోకస్ చేయడానికే ఇలా వరసగా చేస్తున్నాడేమో..2021కి కానీ అసెంబ్లీ ఎన్నికలు లేవు..ఈ లోపున తన ఇమేజ్ మళ్లీ ఇప్పటి కొత్త ఓటర్లకి రుచి చూపించి..అప్పుడు రంగంలోకి దిగడమే ఆయన ప్లాన్ అని అర్ధమవుతుంది.. ఈమద్యలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడమే  మంచిదని ఆయన ఫీలింగ్..ఇదే ఆయన ప్రసంగాలు కూడా చెప్తున్నాయ్..రావడం ఖాయం...కానీ ఎప్పుడనేదే కాస్త కన్ఫ్యూజన్..

కానీ ఇలా వరసగా సినిమాలు ఏజ్ బార్ అయిన తర్వాత చేయడం మాత్రం ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు తెస్తోంది..ఆయనా ఇంతే...వరసగా చేసేవాడు..ఫలితం తర్వాత పని ముఖ్యం టైపులో.. కాస్త తెలుగులో ఇదే ఒరవడి ఒక్క బాలకృష్ణ మాత్రమే ఫాలో అవుతున్నాడు..ఎన్టీఆర్ తర్వాత జోరు పెంచుతాడో..లేక స్లో అవుతాడో చూడాలి మరి..

Comments