టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పరిస్థితి ఏంటి..టీమ్‌లో ఇక ప్లేస్ లేనట్లేనా..రిటైర్‌మెంట్ ప్రకటించడం తప్ప ధోనికి వేరే దారి లేదా..టీమిండియాకి రెండు వాల్డ్‌కప్‌లు అందించిన గ్రేట్ ప్లేయర్ ఎంఎస్ ధోని ..మహా అయితే ఓ ఫేర్వెల్ సిరీస్‌కి మాత్రమే ధోనిని టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయ్. బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ క్లియర్‌గా సిగ్నల్స్ ఇచ్చేశాడు.
బంగ్లాదేశ్ సిరీస్‌కి టీమ్ ప్రకటించిన సమయంలో ఇక ధోనికి చోటు లేదనే సంకేతాలు ఇచ్చారు. అతనిని దాటి జట్టు గురించి ఆలోచించడమంటే ఇక జట్టులో ప్లేస్ గురించి ధోని ఆశలు వదులుకోమనే అర్ధం. ఈ పరిణామానికి ధోని కూడా పూర్తిగా రెడీ అయినట్లే అనుకోవాలి..ఎందుకంటే సెలక్షన్ కమిటీ కూడా ఇప్పటికే ధోనితో మాట్లాడిందట..ధోని కూడా ఆ సమయంలో తన మనసులో మాట చెప్పే ఉఁటాడు పైగా బిసిసిఐ ప్రెసిడెంట్ గంగూలీ కూడా ధోనిని గౌరవించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చాడు..తన హయాంలో ఎవరికీ అవమానం జరగదన్నాడు..వీటి అర్ధం ధోనికి ఓ సిరీస్ ఆడే ఛాన్స్ ఇవ్వడమేనంటారు..ఆ సిరీసే బహుశా ధోనికి చివరిది అవుతుంది..
వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కాకుండా..ధోని మిస్టర్‌కూల్‌గా పాపులర్..టీమ్‌లో ఏ టైమ్‌లో అయినా తనకేదైనా ఇబ్బంది వస్తే..ధోనివైపే చూస్తానంటాడు కోహ్లీ..అలాంటిది ఇప్పుడు ఫేర్వెల్ టైమ్ వచ్చింది కాబట్టే..కోహ్లీ కూడా సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ధోని సంగతి అడిగితే నవ్వేశాడే తప్ప బదులు చెప్పలేదు..దానికి తోడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ధోని ప్లేస్‌లో పంత్‌ని సెలక్షన్ కమిటీ ఎంకరేజ్ చేస్తుందని తెలిసిపోతూనే ఉంది..ఎంతటి ఆటగాళ్లకైనా నిష్క్రమణ అనేది భాధాకరమైన విషయమే..ఐతే ధోనిలాంటి వాళ్లు మాత్రం దాన్ని చాలా సాఫిగా చేస్తారని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు..కోహ్లీదీ అదే మాట..ఈ విషయంలో ధోని కూడా లైట్ తీసుకున్నట్లే ఉంది.. బంగ్లాదేశ్ సిరీస్ ఐన తర్వాత ధోని నుంచి ఓ మాట మనం వినవచ్చు
ఐతే...ఇంకో ఛాన్సుందిగా మనకి..ఐపిఎల్ లో మాత్రం బ్రహ్మాండంగా మనోడి హెలికాప్టర్ షాట్స్ చూడొచ్చు
Comments
Post a Comment