నిన్న అక్కడ ఇవాళ ఇక్కడ రేపు ఎక్కడ...ఏంటీ కప్పల తక్కెడ

తక్కెడ రాజకీయాలు అంటే ఇవే..వెనకటికి చెరువులో కప్పలు ఎన్ని ఉఁటాయో లెక్కపెట్టేందుకు తక్కెడ పట్టుకుంటే..కొంతసేపు ఓ వైపు మరి కొంతసేపు మరోవైపు జంపవుతూ ఉన్నాయట. అలానే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ , లోక్ సభ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ-టిడిపిల నుంచి లీడర్లు పార్టీలు మారుతున్నారు. యధావిధిగానే మారే ముందు కాసింత బురద పార్టీలకు పూసి మరీ పోతున్నారు
ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా ఉంది..ఐతే తెలంగాణలో పూర్తైంది..ఇక్కడ మొదలైంది. అంతే తేడా
మనటైటిల్ జస్టిఫికేషన్ విషయానికి వస్తే..ఎస్పీవైరెడ్డి గతంలో కాంగ్రెస్..తర్వాత వైసీపీలో జాయినయ్యారు..వెంటనే గెలవగానే టిడిపిలోకి చేరిపోయారు..అంటే ఐదేళ్లపాటు గెలిచిన గుర్తుకి కాకుండా..ఇతరుల సేవలో తరించిపోయారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన తీవ్రమైన అనారోగ్యంతో..ఎక్కడున్నారో కూడా తెలీకుండా ఐపోయారు. 
బుట్టా రేణుకా అంతే..తొలుత వైఎస్సార్ కాంగ్రెస్..తర్వాత టిడిపి..రేపు ఏ పార్టీనో..ఎందుకంటే..ఇదే బాపతుగా 35ఏళ్లు ఒకటే పార్టీలో ఉన్న కోట్ల కూడా టిడిపిలోకి పోతున్నారు మరి..
ఆమంచి కృష్ణమోహన్ సంగతి చూస్తే..పాపం ఇండిపెండెంట్ కాస్తా..టిడిపి రంగేసుకున్నారు..ఇప్పుడు జగన్ పార్టీ అంటున్నారు..రేపు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ పంచన చేరతారో..
అవంతి శ్రీనివాస్ అనబడు ముత్తంశెట్టి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపి నియోజకవర్గం నుంచి  టిడిపి టిక్కెట్ పై గెలిచారు. ఇప్పుడు వెైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు..జాయిన్ అవుతుంటే కానీ చంద్రబాబు గారి అవినీతి ఆయనకు గుర్తు రాలేదు..ఈ జంపింగ్ జపాంగ్..ఫ్యూచర్ ఏంటో 2019 ఎన్నికలు పూర్తి కాగానే తెలిసిపోతుంది..

ఇక ప్రకాశం జిల్లా రాజకీయాల్లో స్వచ్చంద విరమణ చేసుకున్న దగ్గుబాటి వారిదైతే మారని పార్టీ లేదు..కాకపోతే ఆ ముద్ర పాపం పురంధీశ్వరికే సొంతం..కాంగ్రెస్ ఎంపిగా మారి కే్ంద్రమంత్రిగా కూడ ాపని చేసిన ఆమె..తర్వాత బిజెపిలో జాయిన్ అయ్యారు..ఇప్పుడు ఆమె కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయినయ్యారు. అవసరమైతే ఆమె కూడా
పాలిటిక్స్ నుంచి తప్పుకుంటామని చెప్తున్నారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణా ఇంతే..కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్యలో ప్రజారాజ్యం..ఇప్పుడు అటు జనసేన కానీ..లేదంటే టిడిపి కానీ అంటున్నారు..
నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ లో ఓ బ్రదర్ చనిపోగా..పెద్ద బ్రదర్ రామనారయణరెడ్డి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనా మొన్నటిదాకా కాంగ్రెస్...తర్వాత టిడిపి..ఇప్పుడు జగన్ పార్టీ..రేపు...?

ఇక అన్నింటికన్నా హైలైట్..జేసీ ఎపిసోడ్..కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చి టిడిపిలో జాయిన్ అయ్యాడీయన..చావనైనా చస్తాను కానీ..టిడిపిలో కానీ వేరే పార్టీలో కానీ ఎట్టా చేరతా..అన్న నోటితోనే కాంగ్రెస్ సచ్చిపోయిందన్నాడు..ఇవాళ్టి వరకూ టిడిపిలో ఉన్నాడు..రేపెక్కడ..?

ఇక ఎటూ  పాలుపోని జంక్షన్లోని జవరాళ్లలాగా ఎదురుచూసేవాళ్లూ ఉన్నారు..వాళ్లలో కొణతాల రామకృష్ణ, మైసూరారెడ్డి, సబ్బంహరి,  ఉండవల్లి..కావూరు సాంబశివరావు, లగడపాటి.. దాడి వీరభద్రరావ్, వంగ గీతలు..వాళ్లలో ప్రముఖులు




Comments