డబ్బులిచ్చి కొనే జనాలకి ఈనాడు దక్కిన ప్రతిఫలం సంపాదకీయాల పేరుతో సొంత అభిప్రాయాలు

మనం డబ్బులిచ్చి కొంటాం...కాబట్టి ఏదైనా హక్కు మనకి ఉంటుంది..ఫ్రీగా రోడ్డుపై పడేస్తేనో...టీ స్టాళ్ల దగ్గర కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుని పోతుంటేనే విమర్శించే హక్కు లేదనొచ్చు..కానీ డబ్బులు పెట్టి కొనేవాడిని గౌరవించే సంస్కారం ఏ కోశానా కన్పించదా ఈ పేపరోళ్లకి..ఫస్ట్ పేజ్ అంటే..ముఖచిత్రం..అందులోనైనా కనీసం వార్తలే రాయాలని అంటారు..ఇదేం రూల్ కాదని చెప్పొచ్చు...నిజమే రూల్ కాదు..కానీ మరి చదివేవాడు కూడా న్యూస్ కోసం చూడకూడదా...! చూస్తాడు..అందులోనూ ఇప్పుడు ఏ పేపర్ దేనికి బాకానో పూర్తిగా అర్ధమైన తర్వాత ఫస్ట్ పేజ్ లో ఏముంది..లాస్ట్ పేజ్ లో ఏముంది ఇవన్నీ చూసిన తర్వాతే ఏ పేపర్ తనకి కాస్త ఎంటర్ టైన్ మెంట్..జీకే ఇస్తుందో అదే చూస్తారు..

మరి ఇవాళ న్యూస్ పేపర్ చూస్తే..ఇదిగో ఫస్ట్ పేజ్ మొత్తం ఇలా సంపాదకీయాలే..గుండె పగిలిన రైతులు...ఇది వార్త కాదు..ప్రత్యేక పరిశీలన కథనాలట..అంటే ఏంటి ఎందుకు చనిపోయారో ఖచ్చితంగా చెప్పలేని నిస్సహాయత..గట్టిగా మీ వల్లనే చనిపోయారు అని రాస్తే పాపం వచ్చే యాడ్స్ రావనే అసమర్ధత..డైరక్ట్ గా రాయకుండా..తలుపు చాటు నుంచి కేకలు పెడుతున్నట్లు రాతలు...

ఫస్ట్ హెడ్డింగ్ దొంగలతో దోస్తీ అట..ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటే..ఏదో మనోళ్లకి అయినవాళ్లకి ఎక్కడో చురుకు పుట్టి ఉండాలి...రెండో కార్పోరేట్ వైద్యాల సంగతి కూడా అంతే..మన అధినాయకత్వానికి ఎక్కడో బిల్లుల్లో తేడా వచ్చి ఉండాలి...లేకపోతే ఈ రెండు విషయాలు సమాజంలో విడదీయలేని వ్యవస్థల్లో అల్లుకుపోయిన నేరాలే...పోలీస్..వైద్య వ్యవస్థల్లో నిజంగా మార్పు కోరేవాడైతే..కనీసం అలా కోరుకుంటున్నట్లు నటించేవారైతే..ఏదీ ఒక్క నెల రోజులు...రోజూ ఒక జిల్లాకేంద్రంలో ఎన్నెన్ని నేరాలు జరుగుతున్నాయో రాయమనండి ఈ రెండు రంగాల్లోనే...

ఇక పైన వార్త చూడండి.రాసింది డిజిటల్ వింగ్ అమరావతి అట..మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు పొడిగించని రాయడం..అంటే అమరావతి ఎక్కడ ఉంది..సరే ఆ వార్త హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లకి ఎందుకు...సరే వార్త కాబట్టి రాశారనుకుంటే..ఈనాడు అమరావతి డిజిటల్ అని ఎందుకు పెట్టాలి...మీ ఇష్టమా సరే..


ఇది చూడండి..ఏ రాష్ట్రమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే గొప్ప విషయమే...ఆర్ధిక మాంద్యం ముంచెత్తుతుంటే..పదిశాతం గ్రోత్ ఎంత గొప్ప విషయం..అలాంటిది దీన్ని కూడా తక్కువ చేసి రాయడమేంటి.. పైగా అంచనాలను అందుకోని రాబడులట..అంటే అంచనాలు ఘనంగానే పెట్టుకుంటాం..కరోనాలు...మాంద్యాలు వెంటాడుతున్నా దూసుకుపోతున్న రాష్ట్రంపై ఇలాంటి చిన్న చిన్న కామెంట్లు కూడా కడుపు మంట కలిగిస్తాయి..రాసేటప్పుడు  జాగ్రత్త వద్దా..లేకపోతే వ్యూయర్ ఇంట్రస్ట్ మీకు అనవసరమా...!

Comments

  1. This is an excellent post on the current yellow journalism in Andhra.

    ఈ వ్యాసం చదివి ఈనాడు జర్నలిస్టులు యాజమాన్యం సిగ్గుతో తల దించుకోవాలి.

    The person who coined the word 'presstitutes' deserves award.

    ReplyDelete

Post a Comment