రకుల్ ప్రీత్ సింగ్ ఉతికి ఆరేసింది




సెలబ్రెటీ స్టేటస్ ఎంత హ్యాపీనో..అంత చికాకు పెట్టిస్తుంది కూడా..దీనికి పెర్ఫక్ట్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగే..ఢిల్లీనో..పంజాబో సరిగా తెలీదుకానీ..తెలుగులో దున్నేసిన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ ప్లాట్ ఫామ్ పై యమా యాక్టివ్. ఐతే పనీ పాట లేని బ్యాచ్..ఒకటి ఏది పెట్టినా..దానిపై స్పందించకపోతే..లోకం మునిగిపోతుందనే..తన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందనో..తెగ ఫీలవుతూ..తమ అతిని ప్రదర్సించేది కూడా ఇక్కడే కదా..అలా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోపై ఓ కామెంట్ పోస్ట్ చేశాడు..అది కూడా బాగా కాలేట్లు..అక్కడికేదో ఇతగాడు చూసి..తాను టిక్కెట్లు అమ్ముకోలేకపోయినంత బాధగా పెట్టాడు..కారులో అప్పుడే ఏదో చేసి..ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి దిగుతున్నప్పటి రకుల్ అంటూ పెట్టాడు కామెంట్..ఏ లఫంగి గాడైనా ఇలా పెడతాడా..అందులో సైబర్ క్రైమ్ పోలీసులు ఆబగా  ఎవడు దొరుకుతాడా..సైబర్ చట్టాలకు తమ పవర్ చూపిద్దామని ట్రై  చేస్తోన్న తరుణంలో...

రకుల్ అలా పోలీసుల వరకూ వెళ్లలేదట..నేరుగా అతగాడి అమ్మ అబ్బా అంటూ ఏదో కామెంట్ రివర్స్ చేసిందట..దాంతో పాపం దేశోద్దారకులకు వళ్లు మండుకొచ్చిందట..ఆయ్..నువ్ ఓ ఆడదానివై ఉండి అలా పెట్టడం ఏంటి..నువ్విలా..కాదు ఇలా అంటూ ఏదేదో హితోక్తులు..ప్రవచనాలు వల్లించారు..దీంతో అసలు కామెంట్ బైట పెట్టింది రకుల్..దీంతో సోకాల్డ్ సోషల్ మీడియా ప్రవచనకారులకు నోట్లో మ..గడ్డ పడ్డట్లైందిట..ఐనా ఇక్కడ జరిగేదే పనీ పాటా లేని యవ్వారం.అలాంటిది దాంట్లో ఉచితానుచితాల గురించి లెక్చర్లు ఇద్దామనుకుంటే ఇదే జరుగుద్ది..

ప్రతి దానికీ సెలబ్రెటీ అంటే చాలు..చీప్ గా మాట్లాడటం..శునకానందం పొందడం..ఎందుకంటే..ఈ డ్యాష్ గాళ్లు తాము పెట్టే కామెంట్లు ఎవరికీ తెలీదు..ఆ..మన గురించి అంత ఎవడు పట్టించుకోబోయాడు అని పెట్రేగిపోతుంటారు..అదే ఐపీ అడ్రెస్తో పట్టుకుని దవడలు వాయగొడుతున్న రోజున జీవితంలో ఇలాంటి తప్పులు చేయం అనుకుంటారు ..అంతే ఏదైనా జరిగితేనే కదా..నేర్చుకునేది..
(మీరు చేసేదేంటి అని అడగొద్దు...నేనే సెలబ్రెటీపై చెత్త రాతలు రాయను..ఓ వేళ రాస్తే.. ఎవరైనా అభ్యంతరపెట్టవచ్చు..అలానే నేనెవరినీ నాది చదవండి..సబ్ స్క్రైబ్ అవ్వండి అని అడగను..ఆ లింక్ కూడా లేదు  ఈబ్లాగ్ లో చూడొచ్చు..ఐనా రాయడం మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే లక్షా యాభైవేల వ్యూస్..ఇది నా గొప్పతనంగా చెప్పడం లేదు..రాతలతో డబ్బులు సంపాదించడం నా పని అనుకునేవారికోసం మాత్రమే..మానిటైజేషన్ కోసం కూడా ప్రయత్నం కూడా చేయలేదు..చేయను )

Comments