కరోనా వైరస్ దేశంలో సగంమందికి సోకడం ఖాయమని...65కోట్లమంది శరీరాల్లో వైరస్
చాప కింద నీరులా వచ్చి చేరడమే కాదు..వెళ్లిపోవడం కూడా జరుగుతుందని డాక్టర్ రవి అనే ఓ వ్యక్తి చెప్తున్నాడు..
కర్నాటక హెల్త్ టాస్క్‌ఫోర్స్ నోడల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తోన్న ఈ రవి..ఈ ఏడాది పూర్తయ్యేసరికి దేశంలోని సగం జనాభాకి మహమ్మారి సోకుతుందని బెంబేలెత్తిస్తున్నాడు....అంతేకాదు అందులో 90శాతంమందికి
తాము మహమ్మారిని మోసుకుంటూ తిరిగామని కూడా తెలుసుకోలేరంటున్నారు. డిసెంబర్ నాటికి శరీరంలోకి ఎప్పుడు వచ్చిందీ లేనిదీ కూడా తెలీకుండా అయిపోతుందట పరిస్థితి..
కర్నాటకలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లోని న్యూరోవైరాలజీ హెడ్‌గా ఉన్న వి రవి అభిప్రాయం ప్రకారం కరోనా అసలు రూపాన్ని భారత్ ఇంకా చూడలేదు.. అసలు స్వరూపం జూన్ నుంచి.. చూస్తారని దానికి కారణం లాక్‌డౌన్ ఎత్తివేయనుండటమేనంటారు. ఇక అప్పట్నుంచి కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోతుందట
లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులతో కేసులు పెరుగుతాయనేది ప్రపంచఆరోగ్యసంస్థ నుంచి.. ప్రతి ఒక్కరూ హెచ్చరించేదే.. డాక్టర్ రవి చెప్తున్నదాని ప్రకారం భారతదేశంలోని సగం జనాభాకి అంటే దాదాపుగా 65కోట్లమందికి వైరస్ సోకినా... అందులో 90శాతంమందికి అసలు ఆ విషయమే తెలీకుండానే జరుగుతుంది.. అంటే యాభైఎనిమిదిన్నర కోట్లమందికి వైరస్ ముప్పు ఉండదని దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలేమో. మిగిలినవారిలో కూడా
ఐదు నుంచి పదిశాతం మందికి మాత్రమే ట్రీట్‌మెంట్ అవసరం ఉంటుంది..వారిలో కూడా ఇంకో ఐదుశాతంమందికే వెంటిలేటర్ సపోర్ట్ కావాల్సి రావచ్చని ఈ అంచనాని బట్టి అర్ధమవుతోంది..ఐతే భారీ జనాభా ఉన్న దేశం కాబట్టి..కోటిమందిలో ఐదుశాతం అనుకున్నా..50వేలమందికి వెంటిలేటర్‌పై చికిత్స అవసరం కావాల్సి రావచ్చు..ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలన్ని కూడా తమ నిధులన్నీ వైద్యరంగంపైనే ఖర్చు పెట్టాలంటూ డాక్టర్ రవి చెప్తున్నాడు..
వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఈ ఏడాదిలో లేవు కాబట్టే..ప్రజలే స్వచ్ఛందంగా..స్వీయనియంత్రణతో బతకడం అలవాటు చేసుకోవాలని ఇప్పటికే అందరికీ చెప్తున్నారు..ఐనా మరి వినేదెవరో..విననిదెవరో..వాడి జీవితం అసలు ఈ సోకడమేదో ఇప్పటికే సోకి తగ్గిపోయిందని చెప్పకూడదా హ్యాపీగా నిద్రపోవచ్చు
Comments
Post a Comment