మోనీష్ కానీ..మోసీన్ కానీ మహావిషాదం ఈ పసివాడి మరణం..సొసైటీదే పాపం


పసిపిల్లాడు..గిలగిల కొట్టుకుంటూ చనిపోతుంటే పట్టించుకోనంత గేటెడ్ కమ్యూనిటీలు..ఇదేదో ఒక్క పెబెల్ సిటీ నిర్లక్ష్యం కాదు..సొసైటీలోని నిర్లక్ష్యమే బాబు ప్రాణాలు పోయేలా చేసింది. కాదంటారా..ఆ వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది..పిల్లలున్న ప్రతి ఒక్కరూ గుండెలు చిక్కబట్టుకుని చూడాలి..రేపొద్దున్న అలాంటి ఆపదే మన పిల్లలకు రాదా..మనమంత సురక్షితమైన సమాజంలో ఉన్నామా..దేవుడా...ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడు అని మొక్కుకోవడం కాదు..మాకు కన్పించకుండా చేయి అని అడుక్కోవాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం


చావుకి ఒక్క పది సెకన్ల ముందు ఆ చిన్నారి ఎంత హాయిగా..కులాసాగా ఉన్నాడో చూస్తే..మరణానికి ఎంత నిర్ధయో అన్పిస్తుంది. మన చుట్టూ చావు ఎంత దగ్గరగా తిరుగుతుందో..అన్పిస్తుంది..సహజంగా వచ్చే మరణం వేరు..అదైనా ఎప్పుడైనా కబళించవచ్చు..కానీ ఇలా ముక్కుపచ్చలారని..చిన్నారులు ఏం పాపం చేశారని ఇలా ప్రాణాలు కోల్పోవాలి..ఇలాంటి పిల్లలే కదా భవిష్యత్తులో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టేది ....మాబోటి వాళ్లకేం చేతనవును..సగం జీవితం గడిచిపోయింది..కొత్తగా ఊడబొడిచేదేం లేదు..పసిపిల్లలు అరవిరిసిన మొగ్గలు..వారి నవ్వుల్లోనేగా ప్రపంచం మరిచిపోయేలా బతికేది మనం..

ఓ ప్రాణం అలా వదులుతుంటే..కాపాడగలిగీ..కేవలం పరిసరాల పట్ల స్పృహ లేకుండా బతుకుతున్న మనం ..
ఒక్కళ్లు కాకపోతే..ఒక్కళ్లకైనా ఎందుకు అటువైపు చూడాలనిపించలేదు..ఓ వేళ ఆ బాబుకే ఆ క్షణంలో ప్లీజ్ నన్నెవరైనా కాపాడండి అని అరిచే శక్తి ఎఁదుకు ఇవ్వలేదు. ఆ క్షణాల్లో ఎంత వేదన అనుభవించి ఉంటాడో కదా..
చిన్ని నాయనా..మాకే ఇలా ఉంటే..నీ తల్లిదండ్రులకెంత బాధ ఉందో కదా

Comments

  1. రాత్రి ఈ వీడియో క్లిప్పింగ్ చూసినదగ్గర నుండి బాధపడుతూనే ఉన్నాను. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించలేం.

    ReplyDelete

Post a Comment