నిజ మే నా మే 21 కల్లా కరోనా హాం ఫట్ వాస్తవ మే నా..?


ఎండ్ ఈజ్ నియర్
అంతం దగ్గరకు వచ్చేసింది
ఏందిరా సామీ ఎవరి అంతం అని విరుచుకపడకండి..
కరోనా అంతానికి ఆరంభం మొదలైందట..మే 21 నాటికల్లా దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రకటించింది..రోజూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బెంబేలెత్తుతున్న  మనకి ఇది ఓ గుడ్‌న్యూస్‌గానే చెప్పాలి..
 ..అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే..దేశంలో చాలామటుకు ప్రాంతాల్లో మే 7 నాటికల్లా కరోనా కేసులు తగ్గిపోతాయంటూ ముంబై స్కూల్ ఆప్ ఎకనమిక్స్  పబ్లిక్ పాలసీ రిపోర్ట్ ఓ రీసెర్చ్ చేసిందట.ఐతే అప్పటిదాకా కేసులేం తగ్గవని..ఇంకా జాగ్రత్తగా ఉంటేనే కరోనా వైరస్ స్ప్రెడ్ పీక్ స్టేజ్‌కి వెళ్లి అక్కడ్నుంచే తగ్గుముఖం పడుతుందని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పాలసీ అధ్యయనం హెచ్చరించింది..

 కరోనా కేసుల్లో హాట్ స్పాట్స్‌గా మారిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు చాలా ఇబ్బందికరంగా మారతాయని MSSPP రిపోర్ట్ తెలిపింది..మహారాష్ట్ర, , వెస్ట్ బెంగాల్,యూపి,రాష్ట్రాల్లో అంత తొందరగా పరిస్థితి సద్దుమణగదని కూడా హెచ్చరించింది..చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా వైరస్ ఎలా విస్తరించిందో..ఎలా రోజురోజుకీ విజృంభించిందో..ఆ డేటాని మన దేశానికి అన్వయిస్తూ..ముంబై సంస్థ ఈ అధ్యయనం చేసింది..

 MSSPP రీసెర్చ్  తయారు చేసిన నీరజ్ హటేకర్, పల్లవి బెల్హెకర్‌లు అంచనా ప్రకారం దేశంలో ముందుగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్ రాష్ట్రాల్లో మే 7నాటికి అత్యధిక కేసులను నమోదు చేసి అక్కడ్నుంచి తగ్గుముఖం పడతాయ్..ఢిల్లీలో మే 7 నాటికి 3744, గుజరాత్‌లో4833, మధ్యప్రదేశ్ 2432, రాజస్థాన్-2808 కేసులు నమోదవుతాయ్.ఐతే మహారాష్ట్రలో మాత్రం పీక్ డేట్ మే 21గా అంచనా వేసారు..ఇక్కడ మే 21నాటికే 24,222మందికి వైరస్ సోకుతుందని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ పబ్లిక్ పాలసీ అధ్యయనం అంచనా వేసింది..అలానే వెస్ట్ బెంగాల్‌లో కూడా మే 21 క్రిటికల్ డేట్ అని..అప్పటికి ఈ రాష్ట్రంలో 2173 కేసులు నమోదవుతాయని చెప్పింది..ఉత్తరప్రదేశ్‌లోమాత్రం మే 10 వరకూ వైరస్ ఉధృతి కొనసాగుతుందని.. ఆ తేదీనాటికి 3182 కేసులు నమోదవుతాయని లెక్క గట్టింది.. ఐతే ఈ  జాబితాలో ఇప్పటికే గుజరాత్‌లో రిపోర్ట్‌లో చెప్పిన మేర కేసులు నమోదైన సంగతిని గుర్తు చేయగా..అందుతున్నడేటాని బట్టి  ఎండ్ డేట్స్ మారే అవకాశాలుందని అధ్యయనాన్ని తయారు చేసిన పరిశోధకులు చెప్తున్నారు..
పైగా ఈ ఎండ్ డేట్స్ కూడా...వైరస్ నివారణకు తీసుకునే జాగ్రత్తలు, లాక్‌డౌన్‌లోని నిబంధనల అమలను బట్టే ఉంటాయని సంస్థ తెలిపింది.. సోషల్ డిస్టన్స్, శుభ్రత వంటి అంశాలతోనే మే 21కి తర్వాత కరోనా నుంచి దేశం విముక్తి పొందే వీలుందని విశ్లేషించారు. ఈ క్రమంలో మే నెల రెండు వారాలు దేశానికి కీలకంగా మారతాయన్నారు..ఇదే క్రమంలో వైరస్ నిరోధంలో రిస్క్ పాయింట్లుగా వలసకూలీల స్వగ్రామాలకు పయనాన్ని ఈ అధ్యయనం గుర్తించింది..ఈ కూలీల్లో ఎవరికైనా వైరస్ సోకి ఉంటే ఇక గ్రామీణ భారతంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో వ్యాప్తి చెందే ప్రమాదాన్ని హెచ్చరించారు..
ఏదెలా అయితేనేం  ఓ గుడ్ న్యూసే కదా...ఎప్పుడూ భయపెట్టడమేనా...మే లోనే పోతుందనుకోండి అంతే

Comments