ఏడుకొండలసామిని దర్శించాలి..వీలైనన్నిసార్లు దర్శించుకోవాలనే కోరిక ప్రతి భక్తుడికి ఉంటుంది..కానీ ఇప్పుడు కరోనా కాలంలో స్వామివారిని దర్శించుకోవడం ఆగిపోయింది..ఐతే ఇకపై కనీసం ఆరు నెలలపాటు..స్వామి దర్శనం కోసం మరింత ప్రియంగా ఎదురు చూడాల్సి రావచ్చు..ఇది ఖాయం..
ఇదివరకటిలాగా రోజుకి 90వేలమంది..లక్షమంది దర్శించుకునే పరిస్థితి లేదు..అలానే ఎప్పుడంటే అప్పుడు బయలుదేరగలమేమో కానీ..కొేండపైన స్వామిని దర్శించుకోవడం మాత్రం కుదరకపోవచ్చేమో...కానీ సామి తలుచుకుంటే అదెంత సేపులెండి..కరోనా ఉఫ్ మంటూ నెలలోపే మాయమైనా కావచ్చు..అది దైవమహిమకి సంబంధించిన విషయం కానీ..ఇక్కడ మనకి ఉన్న పరిస్థితుల ప్రకారం మాత్రం ఇక స్వామిని చూడాలన్న తపన మరింత పెరిగిపోవడం ఖాయం..ఎందుకంటే..ఆంక్షలు పెట్టేకొద్దీ మనసు అటువైపే లాగుతున్నట్లే...తిరుమలకి వెళ్లి చూడాలన్న కోరిక ఇప్పుడు తీరడానికి ఇఁకా ఎదురు చూడాల్సి రావచ్చు..
దర్శనానికి వచ్చేదే 25వేలమందికి మించకపోవచ్చు..ఇక నిత్య అన్నదానాలు కానీ..ఇతర సేవలు కానీ..గతంలో అంతటి వైభవంగా జరగకపోవచ్చు..ప్రతి విషయం..ఇక తిరుమలలో ప్రియమే...
సోషల్ డిస్టెన్స్...వ్యక్తిగత శుభ్రత అనేదే ఇక్కడ ప్రముఖమైన అంశం...కానీ ఎలా వాటిని పాటిస్తారా లేదా అనేదే ిఇక ఆలోచించాలి..ఎందుకంటే..తిరుమల ఎంత భక్తిధామమో..జనాలు యధేచ్చగా తిరగడానికి కూడా అంతే ఆవాసం..
కానీ తిరుమలకు వెళ్లలేకపోతున్నామన్న బాధ మాత్రం లాక్‌డౌన్ సమయంలో మరింత పెరిగిపోతోంది..
అవును తిరుమల ఆలయం భక్తులు దర్శనం ఇన్ని రోజులుగా లేకపోవడం బాధాకరం. త్వరలో దర్శనం ప్రారంభం కావాలి. అయితే ఎక్కువ రద్దీ లేకుండా తోసుకోకుండా రోజుకు పదివేలు మించకుండా దర్శనాలు చేసుకుంటే బాగుంటుంది.
ReplyDelete